breaking news
Virtual riyalati Technology
-
వావ్ కైరా! ఎందుకమ్మా.. నీకు ఇంతమంది ఫ్యాన్స్?
ఆమె పేరు కైరా భూమ్మిదికి వచ్చి ఆర్నెళ్లు కూడా కావడం లేదు అప్పుడే ఆమెకు ఇన్‌స్టాలో యాభై వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంతటి ఫాలోయింగ్ ఉందంటే ఆమె తల్లిదండ్రులెవరో సెలబ్రిటీలు అనుకుని పొరపడకండి. ఆమెకు అసలు తల్లిదండ్రులే లేరు! మరి ఆమెకు ఇంత మంది ఫాలోవర్లు ఎందుకు ఉన్నారని సందేహం వస్తోందా? తప్పకుండా రావాలి మరి. ఎందుకంటే పుట్టుక నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారే వరకు కైరా ప్రతీ అడుగు ఓ సంచలనమే. కైరా పేరుతో ఓ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ 2022 జనవరిలో ఖాతాను ప్రారంభించింది. ఇందులో వర్చువల్‌గా క్రియేట్ చేసిన ఓ యువతిని కైరాగా పేర్కొంటూ పోస్టులు చేసింది. ఈ వర్చువల్ కైరా మాట్లాడగలదు, డ్యాన్స్ చేయగలదు, పాటలు కూడా పాడగలదు. ఒకటేమికి ఆకట్టుకునే రూపంతో రంజిపచేసే కళలు తోడవటంతో జెట్ స్పీడ్‌తో ఆమె ఫాలోవర్లు పెరిగిపోయారు. కేవలం ఆర్నెళ్లలోనే యాభై వేలకు మించి ఫాలోవర్లను సాధించింది. ఈ సంఖ్య సెకన్ల ముళ్లుతో పోటీ పడుతూ పరుగులు పెడుతోంది. ఏంటా స్పీడు ముగ్గమనోహరమైన కైరా రూపానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. కైరా అప్డేట్స్ కోసం ఫాలోవర్లుగా మారారు. ఆమె నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజ్ పెరిగి పెరిగి కేవలం ఆరు నెలల్లోనే ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ స్థాయికి చేరుకుంది. ఏదైనా విషయానికి ప్రచారం కల్పించడంతో పాటు ఏదైనా బ్రాండ్‌ను ప్రమోట్ చేసే స్థాయికి కైరా చేరుకుంది. కైరా వెంట కుర్రకారు కైరా అందానికి ఇండియన్ కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. కైరా ఫాలోవర్లలో 90 శాతం మంది భారతీయులు ఉండటమే ఇందుకు ఉదాహారణ. అందులోనూ 18 నుంచి 30 ఏళ్ల వయసులోపు ఉన్న వాళ్లే ఎక్కువ. మళ్లీ ఇందులో అర్బన్, మెట్రో యూత్ ఎక్కవగా ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం కైరా అప్డేట్స్ కోసం అర్రులు చాచి ఎదురు చూస్తున్న వారిలో బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మాదాబాద్ వంటి నగరాలకు చెందిన వారే ఉన్నారు. ఫస్ట్ వర్చువల్ ఇప్పటి వరకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌పై ఎంతో మంది సోషల్ మీడయా ఇన్ఫ్లూయెన్సర్లుగా ఎదిగారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఉన్నారు. కానీ దేశంలో తొలిసారిగా ప్రాణం లేని ఓ కల్పిత వర్చువల్ మనిషి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ స్థౠయికి రావడం విశేషం. దీంతో ఇటీవల ఈ వర్చువల్ 3డీ కైరా రాజస్థాన్‌లోని హవా మహాల్ ఎదుట షూట్ నిర్వహించారు. ఇందులో వ్యాక్సినేషన్ ప్రమోషన్ కార్యక్రమాన్ని కైరా చేత చేయించారు. ఎంతందంగా ఉన్నావే కైరాకు పెరిగిన క్రేజ్‌ను చూసి టెక్నాలజీ, ఫ్యాషన్, గ్యాడ్జెట్ సెకార్ట్ల నుంచి తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలంటూ ఆర్జీలు పెరిగిపోతున్నాయట, మరోవైపు రోజురోజుకి కైరాకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. వర్చువల్ అని తెలిసి కొందరు తెలియక మరికొందరు నీ అందానికి సీక్రెట్స్ ఏంటి అంటూ కైరా వెంటపడుతున్నారు. మరీ ఈ క్రేజ్ చివరకు ఏ ఎత్తులకు చేరుకుంటుందో? ఏ మలుపు తీసుకుంటుందో చూడాలంటే మరికొంతవ కాలం వేచి చూడాల్సిందే! చదవండి: అదిరిపోయే ఆఫర్.. జాబ్ వదిలేస్తే లక్ష డాలర్లు ఇస్తాం! ఇంకా.. -
అదిరిపోయే టెక్నాలజీని ఎంతమంది వినియోగించుకోవచ్చో తెలుసా?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో అదిరిపోయే టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. హారిజోన్ వర్క్ రూమ్ అని పిలిచే ఈ వర్చువల్ రియాలిటీ యాప్ ఎలా పనిచేస్తుందనే అంశంపై కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భవిష్యత్ 'మెటావర్స్' : మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ మాట్లాడుతూ.. తాము డెవలప్ చేస్తున్న హారిజోన్ వర్క్ రూమ్ యాప్ ఫ్యూచర్ 'మెటావర్స్' అని కామెంట్ చేశారు. మెటావర్స్ అంటే వర్చువల్ రియాలిటీ స్పేస్. ఇది కంప్యూటర్ జనరేటెడ్ ఎన్విరాన్ మెంట్‌ను క్రియేట్ చేస్తుంది. మీరు ఎక్కడో ఉన్నా ఒకే రూమ్‌లో ఎదురెదుగా ఉన్నారనే ఫీలింగ్‌ను కలిగిస్తుంది. ప్రస్తుతం ఫేస్బుక్ బిల్డ్ చేస్తున్న ఈ యాప్‌ను ఓకులస్ క్వెస్ట్ 2 హెడ్సెట్ (Oculus Quest 2 headset) వినియోగదారులు ఉచితంగా వినియోగించుకోవచ్చని ఫేస్బుక్ ప్రతినిధులు చెబుతున్నారు. ఎంత మంది వినియోగించుకోవచ్చు రాయిటర్స్ ప్రకారం..ఫేస్బుక్ సంస్థ ఇంటర్నల్‌గా జరిపే మీటింగ్‌లో ఈ హారిజన్ వర్క్ రూమ్‌ను వినియోగిస్తుంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ రియాలిటీ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ బోస్వర్త్ మాట్లాడుతూ..క్వెస్ట్ 2 హెడ్సెట్ల సాయంతో వర్చువల్ రియాలిటీలో జరిగే వీడియో కాన్ఫిరెన్స్‌లో 16 మంది నుంచి 50 మంది వరకు పాల్గొనవచ్చని తెలిపారు. చదవండి : మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి..! -
వీఆర్ టెక్నాలజీతో 3 నిమిషాల్లో దర్శనం
తిరుపతి ఎడ్యుకేషన్: వర్చువల్ రియాలటీ (వీఆర్) టెక్నాలజీతో కేవలం మూడు నిమిషాల్లోనే శ్రీవారిని దర్శించుకున్న అనుభూతిని పొందవచ్చని ఇమేజినేట్ సంస్థ ఎండి హేమంత్ సత్యనారాయణ తెలిపారు. ఇస్కా మీడియా సెంటర్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన శాస్త్ర సాంకేతిక సదస్సును ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో నిర్వహిస్తున్నందున ప్రభుత్వం తమను సంప్రదించిందన్నారు. తిరుమలకు అందరూ కాలి నడకన వెళ్లరని, అలాంటి వారికి కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనుభూతి కలిగేలా యాప్‌ను రూపొందించాలని ప్రభుత్వం కోరినట్లు తెలిపారు. దీనికోసం అలిపిరి తొలిమెట్టు, నడకదారిలోని తొలి గోపురం, గాలి గోపురం, మోకాలి పర్వతం, తిరుమల ప్రవేశమార్గం, శ్రీవారి ఆలయం ముందు వరకు నాలుగు కెమెరాల ద్వారా చిత్రీకరించి శ్రీవారిని దర్శించుకునే అనుభూతిని కల్పించేలా ఈ యాప్‌ను రూపొందించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధి కుమార్ పాల్గొన్నారు.