venkaiha naidu
-
ప్రజాస్వామ్యంలో ఫిరాయింపులు సరికాదు
-
వెంకయ్యకు ఘనంగా పౌరసన్మానం
హైదరాబాద్: ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన తెలుగు నేత ఎం. వెంకయ్య నాయుడుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఘనంగా పౌరసన్మానం నిర్వహించింది. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ వేడుకలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా వెంకయ్యనాయుడును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, గవర్నర్ నరసింహన్ సన్మానించారు. ఈ కార్యక్రమానికి సీఎం, గవర్నర్‌తోపాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. వెంకయ్యనాయుడు అద్భుతమైన వక్త అని కితాబిచ్చారు. ఆయన గురించి తెలియని వారు ఎవరూ లేరని, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నతస్థానానికి ఆయన వచ్చారని చెప్పారు. '80లలో నేను వెంకయ్యనాయుడును తొలిసారి చూశాను. విద్యార్థి దశ పూర్తిచేసుకొని నేను విప్లవ రాజకీయాలవైపు ఆలోచిస్తున్న సందర్భం అది. ఎమర్జెన్సీ కాలంలో జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం సుబ్రహ్మణ్యస్వామితో కలిసి వెంకయ్యనాయుడు సిద్దిపేట వచ్చారు. అప్పుడు తొలిసారి ఆయన ఉపన్యాసాన్ని విన్నాను. మొదట్లో ఆయన ఉపన్యాసంలో వ్యంగ్యం ఎక్కువ కనిపించేది. కానీ ఆ తర్వాత ఆయన ఉపన్యాసంలో వ్యంగ్యం, రౌద్రం, హాస్యం, లాలన పూరితమైన సామరస్యం అన్ని సమపాళ్లలో కనిపించి శ్రోతలను అలరించాయి. ఆయన గొప్ప వక్త ఎదుగడం వెనుక ఎంతో కృషి ఉంది' అని కేసీఆర్ అన్నారు. వెంకయ్యనాయుడు గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి అని, ఆయనను గౌరవించుకునే ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సన్మాన వేడుక అనంతరం దిల్కుషా అతిథి గృహ ప్రాంగణంలో వెంకయ్యనాయుడకు విందు ఏర్పాటు చేశారు. -
'హైదరాబాద్ అంటే నాకు ఎంతో ఇష్టం'
హైదరాబాద్: తెలంగాణతో, హైదరాబాద్ నగరంతో తనకున్న అనుబంధాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తుచేసుకున్నారు. రాజ్‌భవన్‌లో తనకు ఘనంగా పౌరసన్మానం నిర్వహించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. 'హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని నేను రాజకీయాల్లో ఎదిగాను. హైదరాబాద్ నగరమన్నా, తెలంగాణ ప్రాంతమన్నా నాకు ఎంతో ఇష్టం. తెలంగాణలో నేను పర్యటించని తాలూకా, మండలం లేదంటే అతిశయోక్తి కాదు. అనేక పర్యాయాలు నేను పర్యటించాను. విభిన్న మతాలు, విభిన్న సంప్రదాయాలు, విభిన్న ప్రజల మేలు కలయిక తెలంగాణ. ఇది ఒక మినీ భారత్' అని వెంకయ్య అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ నగరమే బ్రాండ్ అని చెప్పారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కలిసి కలహించుకోవడం కన్నా.. విడిపోయి సహకరించుకోవడం మిన్నా అని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. 'మనమందరం తెలుగువాళ్లమే. తెలుగువాళ్లంతా కలిసి ఉండాలి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉభయకుశలోపరిగా పనిచేయాలి. కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నా.. వాటిని కూర్చోని సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. ఇద్దరు సీఎంలు కలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేయాలి' అని అన్నారు. ఈ సందర్భంగా దివంగత ప్రముఖ కవి సీ నారాయణరెడ్డిని వెంకయ్యనాయుడు స్మరించుకున్నారు. తెలుగు సంప్రదాయం, కట్టుబొట్టు, భాష, యాస, గోస గురించి సీనారే చెప్పిన పద్యాన్ని ఉటంకించారు. తెలుగు భాషకు ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అయితే, ఇంగ్లిష్ భాషకు తాను వ్యతిరేకం కాదని, తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరముందని గుర్తుచేశారు. చదవండి: వెంకయ్యకు ఘనంగా పౌరసన్మానం