breaking news
unity for run
-
జాతి గుండెల్లో ఉక్కు మనిషి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఐక్యతకు కృషి చేసిన సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్‌ను గత పాలకులు నిర్లక్ష్యం చేసినా.. జాతి మాత్రం మరువదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పటేల్ 142వ జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ఐక్యతా పరుగును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. అనంతరం మేజర్ ధ్యాన్‌చంద్ మైదానంలో మోదీ ప్రసంగించారు. ‘‘స్వాతంత్ర్యానంతరం దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు పటేల్ చేసిన కృషి అమోఘనీయం. భారతదేశం భిన్న మతాల, సంస్కృతుల సమ్మేళనం. అలాంటి దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చేందుకు అహర్నిశలు ఆయన కృషిచేశారు. అంతటి మహనీయుడి జయంతి వేడుకలపై గత పాలకులు పక్షపాతం చూపారు. కానీ, దేశ ప్రజలు మాత్రం ఆయన్ని ఎప్పుడూ తమ గుండెల్లో నిలుపుకుంటారు’’ అని మోదీ తెలిపారు. జాతి పునర్నిర్మాణానికి కృషి చేసిన ఉక్కుమనిషికి నేటి యువత గౌరవం ఇవ్వటం విశేషమని ఆయన తెలిపారు. వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించటంపై తమ ప్రభుత్వం ఎంతో గర్వపడుతుందని మోదీ పేర్కొన్నారు. ఇంకా ఇదే వేదికపై నేడు ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా ఆయన ఉక్కు మహిళ గురించి ప్రస్తావించారు. ఇక ఐక్యతా పరుగు కార్యక్రమంలో 20,000 మంది పాల్గొనగా.. వారిలో పీవీ సింధు, మిథాలీ రాజ్ లాంటి సెలబ్రిటీలు ఉన్నారు. అంతకు ముందు పటేల్ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు, మోదీ, రాజ్‌నాథ్ సింగ్ లు నివాళులర్పించారు. ఇందిరమ్మకు ఘన నివాళులు మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 33వ వర్థంతి సందర్భంగా పలువురు ప్రముఖులు శక్తిస్థల్ వద్దకు క్యూ కట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్, ఇందిర మనవడు- కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు ఘాట్ వద్ద ఆమెకు నివాళులర్పించారు. -
అది దేశ సమైక్యతకు గొడ్డలిపెట్టు
సిక్కుల ఊచకోతపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య ఘనంగా సర్దార్ పటేల్ 139వ జయంతి వేడుకలు పటేల్‌చౌక్ వద్ద మోదీ నివాళి, ‘జాతీయ ఐక్యతా దినం’గా ప్రకటన ఐక్యతా పరుగులోనూ పాల్గొన్న ప్రధాని న్యూఢిల్లీ: శతాబ్దాలుగా అల్లుకుపోయిన భారత సమైక్యతా భావనకు సరిగ్గా 30 ఏళ్ల క్రితం జరిగిన సిక్కుల ఊచకోత ఘటన గొడ్డలిపెట్టువంటిదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 139వ జయంతి సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని పటేల్‌చౌక్ వద్ద నిర్వహించిన ‘సమైక్యతా పరుగు’ కార్యక్రమంలో ప్రధాని స్వయంగా పాల్గొన్నారు. ఉక్కుమనిషి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తొలి హోంమంత్రిగా దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చిన సర్దార్ పటేల్‌ను విస్మరించలేమని, ఆయన లేకుండా దేశ చరిత్ర లేదని మోదీ అన్నారు. స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత దేశాన్ని ముక్కలు చేయాలని బ్రిటిషర్లు ప్రయత్నిస్తే పటేల్ ఒక్కరే ధైర్యంగా ఆ పరిస్థితిని చక్కదిద్దారని, దాదాపు 550 చిన్న చిన్న సంస్థానాలను దేశంలో విలీనం చేశారని కొనియాడారు. అందుకే ఆయన జయంతిని ‘జాతీయ ఐక్యతా దినం(నేషనల్ యునిటీ డే)’గా పాటించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇదే రోజున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని జరుపుకొంటారని, అయితే ఆమె హత్యానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల విషయాన్ని మాత్రం మరుగున పడేశారని ఆయన వ్యాఖ్యానించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు సర్దార్ పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారని, అయితే దురదృష్టవశాత్తూ మూడు దశాబ్దాల క్రితం ఆయన జయంతి నాడే సాటి భారతీయులు కొందరు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. అది ఏ ఒక్క వర్గానికో తగిలిన గాయం కాదని, శతాబ్దాలుగా పెనవేసుకున్న జాతీయ సమగ్రతా గుండెల్లో దిగిన గునపంలాంటిదని మోదీ వ్యాఖ్యానించారు. రాజకీయపరంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా జాతీయ సమగ్రత కోసమే పటేల్ పాటుపడ్డారని గుర్తు చేశారు. చరిత్రను మరచిన ఏ దేశం కూడా మరో చరిత్రను సృష్టించలేదన్న విషయాన్ని మనం మరవద్దన్నారు. స్వాతంత్య్రోద్యమం సందర్భంగా పటేల్‌పైనే మహాత్మాగాంధీ భరోసా పెట్టుకున్నారని, ఆయన ప్రణాళికల వల్లే దండి యాత్ర విజయవంతమైందని మోదీ పేర్కొన్నారు. వివేకానందుడు లేకుండా రామకృష్ణ పరమహంస ఎలా అసంపూర్ణుడో, అలాగే సర్దార్ పటేల్ లేకుండా మహాత్ముడు కూడా అసంపూర్ణుడే అని అభిప్రాయపడ్డారు. పూర్వం చాణక్యుడిలాగే పటేల్ కూడా తన శక్తియుక్తులు ప్రదర్శించి దేశ విభజన సమయంలో భారత్‌ను ఐక్యంగా ఉంచారని కొనియాడారు. అంతకుముందు ప్రధానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వాగతం పలికారు. సమైక్యతా పరుగులో ప్రముఖ క్రీడాకారులు సుశీల్‌కుమార్, విజేందర్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్యతా పరుగులో పాల్గొన్న వారందరితో ప్రధాని ‘ఐక్యతా ప్రమాణం’ చేయించారు. ‘సర్దార్ స్మృతిశాల’గా పటేల్ స్కూలు నడియూడ్(గుజరాత్): స్వతంత్ర భారతదేశం తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్ చదువుకున్న ప్రాథమిక పాఠశాల ఇపుడు స్మారక చిహ్నంగా వూరింది. గుజరాత్ రాష్ట్రం, కరంసద్ జిల్లాలోని పటేల్ పూర్వీకుల గ్రావుమైన కరంసద్లోని ఈ పాఠశాలలో పటేల్ ఒకటవ తరగతినుంచి ఆరవ తరగతి వరకూ (1882నుంచి1888వరకూ)చదువుకున్నారు. సంరక్షణ కరువై శిథిలావస్థకుచేరి, చెత్తదిబ్బలా తయూరైన ఈ పాఠసాల భవనాన్ని కోటీ 20లక్షల రూపాయుల వ్యయుంతో ‘సర్దార్ స్మృతి శాల’గా తీర్చిదిద్దారు. పటేల్ జయుంతిని పురస్కరించుకుని ఈ స్మారక చిహ్నాన్ని గుజరాత్ వుుఖ్యవుంత్రి ఆనందీబెన్ పటేల్ శుక్రవారం ప్రారంభించారు. పటేల్ వస్తువులు ప్రధానికి అప్పగింత న్యూఢిల్లీ: దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉపయోగించిన పలు వస్తువులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్వీకరించారు. పటేల్ వాడిన ప్లేట్లు, కప్‌లు, సాసర్లతోపాటు మరికొన్ని వస్తువులను మంజరి ట్రస్ట్‌కు చెందిన షీలా ఘటాటే ప్రధానికి ఆయన నివాసంలో అందించినట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పటేల్ మనవడు బిపిన్ దహ్యాభాయ్ పటేల్, ఆయన భార్య లూయ్ వీలునామాలో పేర్కొన్న ప్రకారం ఆ వస్తువులను ఘటాటే గతంలో అందుకున్నారు. ఈ వస్తువులను అందుకున్న అనంతరం మోదీ ఫేస్బుక్లో స్పందిస్తూ దేశ వారసత్వ సంపదలో ఈ వస్తువులు ప్రత్యేక భాగమన్నారు. అంతకుముందు పటేల్ 139వ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి, పార్లమెంటులోని ఆయన చిత్రపటానికి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు.