breaking news
Union Health and Family Welfare Ministry
-
‘చెడు’జోలికి పోకుండా
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే 25.3 కోట్ల మందితో అత్యధికంగా యువత కలిగిన దేశం భారత్. ఈ యువతలో ప్రతి ఐదుగురిలో ఒకరు 10 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య కౌమార దశలో (టీనేజిలో) ఉన్నారు. కౌమార దశలో ఉన్న బాలబాలికలు చెడు ప్రభావాలకు గురికాకుండా లైంగిక, పునరుత్పత్తి, ఆరోగ్య సమస్యలపై అన్ని రాష్ట్రాల్లో కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ క్లినిక్స్‌లో నమోదు చేసుకునే కౌమార బాలల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది ఆరోగ్యకరమైన పరిణామం అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో, వివిధ రాష్ట్రాలవారీగా కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో నమోదు సంఖ్య, కౌన్సెలింగ్ తీరుపై విశ్లేషణాత్మక నివేదికను ఈ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021–22లో వివిధ రాష్ట్రాల్లో క్లినిక్‌లలో నమోదు చేసుకున్న వారి సంఖ్య పెరిగిందని నివేదిక తెలిపింది. 2020–21లో కోవిడ్ నేపథ్యంలో ప్రతి లక్ష జనాభాలో 383 మంది ఈ క్లినిక్‌లలో కౌన్సెలింగ్‌కు పేర్లు నమోదు చేసుకోగా 2021–22లో ఆ సంఖ్య 601కు పెరిగిందని పేర్కొంది. రాష్ట్రంలో కూడా 2020–21లో ప్రతి లక్ష మందిలో 283 మంది నమోదు చేసుకోగా 2021–22లో ఆ సంఖ్య 1,673కు పెరిగిందని పేర్కొంది. యుక్త వయస్సులోని యువతీ యువకులను ఆరోగ్యంగా, విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడతారని, ఈ నేపథ్యంలోనే కౌమార దశలోని బాలికలు, బాలురకు పని, విద్య, వివాహం, సామాజిక సంబంధాల విషయంలో చెడు ప్రభావాలకు లోనుకాకుండా చేయడమే స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో కౌన్సెలింగ్ అని నివేదిక పేర్కొంది. రాష్ట్రీయ కిశోర్ స్వాస్త్య కార్యక్రమం కింద కౌమార ఆరోగ్య సమస్యలు, పౌష్టికాహారం, లింగ ఆధారిత హింస, నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు, మానసిక ఆరోగ్యంతోపాటు పెడ ధోరణులకు లోనుకాకుండా వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. శిక్షణ పొందిన సర్విస్ ప్రొవైడర్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఈ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో 36,56,271 మంది బాలురు, 45,73,844 మంది బాలికలు నమోదయ్యారు. 2021–22లో కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాల్లో 60 శాతం పైగా కౌమార దశలోని బాల బాలికలు క్లినికల్ సేవలు, కౌన్సెలింగ్ పొందినట్లు నివేదిక పేర్కొంది. 2021–22లో దేశం మొత్తమీద 70 శాతం బాలికలు, 66 శాతం బాలురు క్లినికల్ సేవలు పొందారు. అలాగే 76 శాతం బాలికలు, 69 శాతం బాలురు కౌన్సెలింగ్ తీసుకున్నారు. మన రాష్టంలో 2021 నాటికి 5,28,95,000 జనాభా ఉండగా అందులో 8,85,150 మంది కౌమార బాలలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. -
భారత్ కు పొంచి ఉన్న కరోనా ముప్పు
-
ఆడవాళ్ల నాప్కిన్స్ కు మగవాళ్ల హడావిడి
న్యూఢిల్లీ: దేశంలోని పాఠశాలల్లో, కాలేజీల్లో, ఆస్పత్రుల్లో, ఆఫీసుల్లో బాలికలకు, మహిళలకుశానిటరీ నాప్కిన్స్ సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. అయితే అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఈ పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖది. పథకం అమలుకు వ్యూహరచన చేస్తోంది. దేశవ్యాప్తంగా పథకాన్ని అమలు చేయాల్సిన తమ శాఖా కార్యాలయంలోనే మహిళలకు శానిటరీ నాప్కిన్స్ లేకపోతే ఎలా? అన్న సందేహం వచ్చినట్టుంది. వెంటనే నాలుగు శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మిషన్స్‌ను కొనుగోలు చేసి నిర్మన్ భవనంలోని తమ శాఖా కార్యాలయాల్లోని మహిళల వాష్‌రూముల్లో ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 11వ తేదీన ఆ శాఖ అదనపు కార్యదర్శి, జాతీయ ఆరోగ్య మిషన్ డెరైక్టర్ సీకే మిశ్రా ఆర్భాటంగా వెండింగ్ మిషన్ల ప్రారంభించి, వాటికి సంబంధించిన ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఆ రోజు జరిగిన కార్యక్రమంతా మగవాళ్ల హడావిడిగానే కనిపించడం చిత్రం. ప్రారంభోత్సవ కార్యక్రమం ఫొటోలో ఒక్క మహిళ కూడా లేకపోవడం విచిత్రం. ఆ కార్యక్రమంలో మహిళలు కూడా పాల్గొన్నారని, అయితే వారెవరూ కెమెరా కంటికి కనపడలేదని, సీకే మిశ్రాపైనే దృష్టిని కేంద్రీకరించడం వల్ల అలా జరిగిందని ఆనక ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చుకున్నది. అయినా ఆడవాళ్ల నాప్కిన్స్ కార్యక్రమానికి మొగవాళ్ల హడావిడి ఏమిటని ప్రశ్నిస్తున్న వాళ్లు లేకపోలేదు. వాళ్లకు ఒకటే సమాధానం. కండోమ్స్ కొనేందుకు సిగ్గుపడే మగాళ్లలో ఎక్కువ మంది ఎలాంటి బెరకు లేకుండా లేడీస్ నాప్కిన్స్ కొంటున్నారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. అంతెందుకు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు ఉపయోగించడం కోసం అతి చౌకైనా శానిటరీ నాప్కిన్స్ను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్న ‘గూంజ్’ అనే ఎన్జీవోకి అనూష్ గుప్తా నేతృత్వం వహిస్తున్నారు. అంతేకాదు, ఈ విషయంలో గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకొస్తున్నందుకుగానూ ఆయనకు గత జూలై నెలలో అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన మెగసెసె అవార్డు కూడా ఇచ్చారు. ఆడవాళ్ల రుతుక్రమం పట్ల సమాజంలో పేరుకుపోయిన అపోహలను తొలగించేందుకు కృషి చేస్తున్న సామాజిక కార్యకర్తల్లో కూడా మగవాళ్లే ఎక్కువ ఉన్నారు.