breaking news
uma ramalingeswara Swami
-
సుమనోహర గాథలు
అవి కేవలం ఆలయాలు కాదు.. అనాది కాలపు ఆనవాళ్లు. అవి కేవలం విగ్రహాలు కావు.. ఘన సాంస్కృతిక చరితకు సాక్ష్యాలు. ఆ గాలుల్లో పంచాక్షర మంత్రాలు ప్రతిధ్వనిస్తుంటాయి. ఆ నీళ్లలో పంచామృత ధారలు కలిసి ప్రవహిస్తుంటాయి. ఆ మట్టి రేణువుల్లో మహాదేవుడి ప్రతిబింబాలు కనిపిస్తుంటాయి. ఈ శివరాత్రికి ఆ కథలు తెలుసుకుందాం. జాగరణ క్రతువులో మన కోవెల కథలు పారాయణంగా చెప్పుకుందాం. కలియుగ కైలాసంపైకప్పు లేని శైవక్షేత్రం, ప్రపంచంలోనే ఎత్తైన స్వయం భూలింగం, అత్యంత ప్రాచీన సుమేరు పర్వతం.. కలగలిపి రావివలస ఎండల మల్లన్న క్షేత్రం. శివరాత్రి నుంచి మొదలుకుని మూడు రోజుల పాటు ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ కార్య నిర్వహణాధికారి జి.గురునాథరావు పర్యవేక్షణలో ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 27 గురువారం నిత్య అర్చనలతో పాటు మల్లన్నకు విభూది భష్మాలంకరణ పూజలు చేయనున్నారు. 28 శుక్రవారం స్వామి వారి తిరువీధి, చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తారు. చేరుకునే మార్గాలివే.. ఎండల మల్లన్న ఆలయానికి రోడ్డు, రైల్వే మా ర్గాలు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి టెక్కలి చేరుకుంటే.. అక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు ఉంటాయి. రైల్వే మార్గం విషయానికి వస్తే టెక్కలితో పాటు సమీపంలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో నౌపడ రైల్వే స్టేషన్, 20 కిలోమీటర్ల దూరంలో పలాస రైల్వే స్టేషన్కు రైల్వే మా ర్గంలో చేరుకుని అక్కడి నుంచి చిన్నపాటి వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. – టెక్కలి బ్రహ్మసూత్ర శివలింగాలుశ్రీముఖలింగం దక్షిణ కాశీగా ఎప్పటి నుంచో ఖ్యాతి పొందింది. ఇక్కడ అరుదైన బ్రహ్మసూత్ర శివలింగాలు ఐదు ఒకే చోట కొలువై ఉన్నాయి. బ్రహ్మజ్ఞాన తత్పరులైన మహర్షులు స్థాపించి నిత్య పూజలందుకునే శివలింగాలను బ్రహ్మసూత్ర శివలింగాలు అంటారు. భీమేశ్వర, సోమేశ్వర, వరుణేశ్వర, ఈశాన్య ఈశ్వర, ఎండల మల్లికార్జున లింగాలు ఇక్కడ దర్శనమిస్తా యి. దేశం మొత్తం మీద ఇలాంటివి చాలా అరుదు. శ్రీముఖలింగంలో ముఖాకృతిలో లింగం దర్శనం ఇవ్వడం ప్రత్యేకత. ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కృతయగంలో గోవిందేశ్వరుడు అనే నామంతో కనాకాకృతిలోను, త్రేతాయగంలో మధుకేశ్వరుడనే నామంతో రజతాకృతి లోను, ద్వాపర యగంలో జయంతేశ్వరుడనే నామంతో కాంస్యాకృతిలోను, కలియగంలో ముఖలింగేశ్వరుడనే పేరుతో ముఖం దాల్చి శిలాకృతిలో శివుడు శ్రీముఖలింగం క్షేత్రంలో దర్శనమిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి శ్రీముఖలింగానికి రవాణా సదుపాయం ఉంది. –జలుమూరుబలరామ ప్రతిష్టితంశ్రీకాకుళం కల్చరల్: పవిత్ర నాగావళి తీరం, పురాతన ఆలయ నిర్మాణం, బలరామ ప్రతిష్టిత శివలింగం.. వెరసి ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయం. ద్వాపర యుగాంతంలో నిర్మితమైన ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. బలరామ ప్రతిష్టితములైన పంచలింగాల ప్రాంతం కావడంతో పంచలింగ క్షేత్రంగానూ పరిఢవిల్లుతోంది. ఆలయంలో ఉత్స వాలకు అర్చకులు శ్రీరామమూర్తి, ఈఓ సర్వేశ్వరరావు ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి రోజున రాత్రి 12గంటలకు లింగోద్భవ పూజలు జరుగు తాయని, తెల్లవారు 3గంటలకు స్వామివారి ఊరేగింపు నందివాహనంపై ఉంటుందని తెలిపారు. బావిలోని విగ్రహాలు బయటకు తీసి.. శ్రీకాకుళం గుజరాతీపేటలో ఉన్న ఉమా లక్ష్మేశ్వర స్వామి ఆలయం కూడా అతిపురాతనమైనది. 300 ఏళ్ల కిందట మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక స్వామీజీ నాగావళి నది పొంగి ఉండగా ఇక్కడ బస చేశారు. ఆ సమయంలోనదీ ప్రాంగణంలోని ఒక నూతిలో ముస్లింరాజు పారేసిన విగ్రహాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. అందులో విగ్రహాలు బయటకు తీసి జీరో్ణద్ధరణ చేశారు. ఆ తర్వాత ఆలయాన్ని సుందరంగా నిర్మించి అర్చనాదులు నిర్వహిస్తున్నారు. భక్తుల కొంగు బంగారం శ్రీకాకుళం నక్కవీధిలోని ఉమాజఠలేశ్వర స్వామి ఆలయం ఉంది. భస్మాంగుల వంశస్తులు ఈ ఆలయాన్ని నెలకొలి్పనట్లు చరిత్ర చెబుతోంది. శివరాత్రి పర్వదినం రోజున ఏకాహం, లింగోద్భవ కాలంలో లింగాభరణం నిర్వహిస్తారు.250 ఏళ్లుగా.. శ్రీకాకుళంలోని కొన్నావీధిలో భీమేశ్వరుడు 250 ఏళ్లుగా పూజలు అందుకుంటున్నాడు. లోతైన గర్భగుడి, పెద్ద శివలింగం, లింగంపై నాటి ధారాపాత్ర.. వంటివి ఇక్కడి ప్రత్యేకతలు. శివరాత్రి నాడు ఉదయం నుంచి రుద్రాభిõÙకాలు, క్షీరాభిషేకాలు ఉంటాయని ఆలయ ఈఓ మాధవి, అర్చకులు గంట చిన్న రామ్మూర్తి తెలిపారు. -
‘కాశీపట్నం’ చూడర బాబూ!
శృంగవరపుకోట: పవిత్రంగా ప్రవహించే గోస్తనీ నది, మదిని అలరించే అందమైన ఇసుక తిన్నెలు, నీడనిచ్చే వృక్షాలు, ఆ వృక్షాల నడుమ ఓ తొ ర్రలో కొలువైన శివుడు. ఆ స్వామి ఎదుట స్వయంభువుగా వెలసిననంది. అన్నీ కలిపి కాశీపట్నం. కార్తీక మాసాన భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ, వారి పాలిట కొంగుబంగారంగా పరిఢవిల్లుతోందీ క్షేత్రం. ఎస్.కోటకు 13కిలోమీటర్ల దూరంలో విశాఖ-అరకు రోడ్డులో విశా ఖ జిల్లా అనంతగిరి మండల పరిధిలో ఉన్న కాశీపట్నానికి కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో వెళతారు. ఈ క్షేత్రం విశాఖ జిల్లాలోనే ఉ న్నా విజయనగరం నుంచే అధిక సంఖ్యలో భక్తులు వెళుతుంటారు. ని త్యం భక్తుల దర్శనాలతో, పర్యాటకులతో సందడిగా ఉండే కా శీపట్నం క్షేత్రం అటు దేవాదాయశాఖ నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోకున్నా భక్తులు సమర్పిస్తున్న దక్షిణలు, కానుకలతో నిర్వహణ సాగుతోంది. ఇదీ ఉమారామలింగేశ్వరుని చరితం... కాశీపట్నంలో కొలువుదీరిన నీలకంఠుడు ఉమారామలింగేశ్వరునిగా ప్రసిద్ధి పొందాడు. ఇక్కడ ఉన్న కథనం ప్రకారం... విజయనగరం సంస్థానాధీశులు వేటకు వెళ్లినపుడు చక్రవ ర్తి కాలికి రాయి తగిలింది. చక్రవ ర్తి శివలింగాకారంలో ఉన్న రాయిని చూసి ఇది దైవ సంకల్పం అని విశ్వసించారు. శివలింగం పక్కనే రావి,మర్రి మొక్కలు నాటి పూజ చేశారు. తర్వాత కొన్నేళ్లకు వేటకు వెళ్లే సమయానికి శివలింగం పెరిగి పెద్దదయినట్టు గుర్తించారు. ప్రస్తుతం శివలింగం మూడు అడుగుల ఎత్తులో ఉంది. అప్పటి నుంచి ఈ ఈశ్వరుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. పవిత్రం గోస్తనీ స్నానం... కాశీపట్నంలో కొలువుదీరిన ఉమారామలింగేశ్వరుని దర్శించేందుకు వచ్చిన భక్తులు ఆలయం పక్కనున్న గోస్తనీలో తనివీ తీరా పవిత్ర స్నానాలు చేసి పుల కించి, స్వామిని దర్శించి త రిస్తారు. గోస్తనీ పరవళ్లు, పక్కనే ఉన్న పర్యతాలు, చెట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. స్వయంభువుడైన నందీశ్వరుడు : విజయనగరం సంస్థానాధీశులు ఉమారామలింగేశ్వరుని కనుగొన్నప్పుడు అక్కడ నందీశ్వరుడు లేడు. కాలక్రమంలో రాజులు ఉమారామలింగేశ్వరుని కనుగొన్న తర్వాత అక్కడ నందీశ్వరుడు స్వయంభువుగా వెలిశాడని స్థానికులు చెబుతారు. నందీశ్వరున్ని కాలితో తన్నిన వ్యక్తి నోటిమాట పోయిందని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఆలయానికి వచ్చిన భక్తులు నందీశ్వరున్ని సైతం అంతే భక్తితో కొలిచి పూజలు చేస్తారు. చెట్టు తొర్రే కైలాసంగా: కాశీపట్నం క్షేత్రంలో నేటికీ ఉమారామలింగేశ్వరుడు మర్రి, రావి చెట్లు కలిసి ఏర్పడిన చెట్టు తొర్రలోనే ఉన్నాడు. చెట్లు పెద్దవిగా పెరిగిపోవటంతో చెట్ట కాండాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో క్ర మంగా ఇటుకలు పేర్చి పూరించారు. నేటీకి ఈ ఆలయం చెట్టుగానే కొనసాగుతోంది. బయటి నుంచి చూస్తే ఆలయం ఎక్కడా కని పించదు. మిగిలిన ఆలయాల మాదిరిగా ఆలయ గోపురం, ప్రాం గణం, గర్భాలయం, గాలిగోపురం ఏమీ ఉండవు. విస్తారంగా వ్యాపించిన రావి, మర్రి చెట్లు కొమ్మల మాటున ఉన్న ఆలయ ప్రాంగణంలో ఉమారామలింగేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. కాశీపట్నంలో ఉమారామలింగేశ్వరుని సన్నిధి, ఆలయానికి ఎదురుగా శ్మశానవాటిక, పక్కనే పవిత్ర గోస్తనీ నదీ ప్రవాహం ఉన్నాయి. కాశీపట్నం చేరాలంటే : * విశాఖ నుంచి ఎస్.కోట మీదుగా అరుకు వెళ్లే బస్లు కాశీపట్నం మీదుగా వెళ్తాయి. ఎస్.కోట నుంచి కాశీపట్నం వెళ్లేందుకు ప్రతి గంటకు బస్ ఉంది. * ఎస్.కోట నుంచి కాశీపట్నం 13 కిలోమీటర్ల ఉంటుంది. బస్ చార్జి పల్లెవెలుగు రూ 10లు, ఎక్స్ప్రెస్కు *15లు ఉంటుంది. * ఎస్.కోట నుంచి కాశీపట్నం వేళ్లేందుకు ఆటోలు, ప్రైవేటు వాహనాలు విరివిగా ఉంటాయి. * విజయనగరం నుంచి ఎస్.కోటకు తాటిపూడి రూట్లో వస్తే బొడ్డవర జంక్షన్లో దిగి కాశీపట్నం వెళ్లొచ్చు. బొడ్డవర నుంచి కాశీపట్నం 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది.