breaking news
TTC exam
-
9న టీటీసీ పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్ : వాయిదా పడిన టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్స్ (టీటీసీ) లోయర్ థియరీ పరీక్ష ఈనెల 9న నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన చెప్పారు. -
హాస్టల్లో ఉండలేక.. చున్నీతో ఉరేసుకుంది
మామడ(ఆదిలాబాద్ జిల్లా): మామడ మండలం కొరటికల్ గ్రామంలో శకుంతల(20) అనే యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల టీటీసీ పరీక్ష రాసింది. కౌన్సెలింగ్లో మొదటిదశలో సీటు రాకపోవడంతో కన్వీనర్ కోటాలో సిద్ధిపేటలోని ఓ కాలేజీలో చేరి హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. నాలుగు రోజుల క్రితమే స్వగ్రామం వచ్చింది. తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఉండలేక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. స్థానిక ఎస్ఐ మల్లేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.