breaking news
Trial Run Kodandapur reservoir
-
వందకు వందే భారత్!
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా వందేభారత్ రైళ్లను ఒకేసారి పెద్దసంఖ్యలో ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లు 30లోపు మాత్రమే నడుస్తున్నాయి. ఈ సంఖ్యను వీలైనంత తొందరలో వందకు చేర్చాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రస్తుతానికి నాలుగు రైళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా వాటిని వాయిదా వేశారు. ఇందులో కాచిగూడ– యశ్వంత్‌పూర్(బెంగళూరు) రైలు కూడా ఉంది. వాస్తవానికి ఈ రైలు గత నెల 31నే చెన్నై నుంచి కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంది. ఆ తర్వాత మహబూబ్‌నగర్ మీదుగా దీని ట్రయల్‌రన్ కూడా పూర్తి చేశారు. దీనిని ఈనెల ఆరో తేదీన ప్రారంభిస్తున్నట్టు గుంతకల్ స్టేషన్ అధికారులు అప్పట్లోనే ప్రకటించగా, దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు ఖండించారు.అది పంద్రాగస్టు రోజు ప్రారంభమయ్యే సూచనలున్నాయంటూ కొందరు అధికారులు అనధికారికంగా ప్రకటించారు. దానికి బలం చేకూరుస్తూ ఈలోపే ట్రయల్‌రన్ పూర్తి చేశారు. కానీ, రైల్వేబోర్డు మాత్రం అధికారికంగా ప్రారంభతేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఎన్నికల వేళ... ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, వందేభారత్ రైళ్లను కూడా ప్రధాన ఆకర్షణగా జనం ముందు నిలపాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో భారత్‌లో వంద వందేభారత్ రైళ్లను పట్టాలెక్కించాలని ముందుగా అనుకున్నా, ఇప్పుడు ఆ సంఖ్యను వీలైనంత తొందరలోనే ప్రయాణికుల సేవలోకి తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. ఇందుకోసం ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కొన్నింటిని ఆపి, మరికొన్నింటిని జతచేసి ఒకేసారి ప్రారంభించాలని భావి స్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పంద్రాగస్టు కానుకగా పట్టాలెక్కాల్సిన కాచిగూడ–యశ్వంతపూర్ వందేభారత్ కూడా తాత్కాలికంగా వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. 8 కోచ్‌ల రైళ్లే ఎక్కువ.. ప్రారంభంలో వందేభారత్ రైళ్లను 16 కోచ్‌లతో పట్టాలెక్కించారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో మాత్రమే వందేభారత్ రైళ్లు తయారవుతున్నాయి. త్వరలో మరో మూడు కోచ్ఫ్యాక్టరీల్లో వాటి ఉత్పాదన ప్రారంభిస్తారు. ఇప్పుడు ఒక్కో రైలు సిద్ధం కావటానికి చాలా సమయం పడుతోంది. ప్రొడక్షన్ వేగం పుంజుకునే వరకు, ఒక రైలుకు వినియోగించే 16 కోచ్‌లను రెండు రైళ్లుగా మార్చి నడపాలని రైల్వేశాఖ భావిస్తున్నట్టు సమాచారం. తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లు ప్రారంభించే అవకాశం ఉంటుందనేది ఆలోచన. డిమాండ్ పెరిగే కొద్ది క్రమంగా కోచ్‌ల సంఖ్య పెంచాలని అనుకుంటున్నారు. దక్షిణమధ్య రైల్వేకు కేటాయించిన మొదటి వందేభారత్‌ను సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య 16 కోచ్‌లతో ప్రారంభించారు. సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రారంభమైన రెండో వందేభారత్‌ను మాత్రం 8 కోచ్‌లతో ప్రారంభించి, ఆ సంఖ్యను పెంచుతామని తర్వాత రైల్వే అధికారులు ప్రకటించారు. ఇప్పుడు 8 కోచ్‌ల మినీ వందేభారత్ రైళ్లు ఎక్కువ సంఖ్యలో ప్రారంభించి, ఆ తర్వాత ఉత్పత్తి పెరిగే కొద్దీ వాటికి అదనపు కోచ్‌లను జతచేస్తూ పోవాలని నిర్ణయించారు. -
కృష్ణావతరణం
గ్రేటర్‌కు మూడో దశ కృష్ణా జలాలు ట్రయల్ రన్ విజయవంతం మరో 15 రోజుల్లో 11.5 ఎంజీడీల నీరు నాలుగో దశ ప్రతిపాదనలు సిద్ధం కృష్ణావతరణానికి సమయం ఆసన్నమైంది. మహా నగర దాహార్తిని తీర్చేందుకు కృష్ణమ్మ సిద్ధమవుతోంది. మరో పక్షం రోజుల్లో గ్రేటర్ వాసుల ముంగిట్లో పొంగిపొర్లనుంది. కృష్ణా మూడో దశలో నగరానికి 11.5 ఎంజీడీల నీటిని తరలించే క్రమంలో... సోమవారం అధికారులు నిర్వహించిన ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. సిటీబ్యూరో: గ్రేటర్‌కు మరో పది పదిహేను రోజుల్లో అదనంగా 11.5 ఎంజీడీల కృష్ణా జలాలు రానున్నాయి. కృష్ణా మూడో దశ ప్రాజెక్టు ట్రయల్ రన్ (ప్రయోగ పరీక్ష) సోమవారం విజయవంతంగా ప్రారంభమైంది. నల్లగొండ జిల్లా కోదండాపూర్ రిజర్వాయర్ వద్ద ఒక మోటారును ప్రారంభించి... 11.5 మిలియన్ గ్యాలన్ల నీటిని మూడోదశ పైపులైన్లలోకి పంపింగ్ చేశారు. పైప్లైన్లలో లీకేజీల గుర్తింపు, రిజర్వాయర్ సామర్థ్యం, కంప్రెషర్స్, ఎయిర్ వాల్వ్‌లు, మోటార్ల పని తీరు, వాటి సాంకేతికతలను పరీక్షించామని, ట్రయల్న్ ్రవిజయవంతంగా పూర్తయిందని జలమండలి వర్గాలు తెలిపాయి. మరో పది, పదిహేను రోజుల్లో మూడో దశ పైప్‌లైన్‌తో 11.5 మిలియన్ గ్యాలన్ల నీటిని నగర శివార్లలోని సాహెబ్‌నగర్ రిజర్వాయర్‌కు తరలిస్తామని వెల్లడించాయి. శివారు దాహార్తి తీర్చాలని... ఈ ప్రాజెక్టును మార్చి 31లోగా పూర్తి చేసి.. నగరానికి 90 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తామని సంబంధిత అధికారులు చెప్పారు. ప్రస్తుతం కృష్ణా మొదటి, రెండో దశల ద్వారా నగరానికి నిత్యం 180 ఎంజీడీల నీటిని తరలిస్తున్న విషయం విదితమే. మూడోదశను రూ.1670 కోట్ల అంచనా వ్యయంతో ఏడాదిన్నర క్రితం చేపట్టారు. హడ్కో నుంచి సేకరించిన రూ.1500 కోట్ల రుణంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.170 కోట్లు ఈ పథకానికి వెచ్చించనున్నాయి. నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి సాహెబ్‌నగర్ వరకు భారీ మంచినీటి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ నీటితో గ్రేటర్లో విలీనమైన శివారు మున్సిపాల్టీల్లో రాబోయే వేసవిలో దాహార్తి తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు చివరికి గోదావరి మొదటి దశ పూర్తి చేసి... మరో 172 ఎంజీడీల జలాలను తరలిస్తామని... దీంతో శివారు మున్సిపాల్టీలలో దాహార్తి పూర్తిగా తీరుతుందని జలమండలి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగో దశకు సిద్ధం గ్రేటర్ జనాభా 2021 నాటికి 1.93 కోట్లకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నుంచి గ్రేటర్‌కు 170 ఎంజీడీల నీటిని తరలించేందుకు ఉద్దేశించిన కృష్ణా నాలుగో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలను జలమండలి సిద్ధం చేసింది. సుమారు రూ.2,880 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించింది. మూడు దశల పంపింగ్ ద్వారా నగరానికి నీటిని తరలించేందుకు రెండు మార్గాలను ప్రతిపాదించింది. ఇవి ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉన్నాయి. ఆయన ఆమోదం లభిస్తే నాలుగో దశ ప్రాజెక్టుకు మోక్షం కలగనుంది. గ్రేటర్ మంచినీటి ముఖచిత్రం .. ప్రస్తుతం గ్రేటర్లో 20 లక్షల భవంతులు ఉన్నాయి. జలమండలి కేవలం 8.64 లక్షల కుళాయిలకు నిత్యం 340 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తోంది. ఇందులో 25 ఎంజీడీలు ఉస్మాన్ సాగర్ నుంచి, మరో 15 ఎంజీడీలు హిమాయత్‌సాగర్ నుంచి సేకరిస్తోంది. సింగూరు జలాశయం నుంచి 75 ఎంజీడీలు, మంజీర నుంచి 45 ఎంజీడీలు, కృష్ణా మొదటి, రెండో దశల ద్వారా మరో 180 ఎంజీడీలు ..ఇలా మొత్తంగా 340 ఎంజీడీల నీటిని తరలించి నగరం నలుమూలలకు సరఫరా చేస్తోంది. కృష్ణా, గోదావరి మంచినీటి పథకాల స్వరూపం ప్రాజెక్టు దశలు గ్రేటర్కునీటి తరలింపు పూర్తయిన (మిలియన్ గ్యాలన్లలో) సంవత్సరం కృష్ణా మొదటి దశ 90 1996 కృష్ణా రెండోదశ 90 2006 కృష్ణా మూడో దశ 90 2015 మార్చికి పూర్తి. కృష్ణా నాలుగోదశ 170 ప్రభుత్వ పరిశీలనలోని పథకం గోదావరి మొదటి దశ 172 2015 ఆగస్టుకు పూర్తి.