ప్రభుత్వ స్కూళ్లపై పాలకుల నిర్లక్ష్యం
మిర్యాలగూడ టౌన్ : ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర పాలకులు నిర్లక్ష్యం చేస్తూ, బలహీన పరుస్తోందని తెలం గాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అదనపు ప్రధా నకార్యదర్శి బి.లింగస్వామి ఆరోపిం చారు.ఆదివారం పట్టణంలోని నలంద డిగ్రీ కళాశాలలో టీపీయూఎస్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న లింగస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా గురుకులాల పేరు తో కొత్త విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. గతంలో ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లల్లో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశా రు.
ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ నిబంధనలు అస్తవ్యస్తంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు అలుగుబెల్లి పాపిరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్, పీఆర్ సీ బకాయిలు, సర్వీసు రూల్స్, ఆరోగ్య కార్డులు వంటి సమస్యలను పరిష్కరిం చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దని ఆరోపించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ప్రభుత్వంలో భాగస్వాములుగా మారిపోయాయని ఆరోపించారు.
ఈ నెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీయూఎస్ అభ్యర్థి నర్ర భూపతిరెడ్డిని గెలిపించాలని కోరారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తెల్కపల్లి పెంట య్య, బుర్రి గోపాల్‌రెడ్డి, ఇరుగు రా ములు, ప్రభాకర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, శ్రీరాములునాయక్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, అమరేందర్, భిక్షపతి, నాగేందర్, కొండ లింగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, పి.దామోదర్‌రెడ్డి, నాగరాజు, టి.దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.