నెల్లూరు కార్పొరేషన్లో ఏసీబీ సోదాలు
నెల్లూరు: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కార్పొరేషన్ అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారి మునిరత్నం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. దీంతో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.