breaking news
Tonsill problem
-
పిల్లల్లో టాన్సిల్స్ సమస్య ఎందుకొస్తుందంటే..!
పిల్లల్లని వేధించే వాటిలో టాన్సిల్స్ సమస్య ఒకటి. చాలామంది పిల్లలు దీనిబారినపడి పెద్దల్ని నానా ఇబ్బందులు పెడుతుంటారు. ఆఖరికి సర్జరీ చేయించి తీసేయడం జరుగుతుంది. అసలు ఎందుకొస్తుంది. దీన్ని నివారించాలంటే ఏం చేయాలి తదితరాల గురంఇచ ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం. కొన్ని సార్లు ఇబ్బంది పెట్టినా కూడా టాన్సిల్స్ మంచివి. మనం తీసుకున్న ఆహారంలో ఉండే బాక్టీరియా లాంటి కొన్ని రకాల క్రిములని ఈ టాన్సిల్స్ అడ్డుకుంటాయి. ఒంట్లో బాగా వేడి చేస్తే ఈ టాన్సిల్స్ వాపు చేసి నొప్పి పెడతాయి. టాన్సిల్స్ రావడానికి ప్రధాన కారణం వేడి చేసే పదార్దాలు తినడం (ఫ్రిడ్జ్‌లో నీరు తాగడం,. కూల్ డ్రింక్స్, మసాలాలు, కారం, పచ్చళ్ళు లాంటివి అన్నమాట). వాతావరణానికి తగ్గట్లు ఆహారపు అలవాట్లలో కొంచెం మార్పు చేసుకుంటే టాన్సిల్స్ పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఒకవేళ మీరు నొప్పితో బాధపడుతుంటే డాక్టరు దగ్గరకి వెళ్లేముందు ఒక్కసారి ఇది చేసి చూడండి. రాళ్ళ ఉప్పు వేసిన వేడి నీరు గొంతు వరకు పోసుకుని పుక్కిలించండి. ఇలా రోజుకి 4 సార్లు చొప్పున 2 రోజులు చేయండి. 90% వరకు నొప్పి మాయం అవుతుంది. అలానే తాగే నీరు కూడా వేడి గా ఉండేలా చూసుకోండి. అదే వృద్దులకు గొంతులో నొప్పి కఫాన్ని తగ్గాలంటే..మెత్తగా దంచి జల్లించి న కరక్కాయ పొడి, తేనెలో కలిపి రెండు పూటలా చప్పరించాలి. ఉదయం లేవగానే గోరు వెచ్చని మంచినీరు రెండు గ్లాసులు త్రాగాలి.రాత్రి పడుక్కోడానికి అరగంట ముందు రెండు చిటికెల పసుపు, నాలుగు మిరియాలు ( దంచిన ముక్కలు) పంచదార కొంచెం ( షుగరు లేకపోతే ఉంటే మెత్తని ఎండు ఖర్జూరం పొడి) ఒక గ్లాసు పాలు లో మరిగించి, వడకట్టి త్రాగాలి. వృద్ధులుకి ఏది ఇచ్చినా అది ద్రవ రూపంలో లేదా మెత్తని పౌడర్ రూపంలో ఉండాలి అయినా కూడా నొప్పి తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్‌కి వెళ్లండి. టాన్సిల్స్‌కి చిన్నపాటి సర్జరీ ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు, నవీన్ నడిమింటి (చదవండి: బొమ్మలు వేస్తూ ఆ ఫోబియాను పోగొట్టకుంది! ఏకంగా గొప్ప ఆర్టిస్ట్‌గా..) -
టాన్సిల్స్ సమస్య తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్స్ మా బాబు వయసు ఐదేళ్లు. మాటిమాటికీ గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతుంటాడు. టాన్సిల్స్ వాచాయనీ, దాంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇలా సమస్యలు వస్తున్నాయనీ, కచ్చితంగా ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు అంటున్నారు. హోమియోపతి విధానంలో ఆపరేషన్ లేకుండానే మా బాబు సమస్యను నయం చేయవచ్చా? – సురేశ్, ఒంగోలు మీ బాబుకు ఉన్న సమస్యను టాన్సిలైటిస్గా చెప్పవచ్చు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది అక్యూట్ టాన్సిలైటిస్. ఇందులో తీవ్రమైన గొంతునొప్పి, టాన్సిల్స్ ఎర్రగా మారి, వాపు రావడం, ప్రతి 10 – 15 రోజులకు ఒకసారి చలితో కూడిన జ్వరం వస్తూ తగ్గుతూ ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు చెవి నొప్పి, ఆహారం మింగలేకపోవడం, నోటి దుర్వాసన వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఈ విధమైన టాన్సిలైటిస్‌కు హోమియోలో బెల్లడోనా అనే మందు అద్భుతంగా పనిచేస్తుంది. దాదాపు 102, 103 ఫారెన్‌హీట్ జ్వరంతో టాన్సిల్స్ ఎర్రగా మారి గుటకవేయడం కష్టమయ్యే సమస్యలో హెపార్‌సల్ఫ్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మరికొన్ని లక్షణాలను బట్టి ఫెర్రమ్‌ఫాస్, ఏపిస్ మెల్ఫికా, అకోనైట్ మందులు బాగా పనిచేస్తాయి. ఇక మరోరకమైన క్రానిక్ టాన్సిలైటిస్ విషయానికి వస్తే దీర్ఘకాలిక టాన్సిల్స్ వాపుతో పాటు కొంత కొంత విరామం తర్వాత జ్వరం, గొంతునొప్పి, తరచూ దగ్గురావడం, ఆహారం మింగడం కష్టంకావడం, మెడదగ్గరి లింఫ్‌గ్రంథులు వాచడం వంటి సమస్యలు వస్తుంటాయి. కొందరు పెద్దవాళ్లు కూడా టాన్సిల్స్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి కారణం వ్యాధినిరోధక శక్తి తగ్గడం. హోమియోలో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి, టాన్సిల్స్ వాపు తగ్గించడానికి, మాటిమాటికీ జబ్బు పడకుండా రక్షించడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక టాన్సిల్స్ కుబెరైటాకార్బ్, మెర్క్‌సాల్, కాల్కేరియా ఫాస్, కాల్కేరియా అయోడమ్, బ్రోమియమ్, అమిగ్డాపెర్సికా వంటి మందులు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో కొద్దికాలం తీసుకోవాల్సి ఉంటుంది. అలా కొద్ది రోజులు చికిత్స తీసుకుంటే ఆపరేషన్ లేకుండానే టాన్సిల్స్ సమస్యను నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ అది... రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు! నా వయసు 55 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటం, కీళ్లవద్ద ఎర్రగా మారడం జరిగింది. నాకు తగిన సలహా ఇవ్వండి. – దేవేందర్, నిజామాబాద్ సాధారణంగా స్త్రీ–పురుషులలో యాభైఏళ్ళలో నొప్పులు మొదలవుతాయి. ఇది వయస్సు పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలో క్యాల్షియం తగ్గిపోవడం వలన వస్తూ ఉంటుంది. దీనిని ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. అయితే ఇందుకు భిన్నంగా కేవలం ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే యువతులలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వాపులు, నొప్పులు రావడం మొదలవుతుంది. ఇలా పెద్దవయసులో కాకుండా, ఒకింత చిన్న వయసు నుంచే కీళ్లనొప్పులు మొదలుకావడాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్‌గా చెప్పవచ్చు. పిల్లల్లోనూ ఇది వస్తుంది. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్ డిసీజ్’ అని అంటారు. లక్షణాల తీవ్రతలో వివిధ మార్పులు కనిపిస్తాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మియాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియో ద్వారా వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ టి. కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్