breaking news
Todd Phillips
-
మరో ఓటీటీలోకి వచ్చేసిన జోకర్ 2
హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొట్టిన చిత్రం జోకర్. 2019 అక్టోబర్ 2న విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా జోకర్ 2 (Joker: Folie à Deux) తెరకెక్కింది. మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన టోడ్ ఫిలిప్స్ రెండో భాగాన్ని రూపొందించారు. 2024 అక్టోబర్ 2న జోకర్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో రెండు నెలల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 13న హెచ్‌బీఓ మాక్స్‌లో ప్రత్యక్షమైంది. తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. కాకపోతే రెంట్ పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడీ మూవీ జియోహాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. హెచ్‌బీఓ మాక్స్ ప్లాట్‌ఫామ్‌లోని కంటెంట్‌ను ఓటీటీ ఆడియన్స్‌కు అందించే వెసులుబాటు కల్పించింది జియో హాట్‌స్టార్. దీంతో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారు ఈ సినిమాను ఫ్రీగా చూసేయొచ్చు.సినిమా విషయానికి వస్తే.. టోడ్ ఫిలిప్స్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జోక్విన్ ఫీనిక్స్ హీరోగా నటించాడు. లేడీ గాగా, బ్రెండన్ గ్లీసన్, కేథరిన్ కీనర్, స్టీవ్ కూగన్, హ్యారీ లాటే, జాజీ బీట్జ్ ముఖ్యపాత్రలు పోషించారు. లారెన్స్ షెర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా హిల్దుర్ గువనడోట్టర్ సంగీతం అందించాడు.ఏంటీ కథ?ఆర్థర్ ఫ్లెక్ అలియాస్ జోకర్ అనే సాధారణ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన విలన్‌గా ఎలా మారాడన్నది మొదటి భాగంలో చూపించారు. వరుస హత్యల తర్వాత ఒక సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న జోకర్ పోలీసుల పర్యవేక్షణలో ఉండటం, అతడి లవ్ స్టోరీ, తనలోని సంగీతాన్ని బయటపెట్టడం అనే అంశాల చుట్టూ రెండో భాగం ఉంటుంది.చదవండి: OTT: మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పిన అదితిరావు -
Joker 2 : ‘జోకర్’ మళ్లీ వచ్చేస్తున్నాడు!
హాలీవుడ్ జోకర్ మళ్లీ వస్తున్నాడు. హాలీవుడ్ మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘జోకర్’. జోక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్రలో టాడ్ ఫిలిప్స్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా 2019లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ’ సినిమాకు సీక్వెల్‌గా ‘జోకర్ 2’ (జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్)ను ప్రకటించారు టాడ్ ఫిలిప్స్. ఈ చిత్రంలో జోక్విన్ ఫీనిక్స్‌తో పాటు లేడీ గగా మరో లీడ్ రోల్ చేస్తున్నారు. జాజై బీట్జ్ మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, న్యూ జెర్సీ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రం ట్రైలర్ ఏప్రిల్ 4న విడుదల కానుం దని హాలీవుడ్ టాక్. సినిమాను ఈ ఏడాది అక్టోబరు 4న విడుదల చేయాలనుకుంటున్నారు. టాడ్ ఫిలిప్స్, బ్రాడ్లీ కూపర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూట్ చేయనుంది.