breaking news
throat slit and robbed
-
తిరుపతిలో మహిళ గొంతుకోసి.. నగల దోపిడీ
-
తిరుపతిలో మహిళ గొంతుకోసి.. నగల దోపిడీ
తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వర్సిటీ ఏఏఓ శివశంకర్ భార్యను హత్యచేశారు. క్యాంపస్‌లోనే ఏఏఓగా పనిచేస్తున్న ఆయన క్వార్టర్స్‌లో ఉంటారు. ఆయన భార్య సుధపై దుండగులు వెనకవైపు నుంచి ఒక్కసారిగా దాడి చేశారు. ఆమెను హతమార్చి, ఆమెవద్ద ఉన్న నగలు దోచుకుని వెళ్లిపోయారు. దొంగలు పట్టపగలే ఇంత బీభత్సం సృష్టించారు. తిరుపతిలో ఈమధ్యకాలంలో ఇంత ఘోరం ఎప్పుడూ జరగలేదు. ఒక మహిళను అత్యంత కిరాతకంగా గొంతుకోసి నగలు దోచుకెళ్లిన ఘటన పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం ఇదే క్వార్టర్స్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. ఓ మహిళను ఇలాగే గొంతుకోసం దోచుకెళ్లారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందే ఈ దారుణానికి పాల్పడినట్లు అప్పట్లో విచారణలో తేలింది. తాజా కేసులో ప్రాథమిక ఆధారాలు మాత్రమే సేకరించామని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. దోపిడీ దొంగల పనిగా భావించే విచారణ సాగుతోందని తెలిపారు.