breaking news
thati munjaalu
-
వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా?
వేసవిలో మాత్రమే కనిపించే సీజనల్ ఫుడ్ తాటి ముంజలు. ఇవి చూసేందుకు చిన్నవైనా పోషకాల్లో మెండు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనాన్ని కలిగించే దివ్య ఔషధం. ప్రకృతి వరప్రసాదంగా మారి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. ఎండలు మండుతుండడంతో ప్రజలు పండ్లు, పానీయాలు సేవిస్తుంటారు. కానీ వేసవిలో మాత్రమే లభించే ముంజలు తప్పక తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వేసవిలో సాధారణంగా మామిడి, పుచ్చకాయ, జామ, ఖర్బూజా ఇలా అనేక రకాల పండ్లు, పానీయాలు తీసుకుంటుంటారు. కానీ వీటిని మించి పోషకాలు ముంజల్లో ఉంటుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఇవి ఉంటుండడంతో వీటిని పట్టణాలకు తరలించి పలువురు ఉపాధి పొందుతున్నారు. నగరంలో వ్యాపారం గ్రామాల్లో తాటి ముంజల ఉపాధి మూడు పూలు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ప్రధాన రహదారుల వెంట తాటి ముంజలు కనిపించని చోటు లేదు. ఆటోల్లో నగరానికి తరలించి విక్రయిస్తున్నారు. పలువురు వ్యాపారులు నగరం నుంచి వచ్చి పల్లెల్లో గీత కార్మికుల వద్ద ముంజలు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు. వీటి ధర సుమారు రూ.100 నుంచి 150 వరకు ఉంది. చాలా మంది గీత కార్మికులు, ముదిరాజ్ కులస్తులు కుటుంబ సభ్యులు నగరంలో జోరుగా వ్యాపారం సాగిస్తున్నారు. చదవండి👉🏾 Health Tips: తల దురదతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే పోషకగని తాటి ముంజల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఎ, బీ, సీతో పాటు ఐరన్, జింక్ , పాస్పరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలుంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపుతాయి. దీంతో శరీరం శుభ్రమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. తాటి ముంజలకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటడంతో వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. ఎండ వలన కలిగ ఆలసట నీరసాన్ని దూరం చేస్తుంది. మలబద్దకం సమస్యను నివారించడంలో ముంజలు బాగా పని చేస్తాయి. వీటిని తరుచుగా తినడం వలన జీర్ణక్రీయ మెరుగుపడుతుంది. అజీర్తి, ఎసిడిటీ సమస్యలు దరిచేరవు. మొటిమలను తగ్గించడంలోను మంజలు పని చేస్తాయి. వీటిని గర్భిణులు ఆహారంగా తీసుకుంటే ఎంతో మేలు చేకూరుతుంది. -
ముంజల వారి విందు
ఐస్‌ను ఫ్రై చేసుకుని తింటే ఎలా ఉంటుంది?అడిగినవారికి మైండ్ లేదనిపిస్తోంది కదూ!కానీ మీకు తెలుసా... ఫ్రైడ్ ఐస్ క్రీమ్ దొరుకుతుందని!అలాగే చల్లటి ముంజలను వేడివేడిగా వండుకుని తినొచ్చు!ప్రయత్నించండి! వేడివేడిగా తినండి.కడుపును చల్లబరచండి. నొంగు పాల్ కావలసినవి: లేత ముంజలు – 6 (తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి); పాలు – 2 కప్పులు; పంచదార/తేనె – 1 టేబుల్‌స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను తయారీ: ►ఒక పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి బాగా కాగిన తరవాత, మంట బాగా తగ్గించి, పాలు మూడు వంతులయ్యే వరకు మరిగించాలి ►పంచదార/తేనె జత చేసి బాగా కలియబెట్టాలి ►ఏలకుల పొడి జత చేసి ఆపకుండా కలుపుతుండాలి ►అన్నీ బాగా కరిగిన తరవాత దింపి చల్లార్చాలి ►ముంజలను చేతితో మెత్తగా మెదిపి, మరిగించిన పాలకు జత చేసి బాగా కలపాలి ►ఫ్రిజ్‌లో ఉంచి రెండు మూడు గంటల తరవాత బయటకు తీసి, చల్లగా అందించాలి. (నన్నారి, పిస్తా, రోజ్, చాకొలేట్, కేసర్ టూటీ ఫ్రూటీలతో కూడా తయారు చేసుకోవచ్చు) ముంజలు మునగ కాడ కర్రీ కావలసినవి: లేత ముంజల గుజ్జు – 2 కప్పులు; లేత మునగకాడ ముక్కలు – ఒక కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; పనీర్ తురుము – పావు కప్పు; గసగసాలు + జీడి పప్పు + ఎండు కొబ్బరి పేస్ట్ – ఒక టేబుల్ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 6; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చి మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►మునగ కాడల ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి ►టొమాటో తరుగు, ఉల్లి తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి కొద్దిసేపు వేయించాలి ►ముంజల గుజ్జు జత చేసి బాగా కలపాలి ►కొద్దిగా నీళ్లు, తగినంత ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ►కొద్దిగా ఉడికిన తరవాత పనీర్ తురుము, గసగసాలు + జీడి పప్పు + ఎండు కొబ్బరి పేస్ట్ జత చేసి కలియబెట్టి, మరి కొద్ది సేపు ఉడికించాలి ►కొత్తిమీర తరుగుతో అలంకరించి దింపేయాలి ►వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. ముంజల డ్రింక్ కావలసినవి: ముంజలు – 8; పాలు – రెండు కప్పులు; నీళ్లు – తగినన్ని; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; రూహ్ అఫ్జా – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►మిక్సీ జార్లో నాలుగు తాటి ముంజలు వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ►మిగిలిన ముంజలను చాకుతో సన్నగా కట్ చేసి పక్కన ఉంచాలి ►మిక్సీ జార్లో పాలు, కొద్దిగా నీళ్లు, పంచదార, రూహ్ అఫ్జా, ముంజల గుజ్జు వేసి బాగా మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, గ్లాసులోకి తీసుకోవాలి ►ముంజ ముక్కలు, ఐస్ ముక్కలు జత చేసి చల్లగా అందించాలి. ముంజల బజ్జీ కావలసినవి: కొద్దిగా ముదిరిన ముంజలు – 10; సెనగ పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; ధనియాల పొడి – ఒక టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముంజల తొక్క తీసి, నీరు వేరు చేయాలి ►ఒక గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, మిరప కారం, ఉప్పు వేసి బాగా కలపాలి ►తగినన్ని నీళ్లు జత చేసి బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ముంజలను పిండిలో ముంచి బజ్జీల మాదిరిగా వేయాలి ►రెండు వైపులా దోరగా కాలిన తరవాత పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. తాటి ముంజల పొట్టు చట్నీ కావలసినవి: ముంజల పొట్టు – ఒక కప్పు; మినప్పప్పు – 3 టేబుల్ స్పూన్లు; కంది పప్పు – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 4; చింత పండు – నిమ్మకాయంత; ఎండు మిర్చి – 5; లవంగాలు – 4; ఎండు కొబ్బరి ముక్కలు – అర కప్పు; ఉప్పు – ఒక టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను తయారీ: ►ముంజల పొట్టును నీళ్లలో నానబెట్టాలి (లేదంటే రంగు మారిపోతుంది) ►స్టౌ మీద బాణలి వేడయ్యాక మినప్పప్పు, కంది పప్పు, వెల్లుల్లి, ఎండు మిర్చి, చింత పండు కొబ్బరి ముక్కలు, లవంగాలు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించి దింపేసి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►ముంజల పొట్టులోని నీటిని పూర్తిగా ఒంపేయాలి ►పొట్టును ఒక ప్లేట్లో ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో పావు టీ స్పూను నూనె వేసి కాగాక ముంజల పొట్టు, ఉప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►ముందుగా పోపు సామానును మిక్సీలో వేసి మెత్తగా చేశాక, ముంజల పొట్టు జత చేసి మరోమారు మెత్తగా అయ్యేవరకు తిప్పి, గిన్నెలోకి తీసుకోవాలి ►ఇది చపాతీ, దోసె, బ్రెడలలో నంచుకుని తినొచ్చు, అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది. తాటి ముంజల కూర కావలసినవి: నూనె – ఒక టేబుల్ స్పూను; బిర్యానీ ఆకులు – 2; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 6; ఉప్పు – తగినంత; ముంజలు – 10 (కొద్దిగా ముదురుగా ఉండాలి); పసుపు – పావు టీ స్పూను; కారం – అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ: ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, రెండు బిర్యానీ ఆకులు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి ►ఉల్లి తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి ►కొద్దిగా ఉప్పు జత చేయాలి ►తరిగిన ముంజలు వేసి బాగా కలపాలి ►తగినంత పసుపు, కారం వేసి మరోమారు కలియబెట్టాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేయాలి ►కొద్దిగా నీళ్లు పోసి, మూత పెట్టి, ముంజలు మెత్తబడే వరకు ఉడికించాలి ►మూత తీసి మరోమారు కలియబెట్టాలి ►ధనియాల పొడి, కొత్తిమీర తరుగు జత చేసి మరోమారు కలియబెట్టి దింపేయాలి. తాటి ముంజల కుర్మా కావలసినవి: తాటి ముంజలు – 12; ఉప్పు – తగినంత; కారం – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు; పోపు సామాను – ఒక టీ స్పూను (ఆవాలు, జీలకర్ర); ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 3; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను ; క్యారట్ తరుగు – పావు కప్పు; నువ్వులు + జీడి పప్పు పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; పెరుగు – అర కప్పు; కొత్తిమీర – అర టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను. తయారీ: ►ముంజలను ఒక ప్లేట్లో ఉంచి, వాటి మీద ఉప్పు, పావు టీ స్పూను కారం, పావు టీ స్పూను పసుపు చల్లి, అన్నిటికీ అంటేలా చేతితో సరిచేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ►ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు కలపాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేయాలి ►క్యారట్ తరుగు వేసి మరోమారు కలపాలి ►టొమాటో తరుగు జత చేసి కలియబెట్టాలి ►కొద్దిగా నీళ్లు పోసి మరోమారు కలిపి, మూత ఉంచి ఉడికించాలి ►జీడిపప్పు, నువ్వుల పేస్ట్ వేసి కలిపి ఉడికించాలి ►తగినంత ఉప్పు జత చేయాలి ►కారం, పసుపు, ధనియాల పొడి వేసి మరోమారు కలపాలి ►పెరుగు జత చేసి కలియబెట్టాలి ►కొద్దిగా నీళ్లు జత చేయాలి ►ముంజలను జత చేసి ఉడికించాలి ►గరం మసాలా, కొత్తిమీర తరుగు జత చేసి మూత ఉంచాలి ►కొద్దిగా ఉడికిన తరవాత మూత తీసి మరోమారు కలియబెట్టాలి ►ఉడికిన కుర్మాను ఒక పాత్రలోకి తీసుకుని కొత్తిమీరతో అలంకరించాలి. తాటి ముంజల పొట్టు కర్రీ కావలసినవి: తాటి ముంజల పొట్టు – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను. పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; ఉల్లి తరుగు – అర కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; కారం – ఒక టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను తయారీ: ►స్టౌ మీద మందపాటి గిన్నె ఉంచి, అందులో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి ►తాటి ముంజల పొట్టు వేసి ఉడికించాలి ►చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు జత చేసి కలియబెట్టి బాగా ఉడికించి దింపేయాలి ►నీటిని వడకట్టి తీసేయాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాచాలి ►జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండు మిర్చి, పచ్చి సెనగ పప్పు వేసి వేయించాలి ►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ►పసుపు జత చేయాలి ►ముంజల పొట్టు జత చేసి బాగా కలపాలి ►కారం, గరం మసాలా వేసి మరోమారు కలిపి, దింపేయాలి. -
తాటి ముంజలు తెగ తినేవాళ్లం..
బడికి పోయే రోజుల్లో వేసవి సెలవులంటే మస్త్ జోష్.. సెలవులొచ్చిన రోజు నుంచే మా ఆటలకు హద్దులుండేవి కాదు. ఫలానా ఆట అని లేకుండా.. ఏదితోస్తే అది ఆడేవాళ్లం. రోజూ ఉదయం మాత్రం ఊట బావిలో మున గాల్సిందే. ఆ సమయంలో మా అల్లరి అంతాఇంతా కాదు. బావి ఒడ్డునున్న చెట్లమీద నుంచి దూకిమరీ ఈత కొట్టేవాళ్లం. కేవలం మగపిల్లలే కాదు.. మాతో సమానంగా ఆడపిల్లలూ ఈతకు వచ్చేవాళ్ళు అని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి తను బాల్యంలో వేసవి సెలవుల్ని గడిపిన తీరును గుర్తుచేసుకున్నారు. అవన్నీ ఆయన మాటల్లోనే.. మా సొంతూరు మహబూబ్‌నగర్ జిల్లా పెదమందడి మండలం చినమందడి. పూర్తిగా గ్రామీణ వాతావరణం. వేసవి సెలవుల్లో పెద్దలు సైతం ఈత కొట్టేందుకుప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. అసలు బావిలో ఈత కొట్టడంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం. మా పొలం దగ్గరున్నది పేరుకే చినబావి. కానీ ఆ ప్రాంతంలో అదే పెద్దది. దాదాపు 50 మం దిదిగి స్నానం చేసేంత పెద్దది. ఈత కొట్టే సందర్భంలో స్నేహితులతో పందెం కాయడం సాధారణం. ఈ క్రమంలో తోటివారిని చేతులతో నీటిలో ముంచి. కాళ్లతో లోతుకు నెట్టేవాళ్లం. ఆ సందర్భంలో గొడవ లు జరిగినా..అవన్నీ బావివద్దకే పరిమితమయ్యేవి. తాటి ముంజలు.. ఆట, పోటీలు బావిలో ఈతకొట్టి బయటకొచ్చిన తర్వాత సమీపంలో ఉన్న తాటి చెట్ల నుంచి గుట్టుచప్పుడు కా కుండా ముంజలు తెచ్చుకునే వాళ్లం.వాటిని కత్తితో కాకుండా చేతి వేళ్లతో తొలిచి తినేవాళ్ళం.ఆ తర్వా త ఆ పొలాల పెద్దలు వచ్చి లొల్లి చేయడం జరి గేది.అయినా మా రూటు మారేది కాదు. ముంజ లు తిన్న తర్వాత వాటిని కట్టెకు అటు,ఇటు బిగిం చి బండిగా తయారు చేసేవాడిని. చింపురు జుత్తు.. బెదరగొట్టే అవతారం.. ఇంట్లో నుంచి ఉదయం బయటకొచ్చామంటే తిరిగి సాయంత్రం నాలుగు తర్వాతే ఇంటికెళ్లేవాడిని. అప్పుడు మమ్మల్ని చూసి ఇంట్లోవాళ్లే భయపడిపోయేవారు. పొద్దంతా తిరగడంతో చింపురు జుత్తు.. మోహమంతా నల్లగా తయారయ్యేది. అలా బెదరగొట్టే అవతారంతో వెళ్లిన మమ్మల్ని చూసిన అమ్మ.. తలకు నూనె పెట్టి శుభ్రంగా తయారుచేసేది. ఆ సమయమంతా చివాట్లు పెట్టేది. భోజనంచేసి తిరిగి వీధిలోకి జారుకునేవాడిని. ఊర్లో సాయంత్రంవేళ నాటకాలు ఆడేవారు. నాటకం అర్థం కానప్పటికీ ఒక్కో నటుడు అలంకరించుకుని స్టేజీపైకి వచ్చే సందర్భంగా వారి ఎంట్రీకి మేమంతా గెంతేవాళ్లం. ఆ విధంగా ప్రతి అంశంలోనూ పాల్గొని ఆనందించేవాడిని. ఓసారి కబడ్డీ ఆడుతుండగా.. పొరుగు బృందం సభ్యుడు నన్ను పట్టుకున్నాడు. ఆ సమయంలో వాడి పన్ను నా తలకు గుచ్చుకోవడంతో పెద్దగాయమైంది. ఆ తర్వాత ఇప్పటికీ కబడ్డీ ఆడలేదు. ఆ రోజేలే వేరు.. మా చిన్నతనంలో వేసవి సెలవులు గడిపిన తీరు ఒక అద్భుతం. ఇప్పటి జనరేషన్‌కు పిల్లలు వేసవి సెలవులు గడిపేతీరు పూర్తిగా వేరు. ఈత కొట్టడంలో వ్యాయమంతోపాటు శరీరం ధృడంగా అయ్యేది. ఇప్పుడు ఈత కొట్టడానికి బావులే లేవు. ఎంతసేపు వీడియోగేమ్స్.. కంప్యూటర్ క్లాస్‌లంటూ మళ్లీ బడివాతావరణాన్నే ఆస్వాదిస్తున్నారు. మేమై తే వేసవి సెలవుల్లో పుస్తకాలు ముట్టేవాళ్లమే కాదు.