breaking news
Testing Method
-
బంకమట్టి రేణువులతో కరోనా పరీక్ష
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకిందో లేదో గుర్తించడానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–గౌహతి పరిశోధకులు చౌకైన, తేలికైన విధానాన్ని అభివృద్ధి చేశారు. వైరస్ నిర్ధారణకు ఇదొక ప్రత్యామ్నాయం అవుతుందని చెబుతున్నారు. ఇందుకోసం వారు బంకమట్టి రేణువులు ఉపయోగించారు. కరోనా వైరస్ కలిగిన ఉప్పునీటి ద్రావకంలో ఈ రేణువులు వేగంగా మార్పులకు గురవుతున్నట్లు తేల్చారు. రేణువుల్లోని క్లే–ఎలక్ట్రోలైట్ సిస్టమ్ అవక్షేపణ రేటు మారుతున్నట్లు గుర్తించారు. ఈ మార్పులను బట్టి వైరస్ సోకిందో లేదో సులభంగా గుర్తుపట్టవచ్చని పేర్కొన్నారు. మార్పులేవీ లేకపోతే వైరస్ సోకనట్లే. బాధితుల నుంచి నమూనాలు సేకరించి, ఈ పరీక్ష నిర్వహిస్తే ఫలితంగా త్వరగా తేలిపోతుంది. సార్స్–కోవ్–2ను గుర్తించడానికి ప్రస్తుతం పాలిమెరేజ్ చైన్ రియాక్షన్(పీసీఆర్) టెస్టు చేస్తున్నారు. దీనికి చాలా సమయం పడుతోంది. అంతేకుండా భారీ యంత్ర పరికరాలు అవసరం. యాంటిజెన్ టెస్టు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ఈ పరీక్షలో కచ్చితత్వం తక్కువే. యాంటీబాడీ టెస్టింగ్‌కు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని ఐఐటీ–గౌహతి ప్రొఫెసర్ టి.వి.భరత్ చెప్పారు. ప్రయోగశాలలు, నిపుణులు, వనరులు లేనిచోట ఇలాంటి పరీక్షలు చేయలేం కాబట్టి బంకమట్టి రేణువులతో వైరస్‌ను గుర్తించడం చక్కటి ప్రత్యామ్నాయం అవుతుందని పేర్కొన్నారు. దీంతో కచ్చితమైన ఫలితం లభిస్తుందని వెల్లడించారు. ఈ పరీక్ష కోసం పరిశోధకులు బెంటోనైట్ అనే బంకమట్టి ఉపయోగించారు. ఇందులో విశిష్టమైన రసాయన నిర్మాణం ఉంటుంది. కాలుష్య కారకాలు, భారీ లోహాలను సైతం సులభంగా పీల్చుకోగలదు. బంకమట్టి రేణువులు వైరస్‌లను గ్రహిస్తాయి. అందుకే వైరస్ల ఉనికిని గుర్తించడానికి బంకమట్టి ఉపయోగించే విధానాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. -
టెన్త్ పరీక్షలు.. ఇక 80 మార్కులకే!
పరీక్షా సమయం 2.45 గంటలు మిగిలిన 20 అంతర్గత మూల్యాంకనంలో కేటాయింపు సబ్జెక్టు నిపుణుల సలహాలు తీసుకుంటున్న విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుకు కసరత్తు పాఠ్యాంశంపై అవగాహన కల్పించటమే లక్ష్యం మచిలీపట్నం : పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతన విధానంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఒక్కొక్క సబ్జెక్టు పరీక్ష 100 మార్కులకు కాకుండా 80 మార్కులకు నిర్వహించనుంది. మిగిలిన 20 మార్కులను ఉపాధ్యాయులు అంతర్గత మూల్యాంకన విధానంలో నిర్ణయించి కలుపుతారు. దీనికి సంబంధించి ఈ నెల ఏడో తేదీన ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ జీవో నంబరు 41ని జారీ చేశారు. ఈ జీవో విడుదలైన అనంతరం వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులను హైదరాబాద్‌కు పిలిపించి పదోతరగతి పరీక్షల విధానంలో జరుగుతున్న మార్పులపై సూచనలు తీసుకుంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఇప్పటి వరకు బట్టీ విధానం ద్వారా విద్యార్థులకు శ్రమ కలి గించే విధంగా పాఠ్యాం శాల బోధన జరుగుతోంది. తాజా పద్ధతిలో ప్రతి పాఠ్యాంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉంది. దానిపై విద్యార్థికి ఉన్న అవగాహనను ఉపాధ్యాయులు అవలోకనం చేసుకుని అంతర్గత మూల్యాం కనంలో మార్కులు కేటాయించాల్సి ఉంటుంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం పాఠ్యాంశంపై విద్యార్థికి పూర్తిస్థాయిలో అవగాహన కలగాలనేది విద్యాశాఖ ముఖ్య ఉద్దేశం. దీని కోసం నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)ని అమలు చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందనేది విద్యావేత్తల అభిప్రాయం. ఈ విధానాన్ని 1922లో జమ్మూ కాశ్మీర్లో అమలు చేశారు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, హర్యానా, ఢిల్లీలో అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని మన రాష్ట్రం లో అమలు చేయాలని మూడేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమగ్ర మూల్యాంకనానికి అనుగుణంగానే పాఠ్యపుస్తకాల రూపకల్పన చేశారు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం-2005, రాష్ట్ర విద్యా ప్రణాళిక-2005 తదితర చట్టాలను ఆధారంగా చేసుకుని ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నారు. అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఇదే విధానాన్ని అమలు చేసి ఒకే ప్రశ్నపత్రాన్ని ఇవ్వనున్నారు. గత ఏడాది వరకు పదో తరగతి పరీక్షలు రెండున్నర గంటలు నిర్వహించే వారు. ఈ విధానం అమలైతే 2.45 గంటలు పరీక్షా సమయం ఉంటుంది. 15 నిమిషాల పాటు ప్రశ్నపత్రం చదువుకునేందుకు అవకాశం ఇస్తారు. మార్కుల కేటాయింపు ఇలా... ఇప్పటి వరకు ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో మార్పు చేయనున్నారు. నూతన పద్ధతిలో 80 మార్కులకు పరీక్ష నిర్వహించి మిగిలిన 20 మార్కులను అంతర్గత మూల్యాంకన పరీక్షలో భాగంగా నాలుగు నిర్మాణాత్మక, రెండు సంగ్రహణాత్మక పరీక్షలు ఉపాధ్యాయుడు నిర్వహిస్తారు. వీటిలో వచ్చిన మార్పుల సగటును బట్టి 20 మార్కులను విద్యార్థికి కేటాయిస్తారు. ప్రాజెక్టు వర్క్, స్లిప్ టెస్ట్, నోట్సులు రాయటం, ప్రయోగాలు, పుస్తక సమీక్షలు, చర్చావేదికలు నిర్వహించి విద్యార్థి పాఠ్యాంశాన్ని అర్థం చేసుకున్నాడా లేదా అనేది గ్రహించాల్సి ఉంది. గతంలో మాదిరిగానే హిందీకి ఒక పేపరు, మిగిలిన సబ్జెక్టులకు రెండు పేపర్లు పరీక్షలు ఉంటాయి. హిందీ పరీక్ష 80 మార్కులకు నిర్వహిస్తే కనీ సం 16 మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా గుర్తిస్తారు. మిగిలిన సబ్జెక్టుల్లో 28 మార్కులు కచ్చితంగా రావాలి.అంతర్గత మార్కులు హిందీలో నాలుగు, మిగి లిన సబ్జెక్టుల్లో ఏడు వస్తే ఉత్తీర్ణులవుతారు. అంతర్గత మూల్యాంకనంలో సున్నా మార్కులు వచ్చి రాతపరీక్షలో 35 మార్కులు వస్తే విద్యార్థులు ఉత్తీర్ణులవుతారు. అంతర్గత మూల్యాంకనంలో 20 మార్కులు వచ్చినా రాత పరీక్షలో మాత్రం 28 మార్కులు కచ్చితంగా వస్తేనే ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారు. -
ఉద్యోగ పరీక్షలకు విధానం ఖరారు
టీఎస్పీఎస్సీ పరీక్షలు, సిలబస్‌లో మార్పులు ► పెరిగిన పేపర్లు.. మారిన సిలబస్ ► నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతో కొత్తగా గ్రూప్-3 ► {Vూప్-1, 2 పరీక్షల్లో అదనంగా మరో పేపర్ ► కొత్తగా ‘తెలంగాణ ఉద్యమం, ఆవిర్భావం’ ► {Vూప్-1, 2లో పెరిగిన ఇంటర్వ్యూ మార్కులు ► సర్వీసుల వారీగా పోస్టుల విభజన ► ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసే ఉద్యోగాల విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. పరీక్షల విధానంలోనూ, సిలబస్‌లోనూ పలు మార్పులు చేసింది. డెరైక్ట్ రిక్రూట్మెంట్కు వీలుగా పోస్టుల పునర్విభజనతో పాటు పోటీ పరీక్షల విధానాన్ని బుధవారం ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రానికి అనుగుణంగా పరీక్షల విధానం, పోస్టులను వర్గీకరించాలని గత ఏడాది ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో టీఎస్పీఎస్సీ నియమించిన నిపుణుల కమిటీ గ్రూప్స్, ఇతర సర్వీసుల వర్గీకరణతో పాటు పరీక్షల విధానం, సిలబస్‌పై అధ్యయనం చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని సైతం ఏర్పాటు చేసింది. ఈ నివేదికలన్నీ పరిశీలించిన అనంతరం తుది విధివిధానాలను విడుదల చేసింది. కొత్త సర్వీసు.. కొత్త పేపర్ గ్రూప్-1, గ్రూప్-2తో పాటు ప్రభుత్వం కొత్తగా గ్రూప్-3 కేటగిరీని చేర్చింది. ఇప్పటివరకు గ్రూప్-2లో ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-3లో చేర్చింది. గ్రూప్-4 సర్వీసులను యథాతథంగా ఉంచింది. ఇక సర్వీసుల వారీగా పోస్టులను వర్గీకరించింది. గ్రూప్-1లో 20 రకాల పోస్టులు, గ్రూప్-2లో 12, గ్రూప్-3లో 17 రకాల పోస్టులను పొందుపరిచింది. ఇక ఇప్పటివరకు గ్రూప్-1లో ఐదు పేపర్లు, గ్రూప్-2లో మూడు పేపర్లు ఉండేవి. తాజాగా ప్రభుత్వం కొత్తగా గ్రూప్-1లో ఆరో పేపర్‌ను, గ్రూప్-2లో నాలుగో పేపర్‌ను చేర్చింది. ‘తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం’ పేరుతో తెలంగాణ ఉద్యమంలోని వివిధ దశలను ఈ కొత్త పేపర్లో సిలబస్‌గా పొందుపరిచింది. మొత్తంగా గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు ఇంటర్వ్యూ పద్ధతిని యథాతథంగా కొనసాగించింది. గ్రూప్-1లో ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జనరల్ ఇంగ్లిష్ పరీక్షతో పాటు మరో ఆరు పరీక్షలు రాయాలి. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం వెయ్యి మార్కులుంటాయి. అందులో ఇంటర్వ్యూకు వంద మార్కులు కేటాయించారు. గ్రూప్-2లో నాలుగు పేపర్లు అబ్జెక్టివ్ పద్ధతిలోనే ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున, ఇంటర్వ్యూకు 75 మార్కులు కలిపి మొత్తం 675 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో ఇంటర్వ్యూకు 50 మార్కులే ఉండేవి. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన గ్రూప్-3 సర్వీసులో పొందుపరిచిన 17 రకాల పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు. ఈ పరీక్షలకు మూడు పేపర్లు ఉంటాయి. గ్రూప్-2లో నిర్దేశించిన నాలుగు పేపర్లలో ‘తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం’ మినహా మిగతా మూడు పేపర్లు ఇందులో ఉన్నాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులుంటాయి. ఇక గ్రూప్-4, గ్రేడ్ టూ మ్యాట్రన్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, గ్రూప్ సర్వీసుల పరిధిలోకి రాని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు, సీనియర్ స్టెనోగ్రాఫర్స్, ఫోర్ట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేటర్స్, సీనియర్ రిపోర్టర్స్ పోస్టులకు నిర్వహించే పరీక్షల విధానాన్ని ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచింది. గ్రూప్-1 సర్వీసులు (20) డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ (కో ఆపరేటివ్ సొసైటీస్), జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా రిజిస్ట్రార్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, లే సెక్రెటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్-2, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఎంపీడీవో. గ్రూప్-2 సర్వీసులు (12) మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3, ఏసీటీవో, డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2, జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (గ్రామీణాభివృద్ధి), ఎక్సైజ్ ఎస్ఐ, ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-2, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్), ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-1(ఎండోమెంట్స్). గ్రూప్-2 పరీక్షా విధానం: (మొత్తం 675 మార్కులు) పార్ట్-ఏ (ఆబ్జెక్టివ్ పద్ధతి) పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు, 150 మార్కులు పేపర్-2: హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు. (1.తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం; 2.భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; 3.సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు) పేపర్-3: ఎకానమీ అండ్ డెవలప్మెంట్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు(ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు. (1.భారత ఆర్థిక వ్యవస్థ: అంశాలు, సవాళ్లు; 2.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 3.అభివృద్ధి, మార్పు అంశాలు) పేపర్-4: తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు. (1.తెలంగాణ తొలి దశ -ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-1970); 2.ఉద్యమ దశ (1971-1990); 3.తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం (1991-2014)) పార్ట్-బి ఇంటర్వ్యూ-75 మార్కులు గ్రూప్-3 సర్వీసులు (17) సీనియర్ అకౌంటెంట్ ఆడిటర్ సీనియర్ ఆడిటర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆడిటర్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్స్ జూనియర్ అకౌంటెంట్ (ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ పే అండ్ అకౌంట్స్ ట్రెజరీస్, లోకల్ ఫండ్ సెక్రటేరియట్, ఫైనాన్స్ లా విభాగంలోని సబ్ సర్వీసు వివిధ శాఖాధిపతుల మినిస్టీరియల్ సర్వీస్‌లోని ఈ కేడర్ పోస్టులు) గ్రూప్-3 పరీక్షా విధానం (మొత్తం మార్కులు 450) రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్).. పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. 150 మార్కులు. 2.30 గంటలు పేపర్-2: హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు. (1.తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం; 2.భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; 3.సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు) పేపర్-3: ఎకానమీ అండ్ డెవలప్మెంట్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు. (1.భారత ఆర్థిక వ్యవస్థ-అంశాలు, సవాళ్లు; 2.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 3.అభివృద్ధి, మార్పు అంశాలు) గ్రూప్-4 సర్వీసులు: జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అకౌంటెంట్స్, జూనియర్ స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్స్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తదితరాలు గ్రూప్-4 పరీక్షా విధానం (మొత్తం మార్కులు 300) (ఆబ్జెక్టివ్ టైప్) 1.జనరల్ నాలెడ్జ్: 150 మార్కులు 2.సెక్రెటేరియల్ ఎబిలిటీస్: 150 మార్కులు గ్రూప్-1 పరీక్షా విధానం: (మొత్తం 1000 మార్కులు) ప్రిలిమినరీ టెస్ట్.. 1.జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్). 150 ప్రశ్నలు, 150 మార్కులు. 2.30 గంటల వ్యవధి. మెయిన్ పరీక్షలు (రాత పరీక్షలు).. 1.జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ టెస్ట్) 3 గం. 150 మార్కులు పేపర్-1: జనరల్ ఎస్సే, 3 గంటలు. 150 మార్కులు (1.సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు; 2.ఆర్థిక అభివృద్ధి, న్యాయపరమైన అంశాలు; 3.భారత రాజకీయ స్థితిగతులు; 4.భారతీయ చరిత్ర సాంస్కృతిక వారసత్వం; 5.సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి; 6.విద్య, మానవ వనరుల అభివృద్ధి) పేపర్-2: హిస్టరీ, కల్చర్ - జాగ్రఫీ. 3 గం. 150 మార్కులు (1.భారత దేశ చరిత్ర, సంస్కృతి. ఆధునిక యుగం(1757-1947); 2.తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం; 3.భారతదేశం, తెలంగాణ జాగ్రఫీ) పేపర్-3: ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన. 3 గంటలు. 150 మార్కులు (1.భారతీయ సమాజం, నిర్మాణం, అంశాలు, సామాజిక ఉద్యమాలు; 2.భారత రాజ్యాంగం; 3.పరిపాలన) పేపర్-4: ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 3గం. 150 మార్కులు (1.భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 2.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ; 3.అభివృద్ధి, పర్యావరణ సమస్యలు) పేపర్-5: సైన్స్-టెక్నాలజీ-డేటా ఇంటర్‌ప్రిటేషన్. 3 గం,150 మార్కులు. (1.శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పాత్ర, ప్రభావం; 2.విజ్ఞానశాస్త్ర వినియోగం లో ఆధునిక పోకడలు;3.డేటా ఇంటర్‌ప్రిటేషన్-సమస్యా పరిష్కారం) పేపర్-6: తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం. 3 గంటలు. 150 మార్కులు (1.తెలంగాణ తొలి దశ (1948-1970); 2.ఉద్యమ దశ (1971-1990); 3. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991-2014)) ఇంటర్వ్యూ: 100 మార్కులు