breaking news
telugu vennela
-
టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు
డాలస్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 209వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. సదస్సు ప్రారంభ సూచికగా మోహన రాగంలో త్యాగరాయ కృతి 'రామా నన్ను బ్రోవరా' కీర్తనను చిరంజీవి సమన్విత మాడా తన మధుర కంఠంతో పాడి సాహితీ ప్రియులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ముందుగా దివంగతులైన టాంటెక్స్ పూర్వ అధ్యక్షులు లావు రామకృష్ణ గారికి సభ్యులందరూ ఒక నిముషము మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.స్వాగతోపన్యాసం చేసిన పాలక మండలి సభ్యులు, సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ సాహిత్య వేదికను ప్రతి నెల 3వ ఆదివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి డి పి అనురాధ గారి జీవిత విశేషాలను,అ ఖండ తెలుగుజాతి పూర్వాపరాలను తెలుసుకోవడానికి వారు చేస్తున్నఎనలేని కృషిని చక్కగా వివరించారు. ఇక సీనియర్ పాత్రికేయులు డి పి అనురాధ మాట్లాడుతూజజ తెలుగు జాతి చరిత్రను పాఠ్య పుస్తకాలలో చదివిన తాను తన గురువు తల్లాప్రగడ సత్యనారాయణ గారి మార్గదర్శకత్వంలోనూ తన అత్తమామల ప్రోత్సాహంతోనూ దాదాపు రెండువేల సంవత్సరాల నుంచి నేటివరకూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడుతున్న తెలుగు జాతి వారి మూలాలను అన్వేషిస్తూ పరిశోధక దృష్టితో అనేక దేశాలు పర్యటించినట్లు తెలియచేశారు. ఆగ్నేయాసియా దేశాల్లో స్థిరపడిన తెలుగుజాతివారిని కలుసుకొని వారి పుట్టుపూర్వోత్తరాలు వారి భాషాభిమానం అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. అంతేగాదు ఆదిమ తెలుగు జాతి ప్రాచీన ప్రాభవం ఈ రోజుకి ఎలా గుబాళిస్తోందో తనదైన శైలిలో చక్కగా వివరించారు. శ్రీలంక, మయన్మార్, వియత్నాం, థాయ్‌లాండ్, కంబోడియా,ఇండోనేషియాల్లో ముఖ్యమైన పట్టణాలు, మారుమూల పల్లెలు తిరిగిన తాను ఆయా ప్రదేశాల్లో తెలుగు వారి అడుగుజాడలను పరిశీలంచిన వైనాన్ని చక్కగా విశదీకరించారు. ఆయాదేశాల చారిత్రక స్థలాలలోనున్న స్థూపాలు, శాసనాలు పరిశీలించి, వాంగ్మయంలోను, వలస వెళ్ళిన వారి భాషలోను, వారి జ్ఞాపక కథనాలలోను, విడి విడిగా ఉన్న సమాచారాన్ని తనదైన పద్ధతిలో క్రోడీకరించి అన్వయించి చెప్పారు. అలాగే వారి పూర్వీకులు మన ఆంధ్ర ప్రాంతం నుంచి బతుకుతెరువు కోసం తప్పనిసరై ఇతర దేశాలకు వెళ్లడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వారి పూర్వీకులు కట్టిన గుడి గోపురాలు కట్టిన విధానం, వారి వ్యవసాయ పద్ధతులు, వ్యాపార ధృక్పథం తాను పరిశీలించడం జరిగిందన్నారు. వారి ఆచార వ్యవహారాల్లోనూ జీవన వైవిధ్యం, కళాకారుల ఉత్తమ కృషి, వారి పనితనం మనం స్పష్టంగా చూడ వచ్చునన్నారు. ‘మన్’జాతిలో మనవాళ్ళను, థాయ్‌లాండ్ ‘చిమ్మయి’ పిల్లను,, ద్వారావతి, హరిపుంజాయి వంటి థాయ్ ప్రాంతాల్లో మన పూర్వీకుల విశేషాలను, తెలుగు చీర చుట్టిన ‘చామదేవి’ చంపాలో ‘భద్రేశ్వరుని’, అక్కడ బంగారు తాపడాలు చేసిన ఘననిర్మాణాలు, శిల్పాలు చెక్కిన తెలుగు సంతతి వారి పూర్వీకుల తపనల స్వరూప విశేషాలను అనూరాధ గారు వివరించారు. శ్రీలంకకు మన శ్రీకాకుళానికి గల సత్సంబంధాన్ని చక్కగా వివరిస్తూ కొన్ని చోట్ల తాను ''మీరెవరు'' అని పలకరించిన వెంటనే ప్రతివారు తమ సమాధానంగా ''అక్కా ''అంటూ ప్రతిస్పందించడం తననెంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఆయాప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న తెలుగు వారు తమ భాషా సంస్కృతిని కాపాడుకొంటూ రాబోయే కాలంలో ఏదో ఒకరోజు ఆంధ్రా ప్రాంతమునుంచి ''తలైవా '' అంటే ''తెలుగు మాట్లాడే గౌరవప్రదమైన నాయకుడు'' తప్పకుండా వస్తారనీ వారు తమ ఉనికిని గుర్తిస్తారనే ఆశతో బ్రతుకుతునారని వారి జీవన సరళిని కళ్ళకు కట్టినట్లు విశదీకరించారు. తమిళ జాతి వారితో కలిసి మన తెలుగు వారు నివసిస్తున్న చోట్ల సింహ పురి, దంతపురి పేర్లతో పిలువ బడే నగరాలుండేవని పేర్కొన్నారు. అలాగే ,''విమల''''విజయ''అనే పేరుతో పిలువబడేవారు.. చాలా చోట్ల కనిపించారని, కొన్ని చోట్ల మన తెలుగువారు తమ వారిని ఇంటిలో తెలుగు పేరుతోనూ బయట పని చేసేచోట తమిళ పేరుతోనూ పిలుచుకుంటున్నట్లు చెప్పారు. ఈ విధానాన్ని పాటిస్తున్న వైనం తన దృష్టికి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఆగ్నేయాసియాలో తెలుగు వెలుగుని దేదీప్యమానం చేసే అఖండ తెలుగుజాతి విశేషాలను తాను శోధించిన పలు అంశాలను అనూరాధ గారు సోదాహరణంగా వివరించి సాహితీప్రియుల నుండి విశేష అభినందనలు అందుకొన్నారు.గత 79 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక ''మన తెలుగు సిరి సంపదలు''శీర్షికన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం రసవత్తరంగా సాగింది. తర్వాత ప్రముఖ సాహితీ విమర్శకులు లెనిన్ వేముల పలనాడు జిల్లా మాచర్ల కేంద్రంగా జన చైతన్య సాహిత్య విస్తృతికి విశేషంగా పాటుపడి, పౌరహక్కుల ఉద్యమాలకు 70వ దశకం నుండి 30 యేళ్ళ సుదీర్ఘ కాలంగా వెన్నంటి నిలిచి, చివరి వరకూ నమ్మిన విలువలకు కట్టుబడి జీవించి నాయకత్వ కుశలతతో ఎందరినో ఉత్తమ ఆశయాల వైపు ఆకర్షింపజేసి గతవారం కన్నుమూసిన కామ్రేడ్ రామినేని సాంబశివరావు కోసం అలనాటి విప్లవ గేయాలనెన్నో ఆలపించి అంజలి ఘటించారు.తరువాత సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా 2024 సంవత్సరంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ మున్నెన్నడూ లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలుగు సాహిత్య సదస్సుల విశేషాలనూ ప్రధాన వక్తలైన ముఖ్య అతిథుల ప్రజ్ఞా పాటవాలను ''సింహావలోకనం''లో ఒక్కొక్క నెల వారీగా చక్కగా వివరించారుసంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, చిన్న సత్యం వీర్నాపు , ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, లెనిన్ బండ, మూలింటి రాజ శేఖర్ , మాధవి సుంకిరెడ్డి , భాను, కొల్లారపు ప్రకాశరావు శర్మ, గోవర్ధనరావు నిడిగంటి వంటి సాహితీ ప్రియులు డి పి అనురాధ గారి ప్రసంగంపై తమ తమ ప్రతిస్పందనలు తెలియచేశారు. తర్వాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు సంస్థ పాలక మండలి సభ్యులు, సమన్వయ కర్త దయాకర్ మాడ ముఖ్య అతిథి డి పి అనురాధ గారికి సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి ఘనంగా సన్మానించడం జరిగింది. ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని పేర్కొంటూ డి పి అనురాధ తన ప్రతిస్పందనలో కృతజ్ఞతను వెలిబుచ్చారు.చివరగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సమన్వయ కర్త దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సతీష్ బండారు తమ అధ్యక్షోపన్యాసంలో సంస్థ పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి అధికార కార్యవర్గ బృందం సభ్యులకు అభినందనలు తెలిపారు. (చదవండి: ఫిలడెల్ఫియాలో నాట్స్ బాలల సంబరాలకు అద్భుత స్పందన) -
ఘనంగా టాంటెక్స్ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సును సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రవాసంలో నిరాటంకంగా 136 నెలలు పాటు ఉత్తమ సాహితీవేత్తల మధ్య సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి, ఉత్సాహంగా పాల్గొని సభని జయప్రదం చేశారు. కార్యక్రమంలో ముందుగా మంజుల తెలిదేవర శిష్య బృందం వృంద, సంజన, హమ్సిక, అంటోనియో ప్రార్ధనా గీతంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. తరువాత సింధూర, సాహితి వేముల అన్నమాచార్య కృతి ఆలపించారు. డా. ఊరిమిండి నరసింహారెడ్డి మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి, జాతీయాలు, పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. చంద్రహాస్ మద్దుకూరి ‘రగిలింది విప్లవాగ్ని ఈ రోజు’ పాట పూర్వాపరాలు వివరించారు. అలాగే దానిలో ఉపయోగించిన చరిత్ర, అల్లూరికి కలిగించిన ప్రేరణ వివరించారు. లెనిన్ వేముల తెలుగు శాసనాల చరిత్రని, పరిణామక్రమాన్ని వివరించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ ఆముక్తమాల్యదలోని కొన్ని పద్యాలను రాగ యుక్తంగా చదివి వాటి అర్ధం వివరించారు. డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి రాగ యుక్తంగా ఎంకి పాటలు పాడి అలరించారు. ముఖ్య అతిధి మల్లవరపు అనంత్‌ని మద్దుకూరి చంద్రహాస్ సభకు పరిచయం చేయగా, టాంటెక్స్ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రమణ్యం పుష్పగుచ్చంతో సత్కరించారు. మల్లవరపు అనంత్ మాట్లాడుతూ.. శ్రీ శ్రీ ప్రముఖంగా అభ్యుదయ కవి, విప్లవ కవి అని, అలాంటి శ్రీ శ్రీ రచనలలోనుండి హాస్యం వెతకడం సాహసమే అవుతుందన్నారు. శ్రీ శ్రీ వ్రాసిన సిప్రాలి (సిరి సిరి మువ్వలు, ప్రాసక్రీడలు, లిమఋక్కులు ) పుస్తకాన్ని కూలంకషంగా పరిశీలించి దానిలోని హాస్యాన్ని సభికులకు పంచి సభలో నవ్వులు పూయించారు. కేవలం నవ్వు పుట్టించడం కోసమే కాకుండా చైతన్యం, విమర్శ, సామాజిక ప్రయోజనం లక్ష్యంగా శ్రీ శ్రీ రచనలలో హాస్యం తొణికిసలాడిందని పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని మొదటి తరం సాహితీ వేత్తలు ముందు తరాల కందించే విధానానికి అమెరికాలోని సాహితీ వేత్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంత్ మల్లవరపుని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు, కోశాధికారి పాలేటి లక్ష్మి పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంత్ మల్లవరపు తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిథ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం మాట్లాడుతూ అనంత్ మల్లవరపు సాహిత్య సేవలను కొనియాడారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. -
టెక్సాస్‌లో ఘనంగా తెలుగు వైభవం కార్యక్రమం
టెక్సాస్: తెలుగు వైభవం, నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమాలను ఉత్తర టెక్సాస్ సంఘం(టాంటెక్స్) టెక్సాస్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాలకు పలువురు విశిష్ట అతిధులు హాజరయ్యారు. 120 నెలల పాటు వరుసగా సాహిత్య సదస్సులు నిర్వహించిన ఘనత టాంటెక్స్‌కు ఉంది. ప్రముఖ సాహితీవేత్తలను ఆహ్వానించి వారి సమక్షంలో టాంటెక్స్ ఈ సదస్సులను నిర్వహిస్తుంది. ఈ నెల 8వ తేదీన జరిగిన తెలుగు వైభవం 10వ వార్షికోత్సవం , తెలుగు వెన్నెల కార్యక్రమాలకు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, సింగిరెడ్డి శారద, పలువురు సాహితీ ప్రియులు హాజరయ్యారు. సాహిత్య వేదిక సమన్వయ కర్త సింగిరెడ్డి శారద 2017లో జరిగిన సాహిత్య కార్యక్రమాల మీద మాట్లాడారు. ప్రొ. వీ దుర్గాభవాని తెలుగుసాహిత్యం మీద, దాసరి అమరేంద్ర 'తెలుగు యాత్రా సాహిత్యం' అనే అంశాలపై ప్రసంగించారు. డా.కాత్యాయని విద్మహే, వాసిరెడ్డి నవీన్, డా.కందిమళ్ల సాంబశివరావు, గొర్తి బ్రహ్మానందం, మెర్సీ మార్గరెట్, నశీం షేక్, కేవీ సత్యనారాయణ, ఆదిభట్ల మహేష్ ఆదిత్య తదతరులు కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. గాయని సునీత, వందేమాతంర శ్రీనివాస్, భార్గవి పిళ్లై, దినకర్, యాసిన్ నజీర్, సమీర భరద్వాజ్‌లు సంగీతంతో అలరించారు.