breaking news
Telangana state team
-
టెన్‌పిన్ బౌలింగ్ విజేతలు కిరణ్, జ్యోతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్‌పిన్ బౌలింగ్ చాంపియన్‌షిప్‌లో కిరణ్, జ్యోతి ఆకట్టుకున్నారు. తెలంగాణ టెన్‌పిన్ సంఘం ఆధ్వర్యంలో ఇనార్బిట్ మాల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో కిరణ్, నరేశ్... మహిళల కేటగిరీలో జ్యోతి, మమత వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను త్వరలో బెంగళూరు వేదికగా జరుగనున్న జాతీయ టెన్‌పిన్ బౌలింగ్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్టుకు ఎంపిక చేశారు. ఐదు రోజుల పాటు పోటీలు జరగ్గా....100కు పైగా ప్లేయర్లు పాల్గొన్నారు. శుక్రవారం ఫైనల్స్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమానికి విచ్చేసిన ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టెన్‌పిన్ బౌలింగ్ సంఘం కార్యదర్శి రాహుల్ రెడ్డి, సినీ నటుడు శ్రీధర్, రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ సంఘం అధ్యక్షుడు భరత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్ర-తెలంగాణ బాక్సింగ్ టోర్నీ
తెలంగాణకు టీమ్ టైటిల్ ఎల్బీ స్టేడియం: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో టీమ్ టైటిల్‌ను తెలంగాణ రాష్ట్ర జట్టు చేజిక్కించుకుంది. తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో శనివారం జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ బాక్సర్ల ఆధిపత్యమే కొనసాగింది, ఈ పోటీల ముగింపు వేడుకలకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.కరణ్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్‌లో అర్జున అవార్డీ జయరామ్ పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు 49 కేజీలు: 1.సదానంద్ (తెలంగాణ), 2.సాయి కృష్ణ (ఏపీ). 52 కేజీలు: 1.వై.ప్రభుదాస్ (ఏపీ), 2.సి.మహేందర్ (తెలంగాణ). 56 కేజీలు: 1.సి.హెచ్.ధీరజ్ (తెలంగాణ), 2. అప్పలరాజు (ఏపీ). 60 కేజీలు: 1.కరణ్ కుమార్ (తెలంగాణ), 2. బాలాజీ (ఏపీ). 64 కేజీలు: 1.ఎం.గణేశ్ (తెలంగాణ), 2. బి.వెంకటేష్ (తెలంగాణ). 69 కేజీలు: 1.ఎస్.సాయి (తెలంగాణ), 2.వి.సాయినాథ్ (ఏపీ). 75 కేజీలు: 1. ఎం.శివ కుమార్ (తెలంగాణ), 2.ఎ.రమేష్ (ఏపీ). 81 కేజీలు:1.టి.శ్రీకాంత్ (తెలంగాణ),2.కె.మాధవరెడ్డి (ఏపీ). 91 కేజీలు: 1.వి.పి.ప్రభాకర్ (ఏపీ), 2.ఎం.డి.మోసిన్ (తెలంగాణ). +91 కేజీలు: 1. నిరంజన్ (ఏపీ), 2.ఎ.సంతోష్ (తెలంగాణ).