breaking news
telangana advocate JAC
-
పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు
హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌పై నాంపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు నమోదైంది. కాకినాడ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో పవన్ ప్రసంగంపై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ తెలంగాణ వాసుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని తమ ఫిర్యాదులో పేర్కొంది. అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ జేఏసీ డిమాండ్ చేసింది. -
రేవంత్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ అడ్వొకే ట్ జేఏసీ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కించపరిచేలా మాట్లాడటమే కాకుండా ‘దొరగారి బూట్లు నాకు పో’ అని వ్యాఖ్యలు చేసి, దళిత జాతిని అవమానపర్చారని, ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కింద కేసు నమోదు చేయాలని తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ సభ్యులు శనివారం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నల్లాల ఒదెలును ఉద్దేశపూర్వకంగానే రేవంత్‌రెడ్డి కించపరిచారని, ఈ వాఖ్యలు దళిత జాతిని అవమానపర్చడమేనని తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ సభ్యులు సి.హెచ్. ఉపేంద్ర, గోవర్ధన్‌రెడ్డి, కొమరయ్య, బ్రహ్మానందరెడ్డి, కె.ఎస్.కృష్ణ తదితరులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.