breaking news
Teak tree
-
టేకు ఆకుతో లేజర్ తీవ్రతకు చెక్..!
టేకు అనగానే.. అందమైన ఫర్నీచర్లో ఇమిడిన విలువైన కలప గుర్తొస్తుంది. టేకు చెట్టులో కలప తప్ప ఆకులు ఎందుకూ పనికిరావని ఇన్నాళ్లూ అనుకునేవాళ్లు. కానీ ఈ పత్రాలకు కూడా గొప్ప ప్రయోజనం ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. తీవ్రమైన లేజర్ కిరణాల రేడియేషన్ను అడ్డుకునే శక్తి టేకు ఈ ఆకుల్లో ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. వైద్యం, వినోద రంగం, పరిశ్రమలు, రక్షణ రంగం, శాస్త్రీయ పరిశోధన.. ఇలా ఆధునిక యుగంలో ప్రధాన రంగాల్లోనూ.. ఇంటర్నెట్కు వెన్నెముక లాంటి ఫైబర్ ఆప్టిక్స్లోనూ.. టేకు ఆకుల్లోని ప్రత్యేక శక్తిని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్అత్యంత ప్రభావశీలమైన లేజర్ కిరణాల రేడియేషన్ నుంచి చర్మాన్నీ, కంటినీ, సున్నితమైన ఆప్టికల్ పరికరాలను సైతం రక్షించే శక్తి టేకు ఆకులకు ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. వైద్యం, వినోద రంగం, పరిశ్రమలు, రక్షణ రంగం, శాస్త్రీయ పరిశోధన.. ఇలా ఆధునిక యుగంలో ప్రధాన రంగాల్లో లేజర్ రేడియేషన్దే ప్రధానపాత్ర. ఇంటర్నెట్కు వెన్నెముక లాంటి ఫైబర్ ఆప్టిక్స్లోనూ లేజర్ కిరణాలే కీలకం. అయితే, వీటిని ఉపయోగించే సమయంలో పొరపాటున ఆ కిరణాలు మనుషుల కళ్లకు, శరీరానికి హాని జరగనీయకుండా అడ్డుపడే కవచాన్ని రూపొందించేందుకు టేకు ఆకు అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిధులతో పరిశోధనలు చేసే స్వయంప్రతిపత్తి గల సంస్థ ‘రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఆర్ఐ)’ శాస్త్రవేత్తల పరిశోధనలో టేకు ఆకు ప్రయోజకత్వం వెల్లడైంది. ఆర్ఆర్ఐను ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సర్ సి.వి.రామన్ స్థాపించారు.ప్రత్యేక లక్షణాలు టేకు ఆకులను ఎండబెట్టి, పొడి చేసి, ఆ పొడిని ప్రత్యేక రసాయనాల్లో నానబెట్టి, శుద్ధి చేసిన తర్వాత గోధుమ–ఎరుపు రంగు ద్రవాన్ని వెలికితీశారు. ఈ వర్ణద్రవ్యానికి లేజర్ కాంతి లక్షణాలు మార్చి, తీవ్రతను తగ్గించే నాన్లీనియర్ ఆప్టికల్ (ఎన్ఎల్ఓ) గుణాలు ఉన్నట్టు ఆర్ఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. అధిక తీవ్రతల వద్ద కాంతి ప్రసారాన్ని తగ్గించడానికి.. మన శరీరం, కళ్ళను కాపాడటానికి నాన్ లీనియర్ వస్తువుల్లో ఉండే ఆప్టికల్ పవర్ లిమిటింగ్ ఉపయోగపడుతుంది. ఇవే లక్షణాలు టేకు ఆకుల్లోనూ ఉన్నట్టు పరిశోధనలో వెల్లడైంది.‘సింథటిక్’ పదార్థాలకు బదులుగా..ఇప్పటివరకు వాడుతున్న గ్రాఫీన్, ఫుల్లెరెన్స్, మెటల్ నానోపార్టికల్స్ వంటి ప్రకృతికి హాని కలిగించే ఖరీదైన సింథటిక్ ఆప్టికల్ పదార్థాలకు బదులు టేకు ఆకుల్లోని రంగులను వాడుకోవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సహజమైన, కుళ్లి ప్రకృతిలో కలిసిపోయే పర్యావరణ ప్రియమైన, విరివిగా లభించే టేకు ఆకులను ఉపయోగించటం ద్వారా లేజర్ రక్షక కళ్లజోళ్లు, ఇతర ఆప్టికల్ పరికరాలు తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.లేజర్ రేడియేషన్ ఉపయోగాలులేజర్ రేడియోషన్ లేదా లేజర్ కాంతి ఎంత ప్రయోజనకరమైనదో అంతే ప్రమాదకరమైనది. దీన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకమైన కళ్లజోళ్లు ధరించాలి. లేజర్ కాంతి కంటిని నేరుగా తాకితే దృష్టి కోల్పోయే ప్రమాదం ఉంది. అధిక శక్తి గల లేజర్లు చర్మాన్ని కూడా కాల్చేయగలవు. దీన్ని అనేక రంగాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు.» వైద్యరంగంలో కన్ను, చర్మ సంబంధ శస్త్ర చికిత్సలు; డయాగ్నొస్టిక్స్లో...» పరిశ్రమల్లో కటింగ్, వెల్డింగ్, లేజర్ మార్కింగ్, లేజర్ స్కాన్లలో..» శాస్త్రీయ పరిశోధనలో కాంతి లక్షణాలను అధ్యయనం చేయడానికి..» సీడీ ప్లేయర్లు, లేజర్ పాయింటర్లు, బార్కోడ్ స్కానర్ వంటి వినియోగదారుల ఉత్పత్తుల్లో..» రక్షణ రంగంలో కమ్యూనికేషన్, శత్రువుల క్షిపణులను కూల్చడం వంటి వాటికి.. » వినోద రంగంలో లేజర్ లైట్ షోలు, స్పెషల్ ఎఫెక్టుల కోసం.. -
పచ్చదనమివ్వని చెట్టు రాష్ట్ర చిహ్నమా?
జన జీవితాలలో టేకు చెట్ట్టు ప్రసక్తి ఎక్కడా ఉండదు. వైద్యానికి ఇది చాలా దూరం. ప్రజల సంస్కృతిలో ఇది భాగం కాదు. ఏ రకంగా చూసినా ఇది తెలంగాణ ప్రజల ప్రాతినిధ్యపు వృక్షం కాలేదు. టేకు చెట్టుని రాష్ట్ర చిహ్నంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం చూడటం సరికాదు. జాతీయ, రాష్ట్రీయ చిహ్నాలు తప్పక ఆ నేలతో సంబంధం కలిగి ఉండాలి. అక్కడ నివసించే ప్రజలకు చిరపరిచితాలై ఉండాలి. ప్రజల సంస్కృతిలో భాగం కావాలి. పైగా గౌరవనీయత, పవిత్రత ఉండాలి. 90 శాతం ప్రజలు వాటిని తమవిగా భావించగలగాలి. అలా కాని పక్షం లో ఆ చిహ్నాలకు విలువ ఉండదు. ప్రజలు గౌరవిం చని చిహ్నాలు కాగితాలలో చిహ్నాలుగానే మిగిలిపో తాయి. తెలంగాణ రాష్ట్ర పుష్పంగా మోదుగ పువ్వు ను, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర జంతువుగా అడవి దున్నను ఎంపిక చేయడం ముదావహం. కాని రాష్ట్ర వృక్షంగా టేకు చెట్టుని ఎంపిక చేయడాన్ని పునఃపరిశీలించవలసి ఉంది. ఒక దేశం లేదా రాష్ట్రం ఎంచుకునే చిహ్నాలకు ప్రజలతో సాంస్కృతికపరమైన అనుబంధం ఉండాలి. వాటికి గౌరవప్రదమైన సామాజిక విలువ ఉండాలి. ఆదివాసులు ఉండే ప్రాంతాలలో పెరిగే ఖరీదైన చెట్లను వారు ఏ రకంగానూ గుర్తించరు. వారిది వ్యాపార దృక్పథం కాదు. కేవలం కలప కోసం మాత్రమే పనికి వచ్చే చెట్లకు వారి సమాజాల్లో ఎలాంటి విలువా లేదు. అందుకే గిరిజన జానపద విజ్ఞానం దృక్పథం లోంచి చిహ్నాలను చూడవలసి ఉంటుంది. చారిత్రకంగా అవి మన నేలతో సంబంధం కలిగి ఉండాలి. ప్రజల జీవితాలలో భాగం కావాలి. వారి భావనలలో మంచి విలువలు కలిగి ఉం డాలి. అప్పుడే అది ప్రజలు మెచ్చే చిహ్నం కాగలదు. రాష్ట్ర పక్షిగా పాలపిట్టని రాష్ట్ర జంతువుగా అడవి దున్నను ఎంపిక చేయడాన్ని అన్ని రకాలుగా స్వాగతించవచ్చు. తెలం గాణలో దసరా ఉత్సవంలో భాగంగా ఊరి బయట జమ్మి చెట్టుకి నమస్కరించి పాలపిట్టను చూడటం సంప్రదాయం. అది శుభసూచకం. ఒక పిట్టను వేలాది మంది ఏకకాలంలో చూడటం ఒక గొప్ప సంస్కృతి. చిన్న పెద్ద, స్త్రీ పురుష, ధనిక పేద అనే తేడాలు లేకుండా ఆ పక్షిని చూడటం అనేది తరతరాలుగా వస్తున్న సంప్ర దాయం. పాలపిట్టని కాదని బలంగా ఉందని గద్దను గుర్తించలేం కదా. అలాగే టేకు చెట్టుని కూడా ప్రజలు రాష్ర్ట వృక్షంగా స్వీకరించలేరు. అందుకు కారణాలు అనేకం. టేకుకి తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయా నికీ, విశ్వాసాలకి ఎలాంటి సంబంధం లేదు. ఆ చెట్టుకు ప్రజల జీవితాలతో ఎలాంటి అనుబంధం లేదు. టేకుని కేవలం వ్యాపార వృక్షంగానే గుర్తి స్తారు. వలస పాలనలో ఇబ్బడి ముబ్బడిగా పరాధీనమైన భూములను ఖాళీగా ఉంచకుండా, వాటిలో టేకు చెట్లు నాటి డబ్బు చేసుకోవడానికి రియల్టర్లు నగరాలకి తెచ్చారు. నిజానికి ఆనాడు ఆంగ్లేయులు భారతదేశాన్ని నాలుగు వృక్ష విభాగా లుగా చేసి చెట్లు పెంచారు. సెంట్రల్ ఇండియాలో బర్మా తదితర ప్రాంతాల నుంచి తెచ్చిన టేకు చెట్లను ఇక్కడి అడవు లలో విస్తారంగా విత్తారు. దీని కలప పడవలు, ఓడలు తయారు చేయడానికి బాగా పనికివస్తుంది. అందుకే టేకు చెట్ల పెంపకాన్ని ఆంగ్లే యులు విశృంఖలంగా పెంచారు. టేకు కలపలో ఒక రకమైన తైల గుణం ఉంటుంది. అందు వల్ల అది గట్టిగా, దృఢంగా ఉంటుంది. అయితే టేకు పెరిగిన చోట ఇతర వృక్షాలు పెరగవు. ఆ ప్రాంతం అంతా చెదలు పడు తుంది. టేకు చెట్టు మీద పక్షులు వాలవు. టేకు ఆకులు తిన డానికి పశువులు సైతం నిరాకరిస్తాయి. పైగా టేకు విత్తనాలు మొలకెత్తాలంటే అవి కాలి టప్మని పగలాలి. అందుకే వర్షా కాలానికి ముందు అడవిని కాలుస్తారు. అంటే చిన్న చిన్న మొల కలు, గడ్డి అంతా సర్వనాశనం అవుతుంది. పచ్చదనం స్థానే ఒక రకమైన శ్మశాన దృశ్యం కానవస్తుంది. టేకు నీడన జీవజా లం, జంతువులు కూడా సౌకర్యంగా బతకలేవు. పక్షులు గూడు కట్టడానికి కూడా టేకు చెట్టు దరిదాపులకి రావు. కేవలం కలప కోసమే తప్ప టేకు చెట్టు అన్ని రకాలుగా నష్టం. తెలంగాణలో అడవుల విధ్వంసానికి, పర్యావరణ నష్టానికి టేకు ఒక కారణం. టేకు వృక్షం ఈ నేలలో స్వతసిద్ధంగా పెరగలేదు. పరాయి ప్రాంతం నుండి వలస వచ్చి ఇక్కడి దేశీయ వృక్షాలకు నిలువ నీడ లేకుండా చేసిన చెట్టది. దాని పంచన తలదాచుకుందా మన్నా నీడను ఇవ్వలేని రూపం దానిది. అడవుల్లో ఆదివాసీలు టేకు చెట్టుని ముట్టుకుంటే శిక్షిస్తారు. జైల్లో పెడతారు. టేకు ఎవ రబ్బ చెట్టని ప్రభుత్వాధికారులు, అటవీ శాఖాధికారులు భావి స్తారో తెలియదు. ఇవ్వాల్టికీ టేకుని అనుమతి లేకుండా పెంచితే నేరం. ఇవాళ టేకుని రియల్టర్లు పెంచుతున్నారు. వ్యాపార స్థులకి మాత్రమే ఉపయోగపడే టేకు ప్రజలను భయభ్రాంతు లకు గురిచేస్తుంది. అనాదిగా ప్రజలు మన దేశీయ వృక్షాలను ఆరాధించి వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఏనాడు కూడా వ్యాపార సంబంధమైన చెట్లను వారి జీవితాలలో భాగం చేయలేదు. మేడి చెట్టుని తండ్రిగా, అందుగ చెట్టుని తల్లిగా, మారేడు, నేరేడు చెట్లని పూజనీయంగా భావించారు. ఇప్ప చెట్టుని, వేప చెట్టుని ఆది తల్లిగా భావించారు. ప్రతి పెళ్లి రోజున ఒక చెట్టుని పెంచే అనాది ఆచారం ఉన్నా తెలంగాణలో డబ్బులు ఇచ్చి ఇంట్లో టేకుని పెంచమన్నా నిరాకరిస్తారు. ప్రజలకు తెలుసు పక్షి కూడా వాలని చెట్టు ప్రకృతికి శ్రతువు అని. ఇప్పుడు కాలుష్యం వెదజల్లని, ప్రకృతి పర్యావరణానికి పెద్ద పీట వేయాలని భావించే ప్రభుత్వం టేకుని రాష్ట్ర చిహ్నంగా ఉంచితే అది బంగారు తెలంగాణ భావనకి విరుద్ధమే. నవ తెలంగాణలో చెట్టుని కూడా వ్యాపారం చేసే ఆలోచన ఉంటే, పర్యావరణాన్ని సైతం లెక్క పెట్టనితనం ఉంటే బేషర తుగా ప్రకటించుకోవచ్చు. కాని ప్రజలు మాత్రం హర్షించరు. కోట్లాది చెట్లు పెంచాలనే ఆలోచన ఉన్నప్పుడు, పెంచిన టేకు చెట్లని అమ్ముకోవడానికి నిరంతరం నరకడం తప్పదు. నరు క్కునే చెట్లు చిహ్నాలా? తల్లి లాంటి ఇప్ప చెట్టు, నీడనిచ్చే వేపలు చిహ్నాలు కావా? ఒక్క కాగితం తయారీ కోసం వలస పాలకులు కాగజ్ నగర్నీ, భద్రాచలం ఐటీసీని ఏర్పరిచి వెదురుని ఆసాంతం కుళ్లబెరికారు. ఇప్పుడు వాటి అవసరాలకు అడవులను నరికి వేసి నీలగిరి చెట్లు పెంచుతున్నారు. సహజమైన అడవుల స్థానే కృత్రిమ అవసరాలను తీర్చే సంస్కృతి తెలంగాణ పర్యావర ణానికి శత్రువు. నరకడం కోసమే చెట్లను పెంచడం బాధాకరం. మనిషి కోసం చెట్టుని పెంచడం మానవత్వం. అలాంటి చెట్టే ఆదర్శం కావాలి. తెలంగాణలోని చెట్లని కాల్చి బొగ్గు చేసి ఇతర ప్రాంతాల విద్యుత్ ప్రాజెక్టులకు పంపడం ఆపాలి. పచ్చదనం ఇవ్వని చెట్టు తెలంగాణకు చిహ్నం కారాదు. ఆ సంస్కృతి ప్రజావ్యతిరేకమే. (వ్యాసకర్త జానపద సాహిత్య వేత్త) జయధీర్ తిరుమలరావు