breaking news
Synthetic clothing
-
ఈ వేసవికి మేలైన ఎంపిక...
ఫ్యాషన్ టిప్స్ వేసవిలో సింథటిక్ దుస్తులు ధరిస్తే చెమటకు ఇరిటేషన్ కలుగుతుంది. ర్యాష్ వస్తుంది. వీలైనంతగా ప్రకృతి సిద్ధమైన రంగులు, ప్రింట్లు ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుంటే మేలు. ఈ కాలానికి తగ్గట్టుగా మనకు అందుబాటులో ఉన్న కలంకారీ, మంగళగిరి, ప్లెయిన్ మల్ మల్, ప్రింటెడ్ మల్ మల్, కోరా, ఛీజ్ కాటన్, ఖాదీ కాటన్లు... తక్కువ రేటుకే లభిస్తాయి. చర్మానికి సౌకర్యంగా ఉంటాయి. కూల్ కలర్స్... వేసవిలో ముదురు రంగుల మీద అంత ఆసక్తి ఉండదు. అందుకని ఏ రంగువైనా మీడియం, లేత రంగులను ఎంచుకోవాలి. అంటే పచ్చను ఇష్టపడే వారు లేత పచ్చ, ఎరుపు అయితే లైట్ ఆరెంజ్, బ్లూ అయితే లైట్ బ్లూ... ఇలా స్లక్ట్ చేసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ వద్దు... కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ రెండు మూడు నెలలకే ఉపయోగపడుతుంది. అదీ తక్కువ రేటు ఫ్యాబ్రిక్ మీద ఎక్కువ ఖర్చుపెట్టి హెవీగా ఎంబ్రాయిడరీ చేయించుకునే కన్నా క్రోషియా, జర్దోసీ, క్లాత్, నెట్...లేసులు వాడి చూడముచ్చటగా డిజైన్ చేసుకోవచ్చు. -
చల్లచల్లని కూల్ కూల్..
‘ఈసారి వేసవి ముందే వచ్చేస్తోంది. ఫిబ్రవరి తొలివారానికే పెరిగిన ఉష్ణోగ్రతలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఓ వైపు ఎండవేడి, ఉక్కపోత భరించలేకపోతుంటే మరోవైపు సంప్రదాయదుస్తులు ఊపిరాడనివ్వడం లేదు’ అంటూ వాపోయేవారికి చల్ల చల్లగా కూల్ కూల్‌గా ‘సమ్మర్వేర్’ ఆహ్వానం పలుకుతోంది. చల్లచల్లని ఫ్యాబ్రిక్: సింథటిక్ దుస్తులు ధరిస్తే వేడికి చికాకు కలుగుతుంది. చర్మం మీద దద్దుర్లు వస్తాయి. అందుకని చర్మానికి సౌకర్యంగా ఉండేవి, వీలైనంతవరకు ప్రకృతి సిద్ధమైన రంగులు, ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుంటే మేలు. కలంకారీ, మంగళగిరి, ప్లెయిన్ మల్ మల్, ప్రింటెడ్ మల్ మల్, కోరా, ఛీజ్ కాటన్, ఖాదీ కాటన్లు... తక్కువ రేటుకే లభిస్తాయి. ఇవి చర్మానికి సౌకర్యంగానూ ఉంటాయి. వీటితో వదులుగా ఉండేలా నచ్చినట్టు దుస్తులను డిజైన్ చేసుకోవచ్చు. లేదా ఈ ఫ్యాబ్రిక్‌తో ఉన్న రెడీమేడ్ దుస్తులను కొనుగోలు చేయవచ్చు. కాలానుగుణంగా దుస్తులను ధరించడంలో భారతీయులు ఏ మాత్రం ఆసక్తి చూపరంటూ విదేశీయులు విమర్శ చేస్తుంటారు. అందులో కొంత నిజం లేకపోలేదు. అయితే మన చర్మ రంగు, శరీరాకృతి, వాతావరణం, సంప్రదాయాలు.. ఇవన్నీకురచ దుస్తులు ధరించడానికి సహకరించవు. అయితే ఆధునికపు హంగులతో పాటు సౌకర్యాలను కోరుకునే నేటికాలపు మహిళలు, కాలేజీ అమ్మాయిల కోసం ప్రత్యేకంగా రూపొందిన వేసవి దుస్తులు ఇప్పటికే మార్కెట్లో ప్రత్యేక అమ్మకాలకు వచ్చి కనువిందు చేస్తున్నాయి. అయితే వాటి ఎంపికలోనే ఎవరికి వారు తమదైన ముద్ర చూపించాలి. లేత రంగులు... ధరించిన దుస్తుల రంగు గాడీగా ఉంటే బయట వేడి మరికాస్త పెరిగిందేమో అనిపిస్తుంటుంది. అందుకని లేత రంగులను ఎంచుకోవాలి. అంటే ఆకుపచ్చను ఇష్టపడే వారు లేత ఆకు పచ్చ, పసుపును ఇష్టపడేవారు లేత పసుపు, ఎరుపు అయితే లైట్ ఆరెంజ్, బ్లూ అయితే లైట్ బ్లూ... ఇలా ఎంపిక చేసుకోవచ్చు. నూలుతో ఆధునికం: నూలు వస్త్రంతో ఆధునిక, సంప్రదాయ తరహా రెండువిధాల దుస్తులనూ తయారు చేయించుకోవచ్చు. సల్వార్ కమీజులను ఏ నూలు వస్త్రంతో అయినా కుట్టించుకోవచ్చు. అనార్కలీ అయితే ఫ్లెయిర్ ఎక్కువగా ఉంటుంది కనుక ఛీజ్, మల్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి. పాశ్చాత్య దుస్తులైన గౌన్లను కలంకారీ, ఖాదీ కాటన్‌తో కుట్టించుకుంటే లుక్ స్టైలిష్‌గా మారిపోతుంది. స్కర్ట్స్ కోసం లినెన్, ఖాదీని వాడుకోవచ్చు. లినెన్ ఫ్యాబ్రిక్ తక్కువ ఖరీదులోనూ లభిస్తుంది. దీనితో కుర్తీలు, ట్రౌజర్లను డిజైన్ చేసుకోవచ్చు. ఆఫీసుకు వేసుకెళ్లడానికి లినెన్ ట్రౌజర్లు, లినెన్ షర్ట్స్, షార్ట్స్ డిజైన్ చేయించుకోవచ్చు. అయితే ఏ తరహా దుస్తులైనా పగటి పూట సాదాగా ఉండే లేత రంగులు గలవి, సాయంకాలం ప్రింట్లు ఉన్న దుస్తులను ఎంచుకోవాలి. లేత రంగుల గౌనులు వేసవి ప్రత్యేకం. ఇలాంటప్పుడు కాంట్రాస్ట్ బెల్ట్ వాడితే స్టైలిష్‌గా కనిపిస్తారు. చమట, ఉక్కపోతల బాధలేకుండా లాంగ్ కాటన్ స్కర్ట. ఈ వేసవికి మీ వార్డరోబ్లో ఉండాల్సినదుస్తులు: పలాజో ప్యాంట్స్, గౌన్లు, షార్ట్స, స్కర్టలు, కెప్రిస్... కాటన్ కార్గో కెప్రిస్! వదులుగా, మోకాళ్ల వరకు ఉండే కెప్రిస్ వేసవి వేడిని దూరం చేస్తుంది. సౌకర్యంగానూ, ఆధునికంగానూ ఉంటుంది. వేసవి ఉక్కపోతకు చెక్ పెట్టాలంటే వార్డరోబ్లో స్కర్టలా ఉండే పలాజో ప్యాంట్స్ ఉండాల్సిందే! కురచ దుస్తులు ధరించలేం కదా అని ఇబ్బందిపడేవారికి ఈ ప్యాంట్స్ మంచి ఎంపిక. పొట్టివి, పొడవైన స్కర్టలు, గౌనులు అనుకూలమైన ఎంపిక. నిర్వహణ: నిర్మలారెడ్డి