మాటమార్చిన స్విట్జర్లాండ్.. భారత్కు వెన్నుపోటు
స్విట్జర్లాండ్ మాట మార్చింది.. భారత దేశానికి వెన్నుపోటు పొడిచింది. అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారతదేశం చేసుకున్న దరఖాస్తును వ్యతిరేకించింది. చైనాతో గొంతు కలిపింది. ఎన్పీటీలో లేని దేశాలకు ఎన్ఎస్జీలో సభ్యత్వం ఎలా ఇస్తారంటూ చైనా వేసిన ప్రశ్నతో స్విస్ కూడా ఏకీభవించింది. దాంతో ఎన్ఎస్జీలో సభ్యత్వం విషయంలో భారత దేశానికి ఉన్న అవకాశాలు కొంతవరకు సన్నగిల్లాయి.
వాస్తవానికి ఇంతకుముందు.. అంటే ఈ నెల మొదట్లో ప్రధాని మోదీ స్విట్జర్లాండ్లో పర్యటించినపుడు స్విస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జాన్ ష్నైడర్ అమన్ .. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత దేశం చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ప్రామిస్ కూడా చేస్తున్నట్లు తెలిపారు. కానీ కీలక సమయం వచ్చినపుడు హ్యాండిచ్చారు.