ఎన్కౌంటర్పై అన్నీ అనుమానాలే!
♦ సుప్రీం జడ్జితో న్యాయ విచారణ జరపాలి
♦ కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాల ధర్నా
కడప సెవెన్రోడ్స : ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్పై అనేక అనుమానాలున్నాయని, దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని హక్కుల సంఘాలు, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట బైఠారుుంచి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ కె.జయశ్రీ, పౌరహక్కుల సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, ఓపీడీఆర్ నాయకుడు కె.హరిప్రసాద్, విర సం నాయకురాలు వరలక్ష్మి, సీపీఎం రాష్ట్రకమిటీ సభ్యుడు బి.నారాయణ, జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు, సీపీ ఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ తది తరులు మాట్లాడారు. గతనెల 24 నుం చి 29వ తేది వరకు ఏఓబీలో జరిగిన పోలీసు కాల్పుల్లో 32 మంది మావోరుుస్టులు మృతి చెందారన్న వార్తలు తీవ్ర దిగ్భా్రంతి కలిగించాయన్నారు. ఈ ఎన్కౌంటర్ విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయన్నారు.
ప్రభుత్వం చెబుతున్న వాదనల్లో పస లేదన్నారు. బాకై ్స ట్ గనుల తవ్వకాలకు నక్సల్స్, గిరి జనుల నుంచి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించుకునేందుకే ప్రభుత్వం ఎన్కౌంటర్లకు పాల్పడిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆనవాళ్లు పట్టలేని 12 మృతదేహాలను పోలీసులే దహనం చేశారని వారు ఆరోపించారు. ఎన్కౌంటర్ జరిగాక ఆచూకీ తెలియకుండా పోరుున మావోరుుస్టు నాయకుడు రామకృష్ణ పోలీసుల అదుపులోనే ఉన్నాడని ఆయ న భార్య చెబుతున్నారన్నారు. పోలీ సుల అదుపులో ఉన్న మావోరుుస్టు నేత రామకృష్ణ, ఆదివాసులను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేయాలని కోరారు. మరోవైపు ప్రభుత్వం పోటీ ధర్నాలు నిర్వహించడం విచారకరమన్నారు.గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు ఎం.నాగేం ద్రనాయక్, సీఎంఎస్ నా యకురాలు ఝా న్సీలక్ష్మి, సర్తాజ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు గంగా సురేష్, అంకుశం పాల్గొన్నారు.