ఆ హంతకుడు డిప్రెషన్‌తో బాధపడేవాడు
మ్యూనిక్: జర్మనీలోని మ్యూనిక్ నగరంలో మారణకాండకు దిగిన ఉగ్రవాదికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధంలేని పోలీసులు తెలిపారు. అతను డిప్రెషన్‌తో బాధపడేవాడని మ్యూనిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు.
మ్యూనిక్ నగరంలోని ఒలింపియా షాషింగ్ కాంప్లెక్స్‌లోకి చొరబడిన సాయుధుడు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ ఉగ్రబీభత్సానికి తెగబడ్డ సంగతి తెలిసిందే. కాల్పులు జరిపింది ఒక్కడేనని, తొమ్మిదిమందిని కాల్చిచంపిన ఆ సాయుధుడు అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు కొసావాకు చెందినవారు ఉన్నారు. ఈ ఘటనలో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు.