breaking news
sub-registrar s office
-
సబ్‌రిజిస్టార్ కార్యాలయంపై ఏసీబీ దాడి
వైఎస్సార్ జిల్లా మైదుకూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేసి అదనంగా ఉన్న నగదు రూ.65,198ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ నాగరాజు విలేకరులతో మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి పెరిగిపోయిందని తమకు ఫిర్యాదులు అందడంతో దాడి నిర్వహించామన్నారు. సుధాకర్ అనే ప్రై వేటు వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులకు దళారీగా వ్యవహరిస్తూ వసూళ్లు చేస్తుండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే కొంతమంది స్టాంపురైటర్ల వద్ద కూడా లెక్కకు మించి నగదు ఉండటమే గాక పాత తేదీలకు సంబంధించిన స్టాంపులు ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పూర్తి విచారణ అనంతరం సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
మంగళగిరి (గుంటూరు) : గుంటూరు జిల్లా మంగళగిరి సబ్‌రిజస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం మధ్యాహ్నం దాడి చేశారు.ఏసీబీ డీఎస్పీ చంద్రవంశం దేవానంద్ శాం మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీగా అవినీతి జరుగుతోందని పలువురి ఫిర్యాదు మేరకు ఏసీబీ దాడి నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ అన్నామణి, సీనియర్ అసిస్టెంట్ మస్తాన్‌వలితోపాటు ఐదుగురు సిబ్బంది, 12మంది ప్రైవేటు వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుంచి రూ.98,690 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కొనుగోలుదారులు, అమ్మకందారులతోపాటు డాక్యుమెంట్ రైటర్లను విచారిస్తున్నామని, విచారణ కొనసాగుతుందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.. దాడిలో ఏసీబీ సీఐ నరసింహారెడ్డి, సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.