breaking news
stores attacks
-
12 గంటల వ్యవధిలోనే 2 సార్లు దొంగతనం
-
12 గంటల వ్యవధిలోనే 2 సార్లు బీభత్సం
శాన్ఫ్రాన్సిస్కో : ఒక స్టోర్‌లో ఒకసారి దొంగతనం జరిగింది అంటే.. అది గ్రహపాటునో లేదా అలర్ట్‌గా లేకపోవడం వల్లనో జరిగింది అనుకుంటాం. కానీ అదే స్టోర్‌లో మళ్లీ చోరీ జరిగితే, అది మాత్రం కచ్చితంగా సిబ్బంది నిర్లక్ష్యం, అలసత్వమే అవుతుంది. అమెరికాలో టెక్ దిగ్గజం ఆపిల్ స్టోర్‌లో అదే జరిగింది. ఆపిల్ తన కొత్త ఐఫోన్ 10ఎస్ లాంచ్ ఈవెంట్లో నిమగ్నమై ఉన్న సందర్భంగా.. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో ఆపిల్ స్టోర్‌లో 12 గంటల వ్యవధిలో రెండు సార్లు చోరీ జరిగింది. ఈ చోరీలో వేల డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. పాలో ఆల్టో పోలీసులు సమాచారం ప్రకారం.. తొలుత శనివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆపిల్ స్టోర్‌లో దొంగతనం జరిగింది. ఆ సమయంలో ఎనిమిది మంది అనుమానిత వ్యక్తులు డెమోకి ఉంచిన 57 వేల డాలర్ల విలువైన ఐఫోన్లను ఎత్తుకెళ్లారు. దానిలో కొత్త ఐఫోన్లు ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్, ఇతర ప్రొడక్ట్‌లు ఉన్నాయి. ప్రొడక్ట్‌లను దొంగలించిన అనంతరం, వారు పలు వాహనాల్లో పారిపోయారని 9టూ5మ్యాక్ రిపోర్టు చేసింది. వెంటనే ఆదివారం ఉదయమే, మళ్లీ ఆపిల్ స్టోర్ గ్లాస్ డోర్లను బద్దలు కొట్టి మరిన్ని ఉత్పత్తులను దోచుకుపోయారు. మొత్తంగా 12 గంటల వ్యవధిలో పోయిన డివైజ్‌ల విలువ 1,07,00 డాలర్లుగా ఉంటుందని తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఈ చోరీకి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరగలేదు. కేవలం పాలో ఆల్టో ఆపిల్ స్టోర్‌ను మాత్రమే కాకుండా.. కాలిఫోర్నియాలోని మరో స్టోర్ శాంట రోజా ప్లాజా షాపింగ్ సెంటర్‌ను కూడా దుండగులు టార్గెట్ చేశారు. కానీ అక్కడ దొంగలను పోలీసులకు చిక్కారు. గత కొన్నేళ్లుగా ఆపిల్ స్టోర్లను టార్గెట్‌గా చేసుకుని దుండగులు పలు చోరీలకు పాల్పడుతున్నారు. కొత్త ఐఫోన్ల లాంచింగ్ తర్వాత పాలో ఆల్టో ఆపిల్ స్టోర్‌లో ఇప్పటికి రెండు సార్లు దొంగతనం జరిగింది. అది కూడా వెంట వెంటనే. ఆగస్టు, సెప్టెంబర్ మధ్య కాలంలో కూడా ఆరు ఆపిల్ స్టోర్లలో కనీసం తొమ్మిది సార్లు దుండగులు రెచ్చిపోయారు. ఆదివారం శాంట రోజా ప్లాజాలో జరిగిన దొంగతనం కూడా నెల వ్యవధిలోనే రెండోది అని ఫాక్స్ న్యూస్ రిపోర్టు చేసింది. -
ఎరువుల దుకాణాలపై దాడులు
విజయనగరం : జిల్లాలో విజిలెన్స్ అధికారులు ఎరువులు, విత్తనాల వ్యాపారులను బెంబేలెత్తించారు. శని,ఆదివారాల్లో పలు మండలాల్లో దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వఉంచిన రూ. 3.16 కోట్ల విలువ చేసే విత్తనాలు, ఎరువులను సీజ్ చేశారు. విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి, నెల్లిమర్ల మండలాల్లో ఈ దాడులు నిర్వహించారు. విజయనగరంలో అత్యధికంగా రూ. 2.17 కోట్లు, బొబ్బిలిలో రూ. 75 లక్షలు, చీపురుపల్లిలో రూ.13 లక్షలు, నెల్లిమర్లలో రూ.11 లక్షల స్టాక్ సీజ్ చేశారు. నలుగురు డీలర్లపై కలెక్టర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశామని వ్యవసాయశాఖ జేడీ ప్రమీల తెలిపారు. కాగా జిల్లాలో చాలా ప్రాంతాల్లో సోమవారం ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి. గోప్యమెందుకో... బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలో శనివారం రాత్రంతా సోదాలు జరిపిన విజిలెన్స్ అధికారులు మూడు గోదాంల్లో రూ.75 లక్షల ఎరువుల ను సీజ్ చేశారు. ఇంత పెద్ద మొత్తం ఎరువులు సీజ్ అయినా, అన్ని గంటలు పాటు విజిలెన్స్, రెవెన్యూ అధికారులు స్థానిక వ్యవసాయ ఆధికారుల సహకారంతో తనిఖీలు నిర్వహించినా ఆ విషయం బయటకు పొక్కకుండా వ్యవసా య శాఖ సిబ్బంది జాగ్రత్త పడడంపై విమర్శ లు వస్తున్నాయి. మెయిన్ రోడ్డులో ఉండే బొడ్డు గున్నేశ్వరరావుకు చెందిన ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. శ్రీకాకుళం విజిలెన్స్ డీఎస్పీ కుమార్ ఆధ్వర్యంలో వచ్చిన ముగ్గురు సీఐలు గున్నేశ్వరరావు ఎరువుల దుకాణంతో పాటు దిబ్బవీధిలో ఉండే మూడు దుకాణాలను తనిఖీలు చేశారు. మండల వ్యవసాయాధికారితో పాటు ముగ్గురు విస్తరణాధికారులు, ఇద్దరు వీఆర్వోలతో కలిసి అర్ధరాత్రి ఒంటి గంట వరకూ సోదాలు నిర్వహించారు. రికార్డులకు, ప్రత్యక్షంగా ఉండే సరుకుకు తేడాలు ఉండడంతో వాటిని సీజ్ చేశారు. శనివారం అర్ధరాత్రి వరకూ సోదాలు జరుగుతున్నా దాన్ని మీడియాకు తెలియనివ్వకుండా వ్యవసాయాధికారులు జాగ్రత్త పడ్డారు. ఎలాగైతేనేం సోమవా రం ఉదయానికి ఈ విషయం బయటకు పొక్కింది. ఒక దుకాణం, మూడు గోదాంలను సీజ్ చేశారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. 28:28 రకం ఎరువుల బస్తాలు 340 ఉన్నట్టు రికార్డుల్లో నమోదుకాగా, దుకాణంలో 217 బస్తాలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. అలాగే పొటాష్ బస్తాలను రికార్డుల్లో 290 చూపించిగా దుకాణంలో 316 ఉన్నట్లు విజిలె న్స్ తనిఖీల్లో బయట పడింది. అయితే విజిలె న్స్ దాడుల సమాచారాన్ని వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గోప్యంగా ఎందుకు ఉంచారో అంతుపట్టడం లేదు. చీపురుపల్లిలో రూ.13 లక్షల ఎరువుల సీజ్ చీపురుపల్లి : పట్టణంలోని గాంధీబొమ్మ సెంట ర్ వద్ద ఉన్న మహలక్ష్మి ట్రేడర్స్‌లో ఆదివారం సాయంత్రం విజిలెన్స్ డీఎస్పీ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్టాకు రిజిస్టర్లుకు, గోడౌన్లలో ఉన్న నిల్వలకు తేడా ఉండడంతో రూ.13 లక్షలు విలువ గల ఎరువులను సీజ్ చేశారు. దాడుల సమయానికి ట్రేడర్సులో యూరియా 853 బస్తాలు ఉండాల్సి ఉండగా 889 బస్తాలు, ఎస్ఎస్పీ 60 బస్తాలకు గాను 61, పౌడర్ 92కి 89, డీఏపీ ఆరు బస్తాలకు ఒక బస్తా, కోరమాండల్ ఎరువు 215 బస్తాలకు 190 బస్తాలు, 2828 రకం 183 బస్తాలకు 176 బస్తాలున్నాయి. ఇలా రికార్డుల్లో ఒక రకంగాను, గొడౌన్లులో వేరే రకంగాను ఉండడంతో మొత్తం స్టాకును సీజ్ చేశారు. గోడౌన్ల లో ఉన్న స్టాకు విలువ రూ.13 లక్షలు ఉంటుం దని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. నెల్లిమర్లలో 11.33 లక్షల స్టాక్ సీజ్ నెల్లిమర్ల: మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల షాపుపై విజిలెన్స్ అధికారులు ఆది వారం రాత్రి దాడి చేశారు. ఆరు ప్యాకెట్ల విత్తనాలు, 15 బస్తాల ఎరువులు అక్రమంగా నిల్వ ఉంచినట్లు తేలడంతో రూ.11.33 లక్షల విలువైన సరుకును సీజ్ చేశారు. విజిలెన్స్ అధికారులు ఏఓ సూరినాయుడుతో కలిసి ఆదివారం రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో స్థానిక శ్రీనివాస ట్రేడర్స్ షాపుమీద దాడిచేశారు. షాపులోనున్న విత్తనాలు, ఎరువుల స్టాకును రికార్డులతో సరిచూశారు. ఆ సమయంలో రికార్డుల్లో లేని ఒక వరివిత్తనాల ప్యాకెట్, ఆరు మొక్కజొన్న విత్తనాల ప్యాకెట్లు, 15 ఎరువుల బస్తాలు అధికారులకు లభించాయి. షాపు యజమానిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఓ సూరినాయుడు తెలిపారు.