breaking news
state strike
-
నేడు ఏపీ బంద్
ప్రత్యేక హోదా డిమాండ్‌పై వైఎస్సార్సీపీ పిలుపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన గాయం మానకముందే... ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మభ్యపెట్టాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ... ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని నినదిస్తూ... నేడు రాష్ట్రం స్తంభించనుంది. ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపునకు సర్వత్రా ఆమోదం లభిస్తోంది. వామపక్ష పార్టీలు, వివిధ విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు ఈ బంద్‌నకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరులపై ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తి, నిరాశ నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగ యువకుల్లో రోజురోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. భవిష్యత్‌పై ఆశలు కానరాకపోవడంతో ఇప్పటికే ఒకరు గుండె పగిలి మరణించగా, ముగ్గురు బలిదానం చేశారు. మరో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన రాష్ట్రబంద్ పిలుపునకు భారీ మద్దతు లభిస్తోంది. ప్రత్యేక హోదా కోసం బలిదానాలు వద్దు, పోరాటమే ముద్దంటూ... బంద్‌ను విజయవంతం చేయడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. విభజన చేసిన గాయం ప్రత్యేక హోదాతో మానుతుందని ఆంధ్రులు భావించారు. ప్రత్యేక హోదా ఇస్తే భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆశించారు. కానీ 15 నెలలుగా వివిధ ప్రకటనలతో మభ్యపెట్టిన కేంద్ర ప్రభుత్వం చివరకు ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రకటించడం, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలంటూ అంగీకరించడం ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని గాయపరిచాయి. ప్రత్యేకహోదా రాకుంటే ఉద్యోగావకాశాలు రావన్న ఆందోళనతో నిరుద్యోగ యువత.. తల్లితండ్రులు ఆందోళనతో రగిలిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గు చూపడంపై పారిశ్రామికవేత్తలు పెద విరుస్తున్నారు. పారిశ్రామికవేత్తలను కీలుబొమ్మలుగా చేసి ఆడిస్తూ.. భారీ ఎత్తున ముడుపులు దండుకోవాలన్న ఎత్తుగడతోనే ప్రత్యేక ప్యాకేజీకి సీఎం చంద్రబాబు మొగ్గు చూపారని ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తుండటం గమనార్హం. ఇది ఆంధ్రులను మరింత క్షోభకు గురి చేస్తోంది. సొంత లాభం కోసం.. ఐదు కోట్ల మంది భవితను పణంగా పెట్టడంపై ఆంధ్రులు మండిపడుతున్నారు. అందుకే శనివారం రాష్ర్టబంద్ను విజయవంతం చేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తమ ఆకాంక్షను బలంగా వినిపించాలని ఉద్యమిస్తున్నారు. బంద్‌ను జయప్రదం చేయండి * పార్టీ శ్రేణులకు, ప్రజలకు వామపక్షాల పిలుపు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. బంద్‌ను జయప్రదం చేసి రాష్ట్ర ప్రజలు తమ ఆకాంక్షను వ్యక్తీకరించాలని విజ్ఞప్తి చేశాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బంద్‌కు సహకరించాలని కోరాయి. బంద్ విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రయోజనాన్ని ఆకాంక్షించి జరిగే ఈ బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు పాలకపక్షం యత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్ శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో హెచ్చరించాయి. వైఎస్సార్సీపీ బంద్ సక్సెస్ కాకూడదు * పోలీసులకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన, ఇతర పక్షాలు మద్దతు పలికిన శనివారం నాటి బంద్ విజయవంతం కాకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం వ్యూహరచన చేసింది. దీని కోసం వీలున్నంత వరకూ పోలీసులను రంగంలోకి దింపుతోంది. బంద్ విఫలమయ్యేలా అన్ని కోణాల్లోనూ ప్రయత్నాలు చేయాల్సిందిగా పోలీసు విభాగానికి మౌఖికాదేశాలు జారీ చేసింది. జిల్లా ఎస్పీలతో పాటు కమిషనర్లకూ ఆ మేరకు సూచనలు అందాయని తెలిసింది. ఎక్కడైనా ఈ బంద్ విజయవంతమైతే స్థానిక అధికారులతో పాటు ఉన్నతాధికారుల్నీ బాధ్యులుగా చేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరించినట్లు సమాచారం. -
సత్తా చూపిద్దాం.. హోదా సాధిద్దాం
రాష్ట్రప్రజలకు పిలుపునిచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి * ప్రాణాలు తీసుకోవద్దు.. కలసికట్టుగా పోరాడుదాం * ప్రత్యేకహోదాపై చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు * ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు ఏపీని తాకట్టుపెట్టారు * ఢిల్లీ వెళ్లిన బాబు ఆ గంటన్నర సమయం ఏం చేశారు? * ప్రత్యేకహోదాపై కేంద్ర కేబినెట్‌కే సర్వాధికారాలున్నాయి * 14వ ఫైనాన్స్ కమిషన్‌ను సాకుగా చూపిస్తున్నారంతే * ప్రత్యేకహోదా రాకుంటే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది * అందుకే బంద్‌ను విజయవంతం చేసుకుందాం * బంద్‌ను నిర్వీర్యం చేయాలని చూస్తే బాబు చరిత్ర హీనులౌతారు * లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ * ఆయన కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘ప్రాణం ఎంతో విలువైంది... ఎవ్వరూ ప్రాణాలు తీసుకోవద్దు... కలసికట్టుగా పోరాడుదాం... మన సత్తా చూపించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ప్రత్యేకహోదాను సాధించుకుందాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో నాటకాలాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పేలా రాష్ట్రబంద్‌ను విజయవంతం చేయాలన్నారు. ప్రత్యేకహోదాకోసం కేంద్రంపై పోరాడే ధైర్యం చంద్రబాబుకు లేకపోయినా.. లక్ష్మయ్యలాంటి సామాన్యులు తమ ప్రాణత్యాగంతో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారి త్యాగాన్ని చంద్రబాబు గుర్తించడా? లక్ష్మయ్య కుటుంబాన్ని కనీసం ఆదుకునేందుకు ఇప్పటివరకూ ఎవ్వరూ రాకపోవడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. లక్ష్మయ్య త్యాగాన్ని గుర్తించి వారి కుటుంబానికి వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్న లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన శుక్రవారం నెల్లూరుకు వచ్చారు. లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... కలిసికట్టుగా రాష్ట్రాన్ని విడగొట్టారు లక్ష్మయ్య మృతికి కారణాలేమిటో తెలిసినా ప్రభుత్వం తెలియనట్లుగా మభ్యపెట్టి చూపే ప్రయత్నాలు చేస్తోంది. లక్ష్మయ్య కొడుకు వెంకటేశ్వర్లు డిగ్రీ చదివాడు. సరైన ఉద్యోగం లేదు. రాష్ట్రంలో ఏ నిరుద్యోగ యువతను అడిగినా... ప్రత్యేకహోదావల్ల రాష్ట్రానికి ఎంత మంచి జరుగుతుందో, ఎన్ని ఉద్యోగావకాశాలు వస్తాయో చెప్తారు. ఒక్క చంద్రబాబు మాత్రమే ప్యాకేజీవల్లనే లాభమంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడంకోసం చంద్రబాబు బీజేపీతో కలిసి చేసిన వాగ్దానాలేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి? రాష్ట్ర విభజనవల్ల 95 శాతం సర్వీస్ సెక్టార్, 75 శాతం మ్యానుఫ్యాక్చరింగ్ ఏపీకి లేకుండా పోతుందని, అందుకు పరిహారంగా ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని అప్పటి ప్రధాని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేత వెంకయ్యనాయుడు ఐదేళ్లు కాదు.. పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు తామే మొదట ఓటేశామంటూ టీడీపీ ఎంపీలు బయటకొచ్చి రెండువేళ్లు చూపించారు. అలా అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని విడగొట్టారు. ఒక్క హామీ నెరవేర్చారా? ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం కావాలంటే బాబు రావాలి. నిరుద్యోగభృతి రావాలంటే బాబు రావాలి. రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీ కావాలంటే చంద్రబాబు రావాలి అని గోడలమీద రాశారు, టీవీలో ప్రకటనలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ అయినా నెరవేర్చారా? ప్రత్యేకహోదా గురించి అడక్కుండా... సాకులు వెతుకుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఎంపీలతో కలిసి ప్రధానమంత్రి మోదీ, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడుతో గంటన్నరసేపు సమావేశమయ్యారు. బయటకొచ్చాక చంద్రబాబుకానీ, అరుణ్జైట్లీకానీ ప్రత్యేకహోదా గురించి ఒక్కమాట మాట్లాడలేదు. అంటే చంద్రబాబు ప్రత్యేకహోదా గురించి అడగలేదనే కదా అర్థం. తర్వాత వెంకయ్యనాయుడుతో కలిసి చంద్రబాబు హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వద్దకెళ్లారు. అక్కడి నుంచి వచ్చాక వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ప్రత్యేకహోదా గురించి 14 ఫైనాన్స్ కమిషన్ చెప్పలేదని చేతులెత్తేశారు. ఏపీకి చెందిన వ్యక్తి కాబట్టి హోదాకు బదులుగా ప్యాకేజీ కోసం తనవంతు ప్రయత్నిస్తున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పటం ఎంతవరకు న్యాయం? ప్రత్యేకహోదా ఇచ్చే అధికారం 14 ఫైనాన్స్ కమిషన్‌కు లేదు. అయినా ఇటువంటి అబద్ధాలు చెప్పటం ధర్మమేనా? ప్రత్యేకహోదా ఇచ్చే సర్వాధికారాలు కేంద్రకేబినెట్కు, ప్రధానమంత్రికి ఉంటాయి. నాటి కేబినెట్ తీర్మానం ఏమైంది..? ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలని గత కేంద్ర కేబినెట్ తీర్మానించింది. ఆ కేబినెట్ నిర్ణయాన్ని మోదీ కేబినెట్ ఎందుకు అమలు చేయట్లేదు? ఈ విషయంపై చంద్రబాబు ఎందుకు నిలదీయడంలేదు? ప్రత్యేకహోదా ఇవ్వకపోతే కేంద్ర కేబినెట్‌నుంచి ఇద్దరు టీడీపీ మంత్రులతో ఎందుకు రాజీనామా చేయించడంలేదు? ఒక్కటే కారణం... ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయారు. పట్టిసీమ, కాంట్రాక్ట్ పనుల నుంచి, లంచాలు తీసుకుని సంపాదించిన అవినీతి డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.150 కోట్ల నల్లధనాన్ని ఖర్చుచేసేందుకు ప్రయత్నించిన చంద్రబాబు అడ్డంగా దొరికారు. ఓటుకు కోట్లు కేసులో ఎక్కడ జైల్లో పెడతారోననే భయంతోనే చంద్రబాబు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను, హోదాను ఫణంగా పెట్టారు. ప్యాకేజీ పేరుతో మభ్యపెట్టే యత్నాలు... రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా నష్టపోతుందని, అందుకు పరిహారంగా పోలవరంతో పాటు పలు ప్రాజెక్టులు, రహదారులు వంటి ఎన్నో ప్రయోజనాలు కల్పించే విధంగా చట్టం చేశారు. ప్రస్తుతం వాటి కోసమే కేంద్రం నిధులు విడుదల చేస్తోంది. వాటినే కలిపి కొత్తగా ప్యాక్‌చేసి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామంటూ కేంద్రం మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంటే బాబు వంత పాడుతున్నారు. ప్రజలను పక్కదారి పట్టించే యత్నంచేస్తున్నారు. బంద్‌తో సత్తా చూపిద్దాం ప్రత్యేకహోదాకోసం వైఎస్సార్ కాంగ్రెస్ చేపడుతున్న రాష్ట్ర బంద్‌ను అడ్డుకునేందుకు, వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. బంద్‌ను కేంద్రానికి చూపించి ప్రత్యేకహోదా ప్రకటించే విధంగా కృషిచేయాలి. చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొనకపోతే ప్రజలు క్షమించరు. ప్రత్యేకహోదా రాకుంటే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. చంద్రబాబు అడ్డుతగిలినా బంద్‌ను విజయవంతం చేసేందుకు యువత, విద్యార్థులు కలిసిరావాలి.మన సత్తా కేంద్రానికి చూపించాలి. చంద్రబాబు, కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధించుకోవాలి. కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, సీజేసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. మీకు అండగా నేనుంటా ‘‘అధైర్యపడకండి. మీకు అండగా నేనుంటా. మీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తా. ప్రభుత్వం నుంచి మీకు సాయం అందేలా కృషిచేస్తా’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్న లక్ష్మయ్య కుటుంబానికి హామీ ఇచ్చారు. రేణిగుంట నుంచి రోడ్డుమార్గాన నెల్లూరుకు చేరుకున్న ఆయన వేదాయపాళెంలో కేశువులునగర్లోని లక్ష్మయ్య నివాసానికి చేరుకున్నారు. ముందుగా లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మయ్య భార్య విజయమ్మ, కుమారుడు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య సోదరి బుజ్జమ్మతో ప్రత్యేకంగా మాట్లాడారు. లక్ష్మయ్య ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య సోదరి బుజ్జమ్మ వైఎస్ జగన్‌ను పట్టుకుని కన్నీరుపెట్టుకున్నారు. తన బిడ్డలకు దిక్కెవరని రోదించారు. జగన్ ఆమెను ఓదార్చి... ‘‘లక్ష్మయ్య మరణం నన్ను కలచివేసింది. మీకు అండగా నేనుంటా. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాను. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం కోసం కృషిచేస్తాను. అధైర్యపడకండి’’ అని ధైర్యం చెప్పారు. -
రేపు రాష్ట్రబంద్.. వైఎస్సార్సీపీ పిలుపు
-
రేపు రాష్ట్రబంద్
పార్టీ శ్రేణులు, సమైక్యవాదులకు వైఎస్సార్సీపీ పిలుపు టీ బిల్లుపై రాష్ట్రపతి వర్తమానాన్ని కేంద్రం పంపిన తీరుకు నిరసన వారం పాటు నిరసన కార్యక్రమాలు 4న బైక్ ర్యాలీ, 6న మానవహారాలు.. 7-10 వరకు తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు: మైసూరారెడ్డి బాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన బిల్లుపై అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి వర్తమానాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ నెల 3న(శుక్రవారం) రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాన్ని కూడా ఖరారు చేశారు. ‘రాష్ట్రపతి వ ర్తమానాన్ని’ కేంద్రం పంపిన విధానం రాజ్యాంగ స్ఫూర్తిని, సమాఖ్య స్ఫూర్తిని ఎగతాళి చేసే విధంగా ఉందని సమావేశం అభిప్రాయపడింది. సమావేశం వివరాలను పార్టీ పీఏసీ సభ్యులు ఎం.వి.మైసూరారెడ్డి వెల్లడిస్తూ ఆ వర్తమానం పంపిన తీరు చూస్తే ఇక్కడుండేది ఒక రాష్ట్రమని, ప్రభుత్వం, చట్ట సభలున్నాయనే గుర్తింపు కూడా లేకుండా సొంత ఇంటి వ్యవహారంగా ప్రవ ర్తించారని ధ్వజమెత్తారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా శాసనసభలో వ్యవహరిస్తున్న తీరును కూడా ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. నిరసనల వారం.. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా 3న బంద్ చేయడంతో పాటుగా వరుసగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ శ్రేణులు, సమైక్యవాదులకు పిలుపునిస్తున్నామని మైసూరా అన్నారు. 4న మోటారు సైకిళ్ల ర్యాలీ, 6న మానవహారాలు, 7 నుంచి 10 వరకు తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. శాసనసభా సమావేశాల్లో జరిగే పరిణామాలను బట్టి ఆ తదుపరి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేస్తామన్నారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మూడూ దారుణంగా నష్టపోతాయని, అందుకే తమ పార్టీ సమైక్యం కోసం త్రికరణశుద్ధితో పోరాడుతోందని అన్నారు. ఏపీఎన్జీవోలు బంద్ కూడా 3నే ఉందని ప్రస్తావించగా శాసనసభా సమావేశాలు ప్రారంభం అవుతున్నది 3నే కనుక తమ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చిందని, రెండూ యాధృచ్ఛికం కావచ్చని అన్నారు. అయినా సమైక్యం కోసం ఎవరు ఆందోళనకు పిలుపునిచ్చినా మద్దతునిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్, విభజించాల్సిందిగా లేఖ ఇచ్చిన టీడీపీతో కలిసి తమ పార్టీ పనిచేయబోదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ 18 అంశాలపై చర్చకు సిద్ధమే.. అవినీతిపై జగన్‌తో బహిరంగ చర్చకు తాను సిద్ధమని తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై మైసూరా స్పందిస్తూ.. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ.. బాబు తాలూకు 18 అవినీతి అంశాలపై హైకోర్టులో పిల్ వేస్తే సాంకేతిక కారణాలను అడ్డం పెట్టుకుని ఆపుకొన్నారని గుర్తుచేశారు. ఈ అంశాలపై ఆయన పిలిస్తే చర్చకు తాము సంసిద్ధమేనని అన్నారు. మంత్రుల శాఖల మార్పిడి అనేది ముఖ్యమంత్రి ఇష్టమని, అయినా శ్రీధర్‌బాబు శాఖను మార్చడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. విభజన విషయంలో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. బిల్లుపై చర్చ జరగాలని ముఖ్యమంత్రి చేసిన సూచనను ప్రస్తావించగా గతంలో రాష్ట్రాల ఏర్పాటులో గానీ, విభజనలో గానీ ఆయా అసెంబ్లీల్లో తీర్మానాలు చేయడం ద్వారానే సాధ్యమైందని అన్నారు. ఆర్టికల్ 3 కింద రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి ఉన్నప్పటికీ అందుకు కచ్చితంగా ఒక ప్రాతిపదిక అంటూ ఉండాలన్నారు. ఇదే విషయం సర్కారియా, పూంఛి కమిషన్లు రెండూ చెప్పాయన్నారు.