breaking news
srinivasala naidu
-
మరో ముగ్గురికి ఏసీబీ నోటీసులు
-
మరో ముగ్గురికి ఏసీబీ నోటీసులు
హైదరాబాద్:ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసులో దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాసులు నాయుడుకి తెలంగాణ ఏసీబీ నోటీసులు పంపింది. శ్రీనివాసులు నాయుడుతో పాటు చైతన్య, విష్ణు అనే మరో ఇద్దరు వ్యాపారులకు ఏసీబీ నోటీసులు అందజేసింది. మంగళవారంలోగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం శ్రీనివాసనాయుడుకర్ణాటకలోని ఓ బెవరేజస్ కంపెనీకి ఎండీగా ఉన్నారు.