breaking news
SRC
-
జగన్ కు ప్రాణహాని హైకోర్టుకు నివేదిక
-
ఎస్ఆర్సీ నివేదికను సవాల్ చేసుకోండి
సాక్షి, అమరావతి: ప్రాణహాని లేదంటూ సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్ఆర్సీ) ఇచ్చిన నివేదికను సవాల్ చేసుకోవాలని మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఆర్సీ నివేదికను సుధాకర్‌రెడ్డికి అందజేయాలని హోంశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆయనకు భద్రతను కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇందుకు అయ్యే వ్యయాన్ని సుధాకర్‌రెడ్డే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేసులు వాదించానన్న కక్షతో తనకున్న భద్రతను ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, తన భద్రతను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పొన్నవోలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.రాంసింగ్ వ్యాజ్యంపై విచారణ వాయిదా12న తుది విచారణ జరుపుతామన్న హైకోర్టుసాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పటి సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ ఈనెల 12కి హైకోర్టు వాయిదా వేసింది. ఆ రోజున ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది. వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, అలాగే ఫిర్యాదుదారు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్ నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మెమో రూపంలో కోర్టు ముందుంచేందుకు రాంసింగ్‌కు అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం ఇవ్వాలంటూ అప్పటి దర్యాప్తు అధికారి రాంసింగ్ తనను బెదిరిస్తున్నారంటూ గజ్జల ఉదయ్ ఫిర్యాదు అనంతరం పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2022 ఫిబ్రవరి 23న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. తాజాగా గురువారం రాంసింగ్ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఆయన తరఫున కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జూపూడి యజ్ఞదత్ వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను మెమో రూపంలో కోర్టు ముందుంచుతామన్నారు. ఈ సమయంలో ఫిర్యాదుదారు ఉదయ్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రద్యుమ్న కుమార్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ కేసులోలాగే మరో వ్యక్తిని కూడా రాంసింగ్ బెదిరిస్తే కోర్టు రాంసింగ్‌పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిందన్నారు. ఆ కేసును కొట్టేయాలని రాంసింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇప్పటికే కొట్టేసిందన్నారు. అదే రీతిలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని కూడా కొట్టేయాలని ఆయన కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు. -
పెద్ద మనుషుల ఒప్పందం
తెలంగాణ రక్షణలు జస్టిస్ ఫజల్ అలీ సారథ్యంలోని రాష్టాల పునర్విభజన కమిషన్ (ఎస్ఆర్సీ) సిఫారసుల ప్రకారం.. 1962లో జరిగే ఎన్నికల వరకు తెలంగాణను ‘హైదరాబాద్ రాష్ట్రం’ పేరుతో ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలి. ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ్యుల్లో మూడింట రెండొంతుల మంది తెలంగాణను ఆంధ్రాతో విలీనం చేసేందుకు అంగీకరిస్తేనే రెండు రాష్ట్రాలను కలపాలి. అయితే ఈ సిఫారసును పక్కన పెట్టి కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలంగాణ నేతలపై ఒత్తిడి తెచ్చి రెండు ప్రాంతాల నాయకుల మధ్య ఒప్పందం కుదిరేలా చేశారు. దీన్ని పెద్ద మనుషుల ఒప్పందంగా పేర్కొంటారు. 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై సంతకం చేసిన నాటి హైదరాబాద్ రాష్ట్ర మంత్రి కె.వి.రంగారెడ్డితన ఆత్మకథ పుస్తకంలో పేర్కొన్న అంశాలు... ఢిల్లీలోని హైదరాబాద్ అతిథి గృహంలో 1956 ఫిబ్రవరి 20న జరిగిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నేతలు పాల్గొన్నారు. వీరు కుదుర్చుకున్నదే పెద్ద మనుషుల ఒప్పందం. ఈ సమావేశానికి ఆంధ్ర ప్రాంతం నుంచి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న; తెలంగాణ ప్రాంతం నుంచి బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, జె.వి.నర్సింగరావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ఏకీకరణ వల్ల ఉత్పన్నమయ్యే వివిధ అంశాలపై చర్చించి కింద పేర్కొన్న విధంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అవి.. 1రాష్ట్రానికి చెందిన కేంద్ర, సాధారణ పరిపాలనా వ్యయాలను ఉభయ ప్రాంతాలు నిష్పత్తి ప్రకారం భరించాలి. తెలంగాణ నుంచి లభించే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధికే కేటాయించాలి. ఈ ఏర్పాటును ఐదేళ్ల తర్వాత సమీక్షించాలి. తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కోరితే ఈ ఏర్పాటును మరో ఐదేళ్లు పొడిగించొచ్చు. 2 తెలంగాణ శాసనసభ్యుల నిర్ణయం మేరకు తెలంగాణలో మద్య నిషేధాన్ని అమలుచేయాలి. 3 తెలంగాణలో విద్యా సౌకర్యాలను అభివృద్ధి చేయాలి. ఇవి ఆ ప్రాంత విద్యార్థులకే దక్కేలా చూడాలి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న సాంకేతిక విద్యా సంస్థలతో సహా అన్ని కళాశాలల్లో ప్రవేశాలను తెలంగాణ విద్యార్థులకే పరిమితం చేయాలి లేదా రాష్ర్టం మొత్తం మీద మూడో వంతు ప్రవేశాలను తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలి. 4 ఏకీకరణ వల్ల తప్పనిసరైనప్పుడు ఉద్యోగాల రిట్రెంచిమెంటు ఉభయ ప్రాంతాల నిష్పత్తి ప్రకారం జరగాలి. 5 ఇకముందు ఉద్యోగాల్లో చేర్చుకోవడం ఉభయ ప్రాంతాల జనాభా ప్రాతిపదికపై ఉంటుంది. 6 తెలంగాణలో పాలన, న్యాయ వ్యవస్థల్లో ఉర్దూ భాషకు ఉన్న హోదాను ఐదేళ్ల పాటు కొనసాగించాలి. తర్వాత ప్రాంతీయ మండలి పరిస్థితిని సమీక్షించి సవరించొచ్చు. ఉద్యోగాల కల్పనలో తెలుగు భాష తెలిసి ఉండాలన్న నిబంధన విధించకూడదు. అయితే ఉద్యోగం పొందిన తర్వాత రెండేళ్లలోగా నిర్ణీత తెలుగు పరీక్షలో వారు ఉత్తీర్ణులు కావాలి. 7 తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలు పొందడానికి నివాస నిబంధనలు రూపొందించాలి. ఉదా: తెలంగాణ ప్రాంతంలో 12 ఏళ్లు నివశించి ఉండాలి. 8 తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ మండలి అధీనంలో ఉండాలి. తెలంగాణ ప్రాంత అవసరాలు, ఆవశ్యకతల దృష్ట్యా సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి. 10 ప్రాంతీయ మండలిలో 20 మంది సభ్యులుంటారు. తెలంగాణలోని 9 జిల్లాల నుంచి తొమ్మిది మంది శాసనసభ్యులు; శాసనసభ లేదా పార్లమెంట్ నుంచి ఆరుగురు సభ్యులు; శాసనసభ సభ్యులు కాని సభ్యులు ఐదుగురు; వీరిని శాసనసభలోని తెలంగాణ ప్రతినిధులు ఎన్నుకుంటారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులందరూ ప్రాంతీయ మండలి సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి.. వీరిలో ఎవరు తెలంగాణ ప్రాంతం వారైతే వారు ప్రాంతీయ మండలి అధ్యక్షులుగా ఉంటారు. ఇతర కేబినెట్ మంత్రుల్ని కూడా సమావేశాలకు ఆహ్వానించొచ్చు. 11(అ) ప్రాంతీయ మండలి చట్టబద్ధ సంస్థగా ఉంటుంది. ఆయా అంశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకునే అధికారం దానికి ఉంటుంది. అలాగే ప్రణాళికా రచన, అభివృద్ధి వ్యవహారాలు, నీటిపారుదల, ఇతర వ్యవసాయ పథకాలు, పారిశ్రామికాభివృద్ధి (ఇవన్నీ సాధారణ ప్రణాళికకు సంబంధించినవి), తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగ వ్యవహారాలను కూడా ప్రాంతీయ మండలి పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రాంతీయ మండలి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తితే కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలి. (ఆ) ముందుగా ఏదైనా ఒప్పందం ద్వారా సవరిస్తే మినహా ఈ ఏర్పాటుపై పదేళ్ల తర్వాత సమీక్ష చేస్తారు. 12 మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి 60%, తెలంగాణ ప్రాంతం నుంచి 40% మందికి స్థానం కల్పించాలి. తెలంగాణ మంత్రుల్లో ఒకరు తెలంగాణకు చెందిన ముస్లిం ఉండాలి. 13 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే.. తెలంగాణ ప్రాంత వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి. అదే విధంగా తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే.. ఆంధ్ర ప్రాంతం వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి. కింద పేర్కొన్న శాఖల్లో రెండింటిని తెలంగాణ వారికి ఇవ్వాలి. 1. హోం శాఖ 2. ఆర్థిక శాఖ 3. రెవెన్యూ శాఖ 4. ప్రణాళికలు, అభివృద్ధి వ్యవహారాలు 5. వాణిజ్యం, పరిశ్రమల శాఖ 14 1962 చివరి వరకూ తెలంగాణకు ప్రత్యేకంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉండాలని హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోరారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి అభ్యంతరం లేదు. పైన పేర్కొన్న అంశాలను పెద్ద మనుషుల ఒప్పందంలో అంగీకరించారు. 1956 ఫిబ్రవరి 20న కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందానికి అనుగుణంగా ‘తెలంగాణ రక్షణల’ నోట్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బి.ఎన్.దాతర్ 1956 ఆగస్టు 10న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అదేరోజు ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో కూడా సభ్యులకు ఈ నోట్‌ను అందించారు. నోట్లోని అంశాలు 1 ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం మొత్తానికి ఒక శాసనసభ ఉంటుంది. మొత్తం రాష్ట్రానికి అదే చట్టాలు చేస్తుంది. రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. మొత్తం పాలనలో రాష్ర్ట శాసనసభకు బాధ్యత వహిస్తున్న మంత్రి మండలి గవర్నర్‌కు సలహాలిస్తూ సాయపడుతుంది. 2 కొన్ని ప్రత్యేక విషయాల్లో ప్రభుత్వ కార్యకలాపాలు మరింత సులువుగా నిర్వహించడానికి తెలంగాణను ఒక ప్రాంతంగా పరిగణిస్తారు. 3 తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ స్థాయి సంఘం ఉంటుంది. తెలంగాణ ప్రాంత మంత్రులతో సహా తెలంగాణ శాసనసభ్యులు అందులో సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి అందులో సభ్యులు కాదు. 4 ప్రత్యేక విషయాలకు సంబంధించిన శాసనాలను ప్రాంతీయ సంఘానికి నివేదిస్తారు. అలాగే ప్రత్యేక అంశాలపై శాసనాలు చేయాలని ప్రాంతీయ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించొచ్చు. 5ప్రాంతీయ సంఘం సలహాలను ప్రభుత్వం, రాష్ర్ట శాసనసభ ఆమోదిస్తాయి. అభిప్రాయ భేదాలు తలెత్తితే గవర్నర్‌కు నివేదించాలి. గవర్నర్దే తుది నిర్ణయం. ప్రాంతీయ సంఘం కింది అంశాల్ని పరిశీలిస్తుంది.. రాష్ర్ట శాసనసభ రూపొందించిన సాధారణ విధానాలు, అభివృద్ధి, ప్రణాళికల వ్యవహారాలు. స్థానిక స్వపరిపాలనా వ్యవహారాలు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ల రాజ్యాంగాధికారాలు, ట్రస్టులు, జిల్లా బోర్డులు, స్థానిక స్వపరిపాలన లేదా గ్రామ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన ఇతర అంశాలు. ప్రజారోగ్యం, పారిశుధ్యం, స్థానిక ఆసుపత్రులు. ప్రాథమిక, మాధ్యమిక విద్య తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలను క్రమబద్ధీకరించడం మద్యనిషేధం వ్యవసాయ భూముల అమ్మకం కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలు వ్యవసాయ సహకార సంఘాలు, అంగళ్లు, సంతలు. నివాస నిబంధనలు: తెలంగాణ ప్రాంతంలో సబార్డినేట్ ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. కనీసం ఐదేళ్ల పాటు ఆ ప్రాంతంలో నివసించి ఉండాలనే తాత్కాలిక నిబంధనను రిక్రూట్మెంట్ల విషయంలో అమలు చేస్తారు. ప్రస్తుత హైదరాబాద్ నిబంధనల ప్రకారం నివాస షరతులకు అనుగుణంగా ఉన్నవారితోనే ఆయా ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఉర్దూ భాష స్థాయి: రాష్ర్టంలో పాలన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో ఉర్దూ భాషకు ప్రస్తుతం ఉన్న స్థానాన్ని ఐదేళ్ల పాటు కొనసాగించేలా భారత ప్రభుత్వం రాష్ర్ట ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి. కొత్త రాష్ర్టంలో అదనంగా ఉన్న ఉద్యోగాల రిట్రెంచిమెంటు: ఉద్యోగాల్లో ఉన్నవారిని తొలగించాల్సి వస్తుందని, రిట్రెంచిమెంటు అవసరమవుతుందని భారత ప్రభుత్వం భావించడం లేదు. ఎలాంటి వడపోత లేకుండానే హైదరాబాద్ రాష్ర్ట ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర ఉద్యోగాల్లోకి సాధ్యమైనంత వరకు చేర్చుకోవాలి. ఒకవేళ రిట్రెంచిమెంటు అవసరమైతే మొత్తం విశాల రాష్ర్ట ఉద్యోగులందరికీ అది ఒకే విధంగా వర్తిస్తుంది. ఠి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య ఖర్చు పంపిణీ: రాష్ట్రంలోని ఆర్థిక వనరులను బట్టి ఖర్చును కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వం, శాసన సభల అధికారంలోని వ్యవహారం. అయితే కొత్త రాష్ర్టం ఖర్చుల్ని రెండు ప్రాంతాల మధ్య నిష్పత్తి ప్రకారం భరించి తెలంగాణ ఆదాయంలో మిగులును, ఆ ప్రాంతం అభివృద్ధికే కేటాయించాలని ఆంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రతినిధులు అంగీకరించారు. కాబట్టి బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం పాటించవచ్చు. ముఖ్యంగా ఈ ఒప్పందం గురించిన అంశాన్ని ఆంధ్ర ముఖ్యమంత్రి దృష్టికి తేవాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని అమలుపరచాలని కూడా కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ అంశాలపై అంగీకారం కుదరలేదు 1. కొత్త రాష్ట్రానికి పేరు: కొత్త రాష్ర్టం పేరు (ముసాయిదా బిల్లులో ప్రస్తావించినట్లు) ఆంధ్ర తెలంగాణమని ఉండాలని తెలంగాణ ప్రతినిధులు కోరారు. సంయుక్త సెలెక్ట్ సంఘం సవరించినట్లు ఆంధ్రప్రదేశ్ అని ఉండాలని ఆంధ్ర ప్రతినిధులు విన్నవించారు. 2. హైకోర్టు: హైకోర్టు ప్రధాన కేంద్రం హైదరాబాద్‌లో ఉండి.. ఒక బెంచ్ గుంటూరులో ఉండాలని తెలంగాణ ప్రతినిధులు కోరారు. గుంటూరులో బెంచ్ అవసరం లేదని.. మొత్తం హైకోర్టు హైదరాబాద్‌లోనే ఉండాలని ఆంధ్ర ప్రతినిధులు అన్నారు. వి. ప్రకాష్ ప్రెసిడెంట్, ప్రొ॥జయశంకర్ తెలంగాణ ఆర్ అండ్ డీ సెంటర్ -
ఎస్సారెస్సీకి బాబ్లీ నీళ్లు
- నేటి అర్ధరాత్రి గేట్ల ఎత్తివేత -గోదావరిలో పెరగనున్న నీటి ప్రవాహం -త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో విడుదల భైంసా గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలుకాలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను గురువారం అర్ధరాత్రి తెరవనున్నారు. వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను తెరిచి నీటిని వదలనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏటా జూలై 1న గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు నది నీటి సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రకు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో గేట్లను పైకి ఎత్తనున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి గోదావరి నది ప్రవహిస్తూ నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలో అడుగిడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు వరకు ఈ నది ప్రవాహం ఉంటుంది. గోదావరి నదిలో వర్షపు నీరు.. వర్షాలు లేక గతేడాది ఎస్సారెస్పీలో నీరు చేరలేదు. పుష్కరాల సమయంలో గేట్లు ఎత్తడంతో ఆ నీరు బాసర వరకు చేరింది. వర్షాలు లేక గోదావరి నదిలో తవ్విన ఇసుక గుంతల్లోనే ప్రాజెక్టు నీరు ఇంకిపోయింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మంజీర ఉపనదితో వచ్చే నీరు బాసర వద్ద నిలిచి ఉంది. జూన్ మొదటి వారం నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి జలకళ వచ్చింది. బాసర గోదావరి నదిలో స్నానఘట్టాల వద్ద వర్షపునీరు చేరింది. రైలు, బస్సు వంతెనల నుంచి నదిలో నీరు కనిపిస్తోంది. గతేడాది నుంచి ఎడారిలా కనిపించిన గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఎస్సారెస్పీకి నీరు.. బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తనున్న నేపథ్యంలో ఎస్సారెస్పీలోకి నీరు చేరుతుందని రైతులు ఆశిస్తున్నారు. పైగా మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. వరదనీరంతా గోదావరి నదిగుండా ఎస్సారెస్పీకి వస్తుందని భావిస్తున్నారు. ప్రాజెక్టు 14 గేట్లు పైకి ఎత్తి ఉంచడంతో సహజ నది నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం ఉండదు. గోదావరి నది ప్రవహిస్తే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎత్తిపోతల పథకాలతో నీరంది పంటలు పండుతాయి. నీరులేక గతేడాది రెండు జిల్లాలోనూ పంటపొలాలన్నీ బీడుభూములుగా మారిపోయాయి. ఈ యేడాది వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వచ్చే నీటితో ఎత్తిపోతల పథకాలు పనిచేస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల రైతులు వరి పంటలువేసేందుకు పొలాలను సిద్ధం చేసి ఉంచారు.