breaking news
sravana pornami
-
జ్ఞానపూర్ణిమ
స్థితికారుడైన శ్రీహరి జన్మనక్షత్రం శ్రవణం నిండుగా ఉండేది ఈ శ్రావణ పూర్ణిమనాడే. ఈరోజు అనేక పర్వదినాలకు పునాది. వరాహజయంతి: భూమిని చాప చుట్టలా చుట్టిన హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తి వరాహావతారం దాల్చిన ఈరోజున శ్రీమహావిష్ణువును వరాహావతారంలో పూజించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం పాపాలను పటాపంచలు చేసి అనేకమైన శుభపలితాలనిస్తుంది. హయగ్రీవ జయంతి: బ్రహ్మవద్దనుంచి వేదాలను దొంగిలించిన సోమకాసురుడనే రాక్షసురుని సంహరించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవావతారం దాల్చిన రోజిది. ఈ రోజున విద్యార్థులు ‘జ్ఞానానందమయందేవం నిర్మల స్ఫటికాకృతిం, ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే’అనే శ్లోకాన్ని పఠిస్తూ హయగ్రీవ రూపంలోని విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఉన్నత విద్యలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఉత్తరాయణ పుణ్యకాలం కాకపోయినప్పటికీ ఈ రోజు అక్షరాభ్యాసానికి ఎంతో మంచిదని పిల్లల చేత అక్షరాలు దిద్దించే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. జంధ్యాల పూర్ణిమ: యజ్ఞోపవీతం ధరించే ప్రతి ఒక్కరూ నేడు జీర్ణయజ్ఞోపవీతాన్ని విసర్జించి, నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం ఆచారం. అందుకే శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమగా కూడా పిలుస్తారు. -
గోదావరికి మహా నీరాజనం
కొవ్వూరు : గోష్పాదక్షేత్రంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా గోదావరికి విశేష పూజలు నిర్వహించారు. 128వ మాసోత్సవం లో భాగంగా తెన్నేటి సూర్యనారాయణ మూర్తి, అయ్యపురాజు సత్యనారాయణ రాజు దంపతుల చేతులు మీదుగా గణపతిపూజ, గౌతముడు, గోవు పూజలతో గోదావరి మాత విగ్రహానికి అషో్టత్తర శతనామ కుంకుమార్చన చేశారు. అనంతరం నదీ మాతకు మహానీరాజనం సమర్పించారు. నదీలో మహిళలు దీపాలు వెలిగిలించి దీపోత్సవం నిర్వహించారు. నీరాజన సమితి అధ్యక్షుడు కలిగోట్ల కృష్ణారావు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిపారు.