కాల్చేయండి-కొట్టి చంపినా కేసులేదు:ఎస్పి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: రైలు దొంగతనాల నేపథ్యంలో రైల్వే ఎస్పీ శ్యాంప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చోరీలకు పాల్పడేవారిని కాల్చిపారేయమని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. దోపిడీ దొంగలను ప్రయాణికులు పట్టుకొని కొట్టిచంపినా కేసు లేదని చెప్పారు. చట్టమే ఆ వెసులుబాటు కల్పించిందన్నారు. రైళ్ల దొంగతనాల నియంత్రణకు సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఎస్పి శ్యామ్ ప్రసాద్ గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. గత ఏప్రిల్లో చెన్నై ఎక్స్ప్రెస్లో దోపిడీ జరిగిన సందర్భంలో కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే దొంగలను కాల్చేందుకు కూడా వెనకాడబోమన్నారు.