breaking news
someswara temple
-
కనుమరుగవుతున్న మఠాలు
వందల ఏళ్ల నాటి అపురూప ఆలయ సంపద ఆలనాపాలనా లేక ధ్వంసమవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో వీరశైవ మతానికి చెందిన శ్రీచండీకాంబసహిత సోమేశ్వరాలయం ఉంది. వీరశైవ పంచపీఠాల్లో కొలనుపాక ఒకటి. రేణుక సిద్ధుని జన్మభూమిగా ప్రసిద్ధి. ఈ ఆలయ ప్రాంగణంతోపాటు.. గ్రామంలో పలుచోట్ల 22 కులాలకు సంబంధించిన మఠాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తిగా కనుమరుగవగా, మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని కులాలు.. తమ మఠాలను అభివృద్ధి చేసుకుంటుండగా.. నిరుపేద కులాలకు చెందిన మఠాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మఠాల అభివృద్ధి పన్నెండేళ్లుగా పూర్తి కాలేదు. దీంతో శిథిల చరిత్రకు నిలయంగా సోమేశ్వర దేవాలయ ప్రాంగణం నిలుస్తోంది.మఠం అంటే.. మత ధర్మ నిష్టాపరుడై సద్భక్తి, వైరాగ్యంతో వీరుడనిపించుకొనడమే వీరశబ్దం అర్థం. 12వ శతాబ్దపు ఉత్తారార్ధంలో కన్నడ దేశపు కాలాచురి రాజైన బిజ్జలుని మంత్రి బసవనితో వీరశైవం వ్యాప్తి పొందింది. అంతకు ముందే ఆరాధ్య శైవం వ్యాప్తిలో ఉండేది. వీరశైవం ఆంధ్రదేశంలో ప్రవేశించి రాజుల ఆదరణ పొందింది. కాకతీయ రాజుల కాలంలో వీరశైవం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లిందని చరిత్ర పరిశోధకులు చెబుతారు. కాకతీయ రాజుల కాలంలో అనేక శైవ దేవాలయాలు నిర్మితమయ్యాయి. శైవ పీఠాలు, మఠాలు.. రాజుల సహాయ సహకారాలతో ఏర్పడి ప్రజాదరణ పొందాయి. అట్టడుగు వర్గాలలో వీరశైవం వ్యాప్తి పొందింది. వీరశైవం విజృంభించిన తర్వాత.. కొలనుపాకలో ప్రతి కులానికి ఒక మఠం ఏర్పడింది. వీరశైవులు తమ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అష్టాదశ వర్గాల వారికి శివాలయాలు నిర్మించి ప్రజల మన్ననలు పొందారు.మఠాల ప్రాధాన్యం మఠం అంటే.. మతపరమైన విద్యాబోధన కేంద్రం. విద్యాలయం. సన్యాసులు నివసించే ప్రాంతాలని, దేవాలయాలని అనేక అర్థాలున్నాయి. మఠాలు దేవాలయాలకు అనుబంధంగా ఉంటాయి. దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక జీవనం గడిపే సద్వర్తనులైన ఆచార్యుల నిలయాలు. వీటికి అనుబంధంగా ఉండే మఠాల్లో.. ఆచార్యులు విద్యార్థులకు విద్యాబోధన చేస్తుండేవారు. మఠాచార్యులు అన్ని శాస్త్రాలలో ప్రవీణులుగా ఉండేవారు. పదో శతాబ్దంలో కాలాముఖ శైవాచార్యులు మఠాలను ఏర్పాటు చేసి.. ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ శిష్యులకు విద్యాబోధన చేస్తుండేవారు. ఎందరో రాజులు కాలాముఖ శైవ గురువులను రాజగురువులుగా ఆదరించి పోషించారు. సాంఘికంగా వీరికి చాలా విలువ ఉండేది. వీరు చెప్పిందే వేదం. రాజు నుంచి బంటు వరకు మఠాచార్యుల ఆజ్ఞలను పాటిస్తూ గౌరవిస్తుండేవారు. సంఘాన్ని శాసించే కేంద్ర బిందువుగా మఠాచార్యులుండేవారు. ఈ మఠాలన్నీ 10వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు గొప్ప స్థితిలో ఉన్నాయి. మఠాలన్నీ విద్యా కేంద్రాలుగానే కాకుండా సాంస్కృతిక కేంద్రాలుగా ఉండి.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేయడానికి దోహదపడుతుండేవని పరిశోధకుల అభిప్రాయం. కుల ప్రాతిపదికన.. కొలనుపాకలో కుల ప్రాతిపదికతో ఏర్పడిన 22 మఠాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇన్ని కుల మఠాలు ఒక్క దగ్గర లేవు. ఇది కొలనుపాకకు ఉన్న ప్రత్యేకత. శ్రీశైలంలో 13 మఠాలున్నట్లు సాహిత్య, శాసనాల ద్వారా తెలుస్తోంది. కాలముఖ మఠాలు 2, వీరశైవ మఠాలు 3, గోళకీ మఠాలు 4, ఆరాధ్య మఠాలు 1, ఇతర మఠాలు 3 శ్రీశైలంలో ఉన్నాయి. కానీ కొలనుపాకలో ప్రతి కులానికి ఒక మఠం ఉంది. వీరశైవం బాగా వ్యాప్తి చెందాలంటే ప్రతి కులంలో ఉన్న వ్యక్తులకు శైవదీక్ష ఇప్పించాలి. కులప్రాతిపదికగా మఠాలు ఏర్పాటు చేస్తే.. అది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో కులానికి ఒక మఠం ఏర్పాటు చేశారు.ప్రతి మఠంలో నంది, శివలింగం కొలనుపాకలోని ప్రతి మఠం దాదాపు అలంకారాలు లేకుండా నిర్మితమయ్యాయి. ప్రతి ఆలయంలో శివలింగం, నంది తప్ప వేరే అలంకారాలు లేవు. ప్రతి కులం వారు పండుగ రోజుల్లో.. శివరాత్రి రోజు తమ తమ మఠాలను అలంకరించుకుని పూజలు జరుపుకొంటారు. కొలనుపాకలో 18 కులాల వారికి గురువులున్నారు. మఠాల దగ్గర పండుగ రోజుల్లో ఆయా కుల పురాణాలు పఠిస్తుండేవారు. ఆ జానపద గాయకులను ప్రతి కులం వారు ఆదరించి పోషించారు. ప్రతి కుల పురాణంలో కేంద్ర బిందువు వీర శైవమే. అన్ని కులాలకు తమ కులమే మూలమని ప్రతి కుల పురాణాల ఇతివృత్తాలలో కనిపిస్తుంది. సోమేశ్వరస్వామి ఆలయ సింహద్వారం వద్ద ప్రమాణ మండపం ఉంది. తగాదాలలో ప్రమాణాలు చేయాల్సి వస్తే ఈ మండపం దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తుంటారు. ఈ మండపంలో అబద్ధాల ప్రమాణాలు చేస్తే అరిష్టం కలుగుతుందని ప్రజల విశ్వాసం. కొలనుపాకలోని మఠాలివే.. వైశ్యమఠం, గాండ్ల మఠం, కాపుల మఠం, గొల్ల మఠం, కుర్మ మఠం, గౌండ్ల మఠం, మేర మఠం, పద్మశాలి మఠం, మేదరి మఠం, జాండ్ర మఠం, చాకలి మఠం, మంగలి మఠం, కుమ్మరి మఠం, వడ్డెర మఠం, మహమ్మాయి మఠం, మాల మఠం, మాదిగ మఠం, చిప్ప మఠం, సంగరి మఠం, పెరెక మఠం, శంబరి మఠం, తెనుగు మఠం ఉన్నాయి.చదవండి: ఆలయంలో అబ్బురపరుస్తున్న బామ్మ.. 15 నిమిషాల పాటు 250 కిలోల గంట మోగిస్తూ.. -
కొలనుపాక వెయ్యేళ్ల చరిత
పుణ్య తీర్థం హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది కొలనుపాక. యాదాద్రి దివ్యక్షేత్రం నుంచి 20 కిలోమీటర్ల దూరం! వీరశైవ మతాచార్యులు శ్రీశ్రీ రేణుకాచార్యుల జన్మస్థలంగా ఉన్న కొలనుపాక సోమేశ్వరాలయానికి వేయి సంవత్సరాల ఘనచరిత్ర ఉంది. సోమేశ్వర మహాలింగం నుంచి ఉద్భవించిన ఈ ఆచార్యులు వీరశైవమతాన్ని ప్రపంచానికి బోధించి లింగంలోనే ఐక్యం చెందాడని ప్రతీతి. కొలనుపాక శివారుప్రాంతాల్లో వివిధ సమయాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ శిలాశాసనాలు, దేవతా ప్రతిమల ఆధారంగా ఇక్కడి చరిత్ర మనకు తెలుస్తోంది. దక్షిణ కాశిగా పిలువబడే ఈ గ్రామంలో కాశీలో ఉన్నట్లుగా 18 సామాజిక వర్గాలకు మఠాలు ఉన్నాయి. అలాగే చండీశ్వరీ ఆలయం, కోటిలింగేశ్వరాలయం, భైరవస్వామి ఆలయం, రుద్రమహేశ్వరాలయం, ఏకాదశరుద్రాలయం, మల్లికార్జున స్వామి ఆలయం, క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి ఆలయాలు ఉన్నాయి. వీరశైవ మతగురువైన రేణుకాచార్యులు చండికాంబ సహిత సోమేశ్వరాలయంలోని స్వయంభూ లింగం నుంచి ఉద్భవించి చివరకు అదే లింగంలో ఐక్యం అయినట్లు వీరశైవ కవి షడక్షరుడు రాసిన రాజశేఖర విలాసంలో ఉంది. వీరశైవ మతోద్ధరణ కోసం రేణుకాచార్యులు ఎంతోకృషి చేశారని తెలుస్తోంది. ఈ శైవపీఠానికి సంబంధించిన వివరాల ప్రకారం తానుకేశుడనే శైవాచార్యునికి రుద్రమునీశ్వరుడనే కుమారుడున్నాడు. తానుకేశుని అనంతరం రుద్రమునీశ్వరుని లింగాయతు మతానికి అధిపతిని చేశాడు. ఆయన కొలనుపాక కేంద్రంగా వీరశైవ మతాన్ని స్థాపించి ప్రచారం చేశాడని తెలుస్తోంది. ఘనమైన చరిత్ర కొలనుపాక చండికాంబ సహిత సోమేశ్వరాలయానికి ఘనమైనచరిత్ర ఉంది. 10, 11వ శతాబ్దానికి చెందిన పశ్చిమ చాళుక్యుల కాలం నాటిది. నాటినుంచి నేటివరకు సోమేశ్వరుడు, చండికాంబ దేవతలు నిత్యపూజలు అందుకుంటున్నారు. చాళుక్యుల కాలంలో కొలనుపాక గ్రామం రాజప్రతినిధి స్థానంగా ఉండేదని సమాచారం. సైనికపరంగా దక్షిణాపథంలో కొలనుపాక ముఖ్యకేంద్రంగా ఉండేదట. రాజులు, రాజప్రతినిధులు వివిధస్థాయుల్లో ఆలయ నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేసినట్లు పరిసర ప్రాంతాల్లో దొరికిన శాసనాల్లో నిక్షిప్తమై ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ఉన్న ఈ దేవాలయానికి దేశ, విదేశాల నుంచి భక్తులు రోజు వచ్చి పోతుంటారు. మధ్యయుగానికి ముందు నుంచే ఇక్కడ ఉన్న ఈ ఆలయం ఎంతో విశిçష్టమెనదిగా ఉంది. లింగాకారంలో స్వామి దర్శనం ఇక్కడ స్వామి వారు లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ లింగం నుంచే జగత్గురువు రేణుకాచార్యులు ఉద్భవించి వీరశైవ మతాన్ని, సిద్ధాంతాలను విశ్వవ్యాపితం చేశారు. ఈ ఆలయంలో ఉన్న సహస్ర లింగేశ్వరుని కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సోదరి మైలాంబ ప్రతిష్టించినట్లు ప్రతీతి. ప్రధానాలయంలోనే చండికాంబ అమ్మవారు ఉంటారు. కోరిన కోర్కెలు తీర్చమని అమ్మవారికి భక్తులు ముడుపులు కడతారు. కోర్కెలు తీరిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం పోయడం ఇక్కడ ప్రత్యేకత. పక్కనే కోటొక్కలింగం అత్యంత రమణీయంగా భక్తులకు కనువిందు చేస్తుంది. దేవదేవుని ప్రతిరూపమైన లింగాకారానికి ఖర్జురపు పండ్ల ఆకారంలో చెక్కబడిన చిన్నచిన్న లింగాలన్నిటినీ కలుపుకుంటే కోటొక్కటి ఉంటాయని చెబుతారు. ఈ కోటొక్కలింగాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. చరిత్రను తెలిపే మ్యూజియం ఆలయం ముందు పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ఈ కొలనుపాక ఆలయం, గ్రామ చరిత్రకు సంబంధించిన పలు విశిష్టతలను తెలియజేస్తోంది. కళ్యాణ చాళుక్యులు, కాకతీయ రాజుల ఏలుబడిలో గొప్ప శైవక్షేత్రంగా కొలనుపాక వెలుగొందిన విషయాలను విపులంగా వివరిస్తోంది. వీరశైవ, జైన, వైష్ణవ మతాలకు సంబంధించిన మహోన్నత చరిత్రను మనకు అందిస్తోంది. నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు కొలనుపాక సోమేశ్వరాలయానికి తెలంగాణతో పాటు ప్రతి నిత్యం కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి లింగాయత్లు వస్తారు. తమ ఆరాధ్యదైవం సోమేశ్వరునితోపాటు జగద్గురువు రేణుకాచార్యులను దర్శనం చేసుకుని వెళ్తారు. శివరాత్రి పర్వదినం రోజు వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. దేశ విదేశాల పర్యాటకులు వచ్చిపోతుంటారు. ఎలా రావాలంటే.. హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి పై సరిగ్గా 70 కిలో మీటర్ల వద్ద ఆలేరు ఉంటుంది. ఇక్కడి ఆర్టీసీ బస్లు, రైళ్లు ఉంటాయి. భక్తులు ఆలేరులో దిగిన తర్వాత ఆటోలు, ఆర్టీసీ బస్లలో ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాకకు వెళ్లవచ్చు. ఆలేరు– చేర్యాల మార్గంలో కొలనుపాక ఉంది. – యంబ నర్సింహులు సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా -
తగ్గిన మహాశివరాత్రి ఆదాయం
కె.గంగవరం (రామచంద్రపురం) : గతేడాదితో పోల్చిచూస్తే ఈ ఏడాది మహాశివరాత్రి ఆదాయం సుమారు రూ.85 వేలు తగ్గింది. కోటిపల్లిలోని శ్రీ ఛాయా సోమేశ్వరస్వామి ఆలయంలో గురువారం హుండీలను ప్రత్యేకాధికారి బలుసు రామకృష్ణ పర్యవేక్షణలో లెక్కించారు. హుండీ ద్వారా రూ.3.12 లక్షలు, టికెట్ల ద్వారా రూ.2.70 లక్షలు మొత్తం రూ.5.82 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈఓ కె.రామచంద్రరావు తెలిపారు. గతేడాది టికెట్లు, హుండీల ద్వారా ఆదాయం రూ.6.67 లక్షల ఆదాయం వచ్చింది. గ్రామపెద్ద పప్పుల మసేను వెంకన్న, వెంటూరి వీరరాఘవులు, చిన్న, దేవస్థాన సిబ్బంది మట్టపర్తి శ్రీనివాస్రావు, కూర్మాపురం రామకృష్ణ, పద్దయ్య, సతీష్, ఆలయ అర్చుకులు, పండితులు పాల్గొన్నారు. -
భక్తులతో కిటకిటలాడుతున్న సోమేశ్వరాలయం