breaking news
Slept On The Floor
-
‘పాపం..దొంగ గారు.. ఏసీ చూడగానే ఫ్లాట్!’ కట్ చేస్తే..!
దేశంలోఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి. ఏసీ, ఫ్యాన్లు లేనిదే క్షణం కూడా ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. చోరీకి వచ్చిన ప్రబుద్ధుడు, ఎంచక్కా ఏసి వేసుకొని ఆదమరిచి నిద్ర పోయిన ఘటన, ఫోటో వైరల్గా మారింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లోకి చోరీకి చొరడ్డాడో వ్యక్తి. అసలే పగలూ రాత్రి తేడా లేకుండా మండే ఎండలు పైగా పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అతగాడు, ఏసీ చూడగానే మైమరిచిపోయాడు. ఏసీ ఆన్ చేసుకొని, నేలమీదే ఒక దిండు వేసుకుని హాయిగా గుర్రు కొట్టి నిద్ర పోయాడు. తెల్లవారేక ఇంటి ముందు గేటు తెరిచి ఉండడంతో వారణాసిలో విధులు నిర్వహిస్తున్న సదరు ఇంటి యజమాని డాక్టర్ సునీల్ పాండేకు సమాచారం అందించారు పొరుగువారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి చ్చింది. సంఘటనా చేరుకున్న పోలీసులు కూడా విస్తుపోయారు. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని అలాగే గాఢనిద్రలోకి జారుకున్నాడు. చిత్రం వైరల్గా మారింది. దొంగ తనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి నిద్రపోయాడని డీసీపీ నార్త్ జోన్ ఆర్ విజయ్ శంకర్ తెలిపారు. అతణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. -
నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం
-
నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం
బెంగళూరు: జయలలిత నెచ్చెలిగా శశికళ.. చెన్నైలోని పోయెస్ గార్డెన్లో విలాసవంతమైన జీవితం అనుభవించారు. అమ్మతో సమానంగా చిన్నమ్మ రాజమర్యాదలు అందుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు వంగివంగి దండాలు పెట్టారు. ఇదంతా గతం. ప్రస్తుతం చిన్నమ్మ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రి కావాల్సిన 61 ఏళ్ల చిన్నమ్మ.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అవమానాలు, ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొని బెంగళూరు పరప్పణ అగ్రహార జైలు కోర్టులో లొంగిపోయారు. ఆమెకు ఖైదీ నెంబర్ 9234 కేటాయించారు. మూడున్నరేళ్లు జైలులో చిన్నమ్మ శిక్ష అనుభవించాలి. ఈ శిక్షా కాలంలో ఓ రోజు భారంగా గడిచింది. బుధవారం జైలుకు వెళ్లిన శశికళ.. తొలిరోజు రాత్రి నేలపైనే పడుకున్నారు. జైలు సిబ్బంది ఆమెకు ఓ దుప్పటి, దిండు, ఫ్యాన్, బెడ్ షీట్ ఇచ్చారు. తనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని శశికళ చేసిన విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చింది. ఏసీ, టీవీ, ఇంటి భోజనం, మినరల్ వాటర్, వారానికోసారి నాన్ వెజ్ కావాలన్న కోరికను మన్నించలేదు. దీంతో జైలు సిబ్బంది ఆమెను సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నారు. ఆమెకు ఓ గది కేటాయించారు. ఇదే కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ వదిన ఇలవరసిని కూడా ఇదే గదిలో ఉంచారా లేదా అన్న విషయం తెలియరాలేదు. ఇదిలావుండగా జైలు శిక్ష అనుభవించే కాలంలో శశికళ కొవ్వొత్తులు తయారు చేసే పనిని ఎంచుకున్నారు. క్యాండిల్స్ తయారు చేసినందుకు ఆమెకు రోజుకు 50 రూపాయలు వేతనం ఇవ్వనున్నారు. వచ్చే ఆదివారం నుంచి ఆమెకు జైలు అధికారులు పనిని అప్పగించనున్నారు. తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే.. ‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం లొంగిపోయిన చిన్నమ్మ వీడని ఉత్కంఠ ఇక అమ్మ ఫొటో కనిపించదా పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ ఆచితూచి అడుగులు మద్దతు కాదు కృతజ్ఞతే!