breaking news
Siva Keshav
-
ఆకట్టుకునే కథా కథనాలతో...
శ్రీహరి నటించిన చివరి చిత్రం ‘శివకేశవ్. సీతారామ ఫిలింస్ పతాకంపై బానూరు శ్రావణి-సాయినాథ్ సమర్పణలో బానూరు నాగరాజు (జడ్చర్ల) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్వీ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘శ్రీహరి నటన, ఆయన చేసిన రిస్కీ ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. జయంత్ అద్భుతంగా నటించాడు. దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినా బాగా తెరకెక్కించాడు. శివకేశవ్ ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఆకట్టుకునే కథా కథనాలతో సాగే యాక్షన్ ఎంటన్టైనర్ ఇది’’ అని చెప్పారు. జయంత్, సంజన, శ్వేతాబసుప్రసాద్, గుర్లిన్ చోప్రా తదితరులు నటించిన ఈ చిత్రానికి సహనిర్మాత: బానూరు మాలతి. -
‘శివకేశవ్’ చూసి శ్రీహరి చాలా ఆనందపడ్డారు
‘‘శ్రీహరి లేని లోటు తీర్చలేనిది. ఆయన చేతుల మీదగా జరగాల్సిన వేడుక ఇది. అలాంటిది ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాల్సి రావడం చాలా బాధగా ఉంది’’ అన్నారు బానూరు నాగరాజు (జడ్చర్ల). ఆర్వీ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో శ్రీహరి, జయంత్, గుర్లిన్‌చోప్రా, సంజన కాంబినేషన్లో నాగరాజు నిర్మించిన చిత్రం ‘శివకేశవ్’. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం డబుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘శ్రీహరి నటించిన పోలీస్, సాంబ, భద్రాచలం తదితర చిత్రాల కోవలో ఈ చిత్రం నిలుస్తుంది. ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూసి, ఆయన చాలా ఆనందపడ్డారు. అలాంటి శ్రీహరి హఠాన్మరణం కలచివేస్తోంది. ఆయన సహకారం మరవలేనిది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. శ్రీహరి కాంబినేషన్లో నటించడం మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యిందని జయంత్ తెలిపారు. ఈ వేడుకలో కృష్ణభగవాన్, విజయ్‌కుమార్, వేణు-పాల్, చిన్నం పాండు, సంధ్యాజనక్, మధుమణి తదితర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సముద్ర యూనిట్ సభ్యులకు డబుల్ ప్లాటినమ్ డిస్క్‌లను ప్రదానం చేశారు.