breaking news
single bed room flats
-
1 BHK రూ.70 వేలు! ఇది రెంటా లేక ఈఎంఐనా? పోస్ట్ వైరల్
అత్యంత రద్దీ నగరమైన ముంబై గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖరీదైన ఇక్కడి హౌసింగ్ మార్కెట్ నివాసితులకు ఒక ప్రధాన సవాలుగా కొనసాగుతోంది. పెరుగుతున్న ధరలతో అందుబాటు అద్దెలో ఇళ్లు దొరకడం కష్టంగా మారింది. ఇటీవల విటా అనే ఒక లాయర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో చేసిన పోస్ట్ విపరీతమైన ఖర్చులను ఎత్తిచూపడంతో పాటు ఆన్లైన్లో విస్తృత చర్చకు దారితీసింది.ముంబైలోని ప్రధాన ప్రాంతాల్లో 1 బీహెచ్‌కే అపార్ట్మెంట్ల అద్దె నెలకు రూ.50,000 నుంచి రూ.70,000 వరకు ఉంటోందని విటా తన ట్వీట్లో పేర్కొన్నారు. విడిగా ఉండేందుకు బయటకు వెళ్లకుండా తమ జీవన ఏర్పాట్లను పునఃపరిశీలించుకోవాలని, కుటుంబ సభ్యులతో కలిసి నివసించాలని తోటి యూజర్లకు ఆమె సూచించారు. "ముంబైలో 1 బీహెచ్‌కే అద్దె రూ.50,000-70,000 ఉంటోంది. మీ అమ్మానాన్నలతో మంచి సంబంధాలు పెట్టుకోండి. స్వతంత్రంగా ఉండటానికి ఇంటి నుంచి బయటకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు" అని ఆమె రాసుకొచ్చారు.ఈ ట్వీట్ వెంటనే వైరల్ గా మారి తీవ్ర చర్చకు దారితీసింది. ముంబైలో అధిక జీవన వ్యయం నుంచి పలువురు యూజర్లు తమ సొంత అనుభవాలను పంచుకున్నారు. అప్పుల భారం లేకుండా ఇల్లు, మంచి వైద్యం, నాణ్యమైన విద్య పొందడం చాలా మందికి అసాధ్యమైన కలలా కనిపిస్తోందంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. 'ఇది 70 వేల అద్దె లేదా ఈఎంఐనా?' అని ప్రశ్నిస్తూ మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "నేను ఈ నగరం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాను. ఈ అద్దెను నేను భరించలేను" అంటూ ఇంకొక యూజర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. -
నిరీక్షణకు తెర
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 2014 హౌసింగ్ పథకాన్ని (డీడీఏ) శుక్రవారం ప్రకటించింది. ఈ పథకం కింద ఇరవైఐదువేల మందికిపైగా అర్హులైన దరఖాస్తుదారులకు ఫ్లాట్లను కేటాయించనుంది. అయితే వీటిలో 80 శాతం ఫ్లాట్లను ఢిల్లీవాసుల కేటాయించాలనే ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తోసిపుచ్చారు. దీంతో ఈ ఫ్లాట్లకోసం ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు వీలుకలిగింది. వచ్చే నెల ఒకటో తేదీనుంచి దరఖాస్తు ఫారాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) 2014 శుక్రవారం హౌసింగ్ పథకాన్ని ప్రకటించింది. మొత్తం 25,034 ఫ్లాట్లను ఈ పథకం కింద కేటాయించనుంది. ఈ పథకానికి సంబంధించిన ఫారాలు వచ్చే నెల ఒకటి నుంచి అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత 15 లేదా 20 రోజుల్లోగా డ్రా తీస్తారు. న్యాయమూర్తి సమక్షంలో ఓ స్వతంత్య్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ డ్రా జరుగుతుంది. దీనిద్వారా కేటాయించిన ఫ్లాట్లను వచ్చే ఏడాది మార్చిలోగా కేటాయిస్తారు. ఏడాది లోపల కేటాయించిన ఫ్లాట్ తాళం చెవి ఫ్లాటు యజమానుల చేతికి అందుతుంది. జనరల్ కేటగిరీకి చెందినవారు రూ. లక్ష, ఈడబ్ల్య్యూఎస్ కేటగిరీకి చెందిన వారు రూ. పదివేలను రిజిస్ట్రేషన్ రుసుము కింద చెల్లించాల్సిఉంటుంది. కాగా పథకం కోసం డీడీఏ 13 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. పాన్ కార్డు కలిగిన 18 సంవత్సరాలకు పైబడినవారు ఈ పథకం కింద ఫ్లాట్ పొందేందుకు దరఖాస్తు చే యవచ్చు.ద్వారకా,నరేలా, రోహిణీ వంటి ప్రాంతాల్లో ఉన్న 25,034 వేలకు ఫ్లాట్లను డీడీఏ.. ఈ పథకం ద్వారా కేటాయించనుంది. వీటిలో 22,627 ఫ్లాట్లు సింగిల్ బెడ్ రూము ఫ్లాట్లు. అందులోఓ పడకగది , డ్రాయింగ్ రూం, వంటగది ఉంటాయి. గతంలో ప్రకటించిన స్కీంల కింద కేటాయించినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ సొంతం చేసుకోని 811 ఫ్లాట్లను కూడా ఈ పథకంలో చేర్చారు. ఇవి జసోలా, వసంత్కుంజ్లలో ఉన్నాయి. ఈ పథకంలో భాగంగా 700 ఫ్లాట్లను ఈడబ్యూఎస్ కేటగిరీ కింద కేటాయిస్తారు. వీటిని ప్రయివేట్ డెవలపర్ నిర్మించారు. ఈడబ్ల్యూఎస్ కింద దరఖాస్తు చేసేవారు సంవత్సరానికి రూ. లక్షన్నర ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని చూపవలసిఉంటుంది. ఇవికాక వివిధ కేటగిరీల కింద 896 ఫ్లాట్లను రిజర్వ్ చేశారు. ఈ పథకం కింద కేటాయించే ఫ్లాట్లలో అత్యధికంగా 10,875 రోహిణీ సెక్టర్ 34 ,సెక్టర్- 35లో ఉన్నాయి. నరేలాలో 6,422 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ు ధర రూ.6.6లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉండగా, ఏక పడక గది ఫ్లాట్ ధర రూ. 14.9 లక్షల నుంచి రూ. 22 లక్షల వరకు ఉంది. మోతియాఖాన్ ప్రాంతంలోని కొన్ని ఎంఐజీ ఫ్లాట్ల ధర రూ.1.2 కోట్లవరకు ఉంది. ఈ పథకం కింద కేటాయించిన ఫ్లాట్లను ఐదు సంవత్సరాల తరువాత రిజిస్ట్రేషన్ చేస్తారు. ఫ్లాట్‌ను దక్కించుకున్నవారు వాటినిఐదేళ్ల పాటు అమ్మకుండా చేయడంకోసం డీడీఏ... సంబంధిత ఫ్లాట్ యజమానితో రిజీస్ట్రీ ఒప్పందం చేసుకుంటుంది. ఈ షరతును మొదటిసారిగా డీడీఏ విధించింది. రానున్న 30 సంవత్సరాల పాటు ఫ్లాట్ల నిర్వహణ కోసం రూ.300 కోట్ల నిధిని ఏర్పాటుచేసింది. ఈ పథకం కింద చేర్చిన ఇళ్లన్నీ గ్రీన్ టెక్నాలజీ నిర్మించిన ఫ్లాట్లేనని డీడీఏ చెబుతోంది. ఈ పథకం కోసం డీడీఏ పది లక్షల బ్రోచర్లను ముద్రించింది. ఈ పథకం కింద 80 శాతం ఢిల్లీవాసులకు కేటాయించాలనే ప్రతిపాదనను గురువారం జరిగిన సమావేశంలో లెప్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చారు.