breaking news
Sindhi
-
మాతృభాష నేర్చుకుంటున్నా!
షూటింగ్స్ లేని ఈ లాక్డౌన్ వేళ తన మాతృభాష సింధీ నేర్చుకుంటున్నానని చెబుతున్నారు హీరోయిన్ తమన్నా. ఈ లాక్డౌన్ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే– ‘‘ఎక్కువగా దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నందువల్ల తెలుగు, తమిâ¶ భాషలను బాగానే మాట్లాడగలుగుతున్నాను. హిందీ కూడా వచ్చు. కొన్ని కారణాల వల్ల నా మాతృభాష సింధీపై ఇప్పటివరకు సరైన పట్టు సాధించలేకపోయాను. ఈ లాక్డౌన్ సమయంలో సింధీ భాషను నేర్చుకుంటున్నాను. మా అమ్మగారితో ప్రస్తుతం ఆ భాషలోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. సాంప్రదాయ వంటకాలను నేర్చుకుంటున్నాను. అలాగే మా అమ్మగారి సాయంతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన పెంచుకుంటున్నాను. వృత్తిపరంగా బిజీగా ఉండటం వల్ల నేనెక్కువగా ఇంట్లో ఉండలేదు. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉండటం నాకు కాస్త కొత్తగా ఉంది. మా తమ్ముడు (ఆనంద్) న్యూయార్క్‌లో ఉండిపోయాడు. తను కూడా మాతో ఉండి ఉంటే మరింత బాగుండేదనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు తమన్నా. -
‘నీ’ వల్ల నన్ను సింధీ అనుకున్నారు
ముంబై: అడాగ్ గ్రూప్ అధిపతి అనిల్ అంబానీ చదువుకున్నది ముంబై కిషన్‌చంద్ చెల్లారామ్ (కేసీ) కాలేజీలో. మరి ఆయనకు ఆ సీటెలా వచ్చింది? అక్కడివారు ఆయన్ను సింధీ అనుకోవటం వల్లా? ఏమో!! కావచ్చునంటున్నారు అనిల్ అంబానీ. ‘‘ఆరోజు నాకింకా గుర్తుంది. 1975లో నేను కేసీ కాలేజ్‌లో చేరటానికి వెళ్లా. ఇంటర్వ్యూకు హాజరయ్యా. ఇంటర్వ్యూలో నాతో మాట్లాడిన కుందానానీ, భంబానీ, నిచానీ, కేవల్మ్రణీ... అంతా నాతో సింధీలో మాట్లాడారు. నా పేరు చివర ‘నీ’ ఉంది కనక నన్ను కూడా సింధీ అనుకున్నారు. బహుశా! అందుకే అక్కడ సీటిచ్చారేమో అనిపించింది కూడా’’ అంటూ నాటి పరిస్థితులను శనివారం కాలేజీ వజ్రోత్సవాల సందర్భంగా గుర్తు చేసుకున్నారాయన. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి తల్లి కోకిలాబెన్, భార్య టీనాతో కలిసి అనిల్ హాజరయ్యారు. ఒక భారతీయుడిగా, అందులోనూ ఒక గుజరాతీగా పుట్టినందుకు తాను గర్వపడుతున్నానని చెప్పారు అంబానీ. కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్... విద్య ప్రాముఖ్యాన్ని వివరించారు. మనుషులు అభివృద్ధి సాధించాలన్నా, పేద రికాన్ని తగ్గించాలన్నా అది చదువుతోనే సాధ్యమన్నారు.