నితిన్‌ను అఖిల్ ఇబ్బంది పెడుతున్నాడా?
కెరీర్లో సక్సెస్, ఫ్లాపులు... ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకు వెళుతున్న యంగ్ హీరో నితిన్. సక్సెస్ ట్రాక్‌తో దూసుకు వెళుతున్న అతడు ప్రస్తుతం తాను చేసే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కథ నుంచి కాస్టింగ్ వరకు ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారిన నితిన్ రిస్కీ స్టెప్ తీసుకున్నాడనే చెప్పొచ్చు. అఖిల్, నితిన్‌లు క్లోజ్ ఫ్రెండ్స్ కావటంతో ...అన్నపూర్ణ సొంత బ్యానర్ నుంచి కాకుండా...నితిన్ నిర్మాతగా అఖిల్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు.
అక్కినేని నట వారసడు అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్‌తో ఓ చిత్రాన్ని నితిన్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. శ్రేష్టా మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే అఖిల్ లాంచింగ్ సినిమా కావటంతో నితిన్ అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటున్నాడు. అంతేకాకుండా మరో సినిమా ఒప్పుకోకుండా పూర్తి స్థాయిలో నిర్మాతగా నితిన్ ఇన్వాల్వ్ అయిపోయాడు.
అయితే భారీ సినిమా కావటంతో ప్రొడక్షన్ ఆలస్యంతో నితిన్‌కు హీరోగా మరో సినిమాకు చాలా గ్యాప్ వచ్చేసింది. అందుకే వీలైనంత త్వరగా తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ప్రజెంట్ ఏ స్టార్ హీరో డేట్స్ దొరక్క ఖాళీగా ఉన్న త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలయ్యేలోపే అఖిల్ సినిమాకు సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. మరో నెలరోజుల పాటు నితిన్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ లేదనమాట.