breaking news
Shinkansen
-
భారత్‌కు షింకన్సెన్ రైళ్లు
టోక్యో: భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హైస్పీడ్ రైలు ప్రాజెక్టు ఊపందుకుంటోంది. ట్రయల్ రన్, తనిఖీ తదితర అవసరాల నిమిత్తం రెండు ఐకానిక్ షింకన్సెన్ రైళ్లను భారత్‌కు జపాన్ కానుకగా ఇవ్వనుంది. నిర్మాణంలో ఉన్న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌లో ట్రయల్ రన్ కోసం వాటిని వినియోగించనున్నారు. వీటిలో ఒకటి ఇ5 సిరీస్‌కు, మరోటి ఇ3 సిరీస్‌కు చెందినవి. ఈ రైళ్లను 2026 మొదట్లో భారత్‌కు డెలివరీ చేయనున్నట్లు టోక్యోకు చెందిన ది జపాన్ టైమ్స్ దినపత్రిక తెలిపింది. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం పూర్తయితే దేశంలో తొలి హైస్పీడ్ రైలు మార్గం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు. బుల్లెట్ ట్రైన్‌గా పిలిచే ఈ రైలు వ్యవస్థను భారత రైల్వే అనుబంధ సంస్థ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) అభివృద్ధి చేస్తోంది. ముంబై–అహ్మదాబాద్ మార్గంలో పనులు పూర్తయ్యాక అధిక ఉష్ణోగ్రతలు, ధూళి ప్రభావాలతో సహా డ్రైవింగ్ పరిస్థితులపై డేటాను సేకరించడానికి షింకన్సెన్ రైళ్లను ఉపయోగిస్తారు. అంతకు అవసరమైన తనిఖీ పరికరాలను బిగించిన మీదట జపాన్ వాటిని భారత్‌కు అప్పగించనుంది. హైస్పీడ్ టెక్నాలజీ షింకన్సెన్ జపాన్ హైస్పీడ్ రైల్వే టెక్నాలజీ. ఈ10 అందులో నెక్ట్స్ జనరేషన్ మోడల్. 2030 నాటికి ముంబై–అహ్మదాబాద్ కారిడార్‌లో ఈ అత్యాధునిక ఈ10 మోడల్ షింకన్సెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారత్ యోచిస్తోంది. ‘మేకిన్ ఇండియా’కింద ఈ రైళ్లను భారత్‌లోనే తయారు చేసేందుకు 2016లో నాటి జపాన్ ప్రధాని షింజో అబేతో ప్రధాని నరేంద్ర మోదీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని జపాన్ త్వరలో భారత్‌కు బదిలీ చేస్తుంది. ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆర్ఆర్టిఎస్, వందేభారత్ వంటి దేశీయంగా తయారైన సెమీ హైస్పీడ్ రైళ్లను భారత్ ఉపయోగిస్తోంది. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్‌లో ఈ5 సిరీస్ షింకన్సెన్ రైళ్లను నడపాలని తొలుత భావించింది. కానీ అధిక ఖర్చులు, జాప్యం కారణంగా ఆ ప్రతిపాదనలో ప్రతిష్టంభన ఏర్పడింది. దాన్ని తొలగించడమే గాక భారత్‌కు ఏకంగా అత్యాధునిక ఇ10 సిరీస్ రైళ్లను అందించేందుకు జపాన్ ముందుకొచ్చింది. అదే సమయంలో ఇ5, ఇ3 సిరీస్‌లకు చెందిన ఒక్కో రైలును ట్రయల్స్ తదితర అవసరాల నిమిత్తం పూర్తి ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. మోదీ త్వరలో జరపనున్న జపాన్ పర్యటనలో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదురుతుందని సమాచారం. -
బుల్లెట్ రైలు పక్కన పట్టాలపై కూర్చోండి!
టోక్యో: జపాన్‌కు చెందిన బుల్లెట్ రైలు కంపెనీ షింకన్సేన్ వినూత్నమైన శిక్షణ విధానాన్ని అమలుచేస్తోంది. బుల్లెట్ రైళ్లు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంటే.. అవి వెళుతున్న మార్గంలోని టన్నెల్స్‌లో పట్టాల పక్కన ఉద్యోగుల్ని కూర్చోబెడుతోంది. రైళ్ల నిర్వహణ, భద్రత విభాగంలో పనిచేస్తున్న 190 మంది ఉద్యోగులకు కంపెనీ ప్రస్తుతం ఈ తరహా శిక్షణ ఇస్తోంది. వేగంగా వెళ్లే బుల్లెట్ రైలు పక్కనే తమను కూర్చోబెట్టడంపై పలువురు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా కంపెనీ వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో షింకన్సేన్ సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘మా నిర్వహణ సిబ్బందికి వారి విధుల్లో జాగ్రత్తగా ఉండటం ఎంతో ముఖ్యమో తెలియజెప్పేందుకే ఈ శిక్షణ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం. ఇందులో భాగంగా భద్రతాపరమైన అంశాలకు మేం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ శిక్షణపై కంపెనీ వెనక్కు తగ్గబోదు. 2015లో ఓ ప్రమాదం కారణంగా బుల్లెట్ రైలు బయటిభాగం ఊడిపోవడంతో వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ ఈ శిక్షణను ప్రారంభించింద’ని తెలిపారు. షింకన్సేన్ సంస్థ తయారుచేసిన రైళ్ల కారణంగా గత 50 ఏళ్లలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. ప్రస్తుతం భారత్‌లోని ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును ఈ కంపెనీయే చేపడుతోంది. -
జపాన్‌లో బుల్లెట్ ట్రయిన్‌కు ప్రమాదం!
టోక్యో : భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బుల్లెట్ ట్రయిన్ సురక్షితం కాదనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు ఆధారం చేకూరేలా జపాన్ రాజధాని టోక్యోలని షింకాన్షెన్ బుల్లెట్ ట్రయిన్లో పొగలు, మంటలు వచ్చాయి. ఈ షింకాన్షెన్ బుల్లెట్ ట్రయిన్ సంస్థే.. భారత్‌లోనూ బుల్లెట్ ట్రయిన్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఆ సంస్థకు చెందిన రైలే భవిష్యత్‌లో భారత్‌లో పరుగులు తీయనుంది. వివరాల్లోకి వెళితే...బుల్లెట్ ట్రయిన్ విభాగంలో అత్యంత శక్తివంతమైన షింకాన్షెన్ బుల్లెట్ ట్రయిన్ కు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. పట్టాలు బీటలు వారడంతో.. రైల్లో మంటలు, పొగలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో ప్రాణహాని లేకపోయినా.. బుల్లెట్ ట్రయిన్ వ్యవస్థలో ఇదో భారీ ప్రమాదంగా నిపుణులు చెబుతున్నారు. అత్యంత వేగంగా దూసుకుళ్లే ఈ రైలులో బుధవారం దక్షిణ జపాన్‌లోని నాగయ స్టేషన్ వద్ద పొగలు రావడం, అలాగే విచిత్రంగా వస్తున్న శబ్దాలు రావడాన్ని అధికారులు గుర్తించారు. ఆ వెంటనే రైలును పూర్తిగా నిలిపేశారు. రైలును పూర్తిగా పరిశీలించిన అధికారులు చాసిస్ కింద ఆయిల్ లీక్ అవడం వల్ల పొగలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఈ ట్రయిన్ అలాగే మరికొంత దూరం ప్రయాణించి ఉంటే.. పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండేవని అధికారులు చెబుతున్నారు. రైల్లోని వెయ్యి మంది ప్రయాణికులును మరో బుల్లెట్ ట్రైన్లో తరలించారు. ఈ ఘటనపై షింకాన్షెన్ అధికారులు మాట్లాడుతూ.. ఇది అసాధారణ సమస్య అని చెప్పారు. దీని గురించి మేం సీరియస్‌గానే చర్చిస్తున్నట్లు వారు తెలిపారు. -
‘బుల్లెట్’ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో తొలిసారి బుల్లెట్ రైలు ప్రతిపాదన వచ్చింది. అప్పటినుంచీ మన బుల్లెట్ ట్రైన్ ఎలా ఉంటుంది? అన్న సందేహాలు అందరిలో రేకెత్తాయి. తాజాగా అహ్మదాబాద్‌లో తొలిబుల్లెట్ ట్రైన్‌కు ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబెతో కలిసి గురువారం శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం తరువాత బుల్లెట్ రైలు ఎలా ఉండబోతోంది? అందులో ఎటువంటి సదుపాయాలు ఉంటాయి? ఎటువంటి కోచ్‌లో ఉంటాయి? ఎగ్జిక్యూటివ్? నాన్ ఎగ్జిక్యూటివ్? ఎకానమీ క్లాస్ తరగతులు విమానంలో మాదిరిగా ఉంటాయా? వంటి సందేహాలు మరింత ఎక్కువయ్యాయి. ఆ సందేహాలను తొలగిస్తూ.. బుల్లెట్ రైలు గురించిన ఫీచర్స్ సాక్షి మీకందిస్తోంది. ఇదీ మన బుల్లెట్ ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే బుల్లెట్ ట్రైన్ జపాన్‌కు చెందిన షిన్కాన్సెన్ ఈ5 సిరీస్‌కు చెందినది. జపాన్‌లో ప్రస్తుతం షిన్కాన్సెన్ ఈ5 సిరీస్ హై స్పీడ్ ట్రయిన్స్ నడుస్తున్నాయి. వీటిలో సాధారణంగా ఎకానమీ (మధ్యతరగతి), గ్రీన్ కార్ (ఎగ్జిక్యూటివ్ క్లాస్), గ్రాన్ కార్ (ఫస్ట్‌క్లాస్) తరగతులు ఉన్నాయి. వీటిలో ఇండియన్ రైల్వేస్ ఎకానమీ, ఎగ్జిక్యూటివ్ కార్ కోచ్‌లను ఎంపిక చేసుకుంది. సీటింగ్ సాధారణంగా షిన్కాన్సెన్ ఈ5 హై స్పీడ్ ట్రైన్లో 3+2 సీటింగ్ ఉంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో 2+2 సీటింగ్ ఉంటుంది. టిఫిన్, భోజనం చేయడానికి ఎగ్జిక్యూటివ్ క్లాస్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. విమానంలో ఇంటీరియర్ ఎలా ఉంటుందో.. ఇందులోనూ అలాగే ఉంటుంది. బేబీ టాయిలెట్స్, బాలింతలు చిన్నారులకు పాలు పట్టేందుకు ప్రత్యేక గది ఉంటుంది.