breaking news
Seven-year old child
-
వార్త రాస్తే అంతుచూస్తా
►అన్యాయంపై నిలదీస్తే అంతు చూస్తానన్నాడు ►ఏడేళ్ల చిన్నారిపై యువకుని లైంగిక దాడి ►సెటిల్మెంట్కు టీడీపీ, సీపీఎం నేతల ఒత్తిళ్లు ►వార్త రాస్తే అంతుచూస్తానన్న సీపీఎం నేత అన్యాయం జరిగితే అడ్డుకోవాలి. బాధితులకు అండగా నిలవాలి. న్యాయ పోరాటం చేసి స్వాంతన చేకూర్చాలి. ఏ ప్రజాప్రతినిధులైనా చేయాల్సిందిదే. కానీ అభంశుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యం జరిగితే.. న్యాయం చేయాల్సిన నేతలు సెటిల్మెంట్కు ప్రయత్నిస్తుంటే.. అదేమని నిలదీస్తే అంతుచూస్తామని బెదిరిస్తుం టే.. ఎవరికి చెప్పుకోవాలి?.. పార్వతీపురం పట్టణంలో అభంశుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. కొంతకాలంగా సాగుతున్న ఓ యువకుడి పైశాచిక ప్రవృత్తి వెలుగు చూసింది. న్యాయం చేయమని కోరిన ఆమె తల్లిదండ్రులపై నేతల ఒత్తిడి పెరుగుతోంది. ఆ నేతల్లో ఒకరు టీడీపీకి, మరొకరు సీపీఎంకు చెందినవారు. చిన్నారి తల్లి ఆదివారం విలేకరులకు అందించిన వివరాలివి. పార్వతీపురం: వివేకానంద కాలనీ దేశ మ్మ తల్లి వీధిలో నివసిస్తున్న అంకుల నాగేశ్వరరావు దంపతులు పాతబస్టాండ్‌లో అద్దాలు, తాళం కప్పలు, పూసల దండలు అమ్ముకుని బతుకుతుంటారు. వారికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె నెలల వయసు కావడంతో ఆమెను చూసుకొనేందుకు పెద్ద కుమార్తె (7)ను ఇంటి వద్ద ఉంచి రోజూ వ్యాపారానికి వెళ్తుంటారు. గురువారం కూడా వెళ్లి రాత్రి 8గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. పక్క వీధికి చెందిన రాజేష్ ఎదురుగా ఉన్న ఓ ఇంటి పెరట్లోకి చిన్నారిని తీసుకెళ్లి లైం గిక దాడి చేసినట్టు మరో బాలిక ద్వారా తెలుసుకున్నారు. చంపేస్తానని బెదిరించి.. రాజేష్ కొంతకాలంగా చిన్నారికి చాక్లెట్లు ఎరచూపి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అమ్మేస్తానని లేదా చంపేస్తానని బెదిరించేవాడు. ఇది తెలిసిన నాగేశ్వరరావు దంపతులు రాజేష్ ఇంటికెళ్లి అతని తల్లిదండ్రులకు విషయం చెప్పారు. అదేరోజు రాత్రి 11గంటల ప్రాంతంలో వారి బంధువు మున్నా తప్ప తాగి, కత్తి పట్టుకొని అసభ్య పదజాలంతో నాగేశ్వరరావు ఇంటిపైకి దాడికి వచ్చాడు. వెంటనే దంపతులిద్దరూ పట్టణ పోలీసుస్టేషన్‌కు వెళ్లి చెప్పినా ఫలితం లేకపోయింది. వార్డుకు చెందిన ఇద్దరు టీడీపీ, సీపీఎం నేతలు, మరో మహిళా సంఘం సభ్యురాలు సెటిల్మెంట్ కోసం శనివారం రాత్రి చిన్నారి కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చారు. సీపీఎం నేత దౌర్జన్యం బాధితురాలి కుటుంబ సభ్యులతో ఆదివారం విలేకరులు మాట్లాడుతుండగా సమీపంలోనే ఉన్న ఓ మహిళా సంఘం సభ్యురాలు మండిపడింది. వార్త రాయొద్దని విలేకరులను హెచ్చరించింది. మరోవైపు ఆ వీధికి చెందిన సీపీఎం నేత కూడా చిందులు వేశాడు. విలేకరుల అంతు తేలుస్తానన్నాడు. విలేకరుల ఫిర్యాదుపై సంఘటన స్థలానికి వచ్చిన ఎస్ఐ బి.సురేంద్రనాయుడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని బాధితురాలి తల్లికి సూచించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్ఐ తన సిబ్బందితో ఆదివారం మధ్యాహ్నం సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పరారీలో రాజేష్ నిందితుడు రాజేష్‌ను అతని తల్లిదండ్రులు, పెద్దలు వేరే ఊరికి పంపించినట్టు బాధితురాలి తల్లి ఆరోపించింది. తమ కుమార్తె ఫంక్షన్‌కు సంబంధించి కార్డులు పంచేం దుకు వెళ్లాడని నిందితుని తల్లిదండ్రులు విలేకరులకు తెలిపారు. -
మానవ మృగం
ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం నామవరంలో ఘటన పోలీసులకు బంధువుల ఫిర్యాదు అదుపులో నిందితుడు పాయకరావుపేట: కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక వ్యక్తి తన కూతురు వయసున్న ముక్కుపచ్చలారని ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని ఆ చిన్నారి అతని వికృతచేష్టలకు భయపడి కేకలు వేయడంతో ఉడాయించాడు. పాయకరావుపేట మండలం నామవరం గ్రామంలో మంగళవారం రాత్రి జాతీయరహదారి పక్కనే ఈ సంఘటన జరిగింది. బాలిక బంధువులు పోలీసులకిచ్చిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మమ్మ, మేనమామ సంరక్షణలో ఉంటోంది. రాత్రి ఏడు గంటల సమయంలో జాతీయ రహదారి పక్కన ఉన్న కిరాణాషాపుకు పంపించారు. చిన్నారి చీకట్లో ఒంటరిగా రావడాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన కోన రమణ అనే వ్యక్తి మాటువేసి చిన్నారికి మాయమాటలు చెప్పి జాతీయరహదారిని ఆనుకుని మంచినీటి చెరువుగ ట్టుపై ఉన్న మాంసం విక్రయించే పాకలోకి తీసుకెళ్లాడు. దుస్తులు తొలగించి వికృత చేష్టలకు పాల్పడడంతో ఏం జరుగుతుందో తెలియని చిన్నారి కేకలు వేసింది. అదే సమయంలో బాలి కను వెతుక్కుంటూ వచ్చిన అమ్మమ్మ, పిన్ని కేకలు విని అనుమానం వచ్చి పాకవైపు వెళ్లగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బంధువులు స్థానికుల సహాయంతో రమణను పట్టుకుని 100 ఫోన్ నెంబరు ద్వారా పోలీసులకు సమాచారం చేరవేశారు. పాయకరావుపేట పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన నిందితునిపై నిర్భయ చట్టప్రకారం కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని బాధితురాలి మేనమామ స్వామి బుధవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. కోన రమణపై అత్యాచారయత్నం కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ కుమార్ తెలిపారు. నిందితుడికి వివాహం అయింది. బాధితురాలి వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. గతంలోనూ ఇలాగే; రమణ గతంలో కూడా నక్కపల్లి మండలం సీతంపాలెం గ్రామంలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి యత్నించగా, స్థానికులు చూసి దేహశుద్ధి చేసి విడిచిపెట్టినట్టు తెలిసింది. అప్పట్లోనే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదని గ్రామస్తులు చెప్పారు. ఫిర్యాదు స్వీకరణలో జాప్యం : కంట్రోలు రూం ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు మంగళవారం రాత్రే నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ బుధవారం ఉదయం ఫిర్యాదు స్వీకరణలో పోలీసులు జాప్యం చేశారని బంధువులు ఆరోపించారు. ఉదయం పది గంటల సమయంలో బాధితురాలి మేనమామ స్వామి బంధువులతో కలిసి ఫిర్యాదు ఇచ్చేందుకు స్టేషన్‌కు వెళ్లారు. తాము నిరక్ష్యరాస్యులం కావడంతో వేరొకరితో రాయించి స్టేషన్లో ఇవ్వడానికి వెళ్తే ఫిర్యాదు రాసిన వ్యక్తినే తీసుకురావాలంటూ జాప్యం చేసి ఇబ్బందులు పెట్టినట్లు వాపోయారు.