breaking news
saniya mirza
-
వైరల్ వీడియో : ఇదీ జీవితమంటే
ప్రాణాంతక కరోనా వైరస్ నియంత్రణకు ప్రపంచ దేశాలు లాక్డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. దీంతో చాలామంది వేరువేర్వు ప్రాంతాల్లో, దేశాల్లో చిక్కుకుపోయారు. నెలల తరబడి కుటుంబ సభ్యులను దూరంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులు సుమారు రెండు నెలల తరువాత ఒకరినొకరు కలుసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా అనుకోకుండా ఎడబాటుకు దూరమైన ఈ దంపతులు ఆదివారం సొంత గూటికి చేరుకున్నారు. దీంతో ఆ వృద్ధ జంట ఆనందానికి అంతేలేకుండా పోయింది. రెండు నెలల తరువాత కలుసుకోవడంలో ముద్దుపెట్టుకుని ఒకరినొకరు తనవితీరా హత్తుకుని సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ ట్విటర్ వేదికగా స్పందించారు. ఇదీ జీవితమంటే అంటూ ఆ జంటపై ప్రశంసలు కురిపించారు. ఇక ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం ఆ జంట ప్రేమకు ఫిదా అయ్యారు. ఇంటర్నెట్లో నేను చూసిన అత్యుత్తమ వీడియో ఇదే అంటూ కామెంట్ చేశారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
♦ సానియామీర్జాకు రూ. కోటి ఇచ్చారు.. ♦ దళిత యువతికి అన్యాయం జరిగితే ఇవ్వరా ♦ మాజీ మంత్రులు గీతారెడ్డి, సబిత, సునీత వీణవంక : రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, స్వేచ్ఛ గా ఉండలేని పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి గీతారెడ్డి ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో ఇటీవల గ్యాంగ్‌రేప్‌కు గురైన బాధితురాలిని మాజీ మంత్రులు సబితారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారదలతో కలసి బుధవారం పరామర్శించారు. ఎస్ఐని, కానిస్టేబుల్‌ను మాత్రమే సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నాన్నారు. విచారణ పేరుతో బాధితురాలిని వేధించిన సీఐని, డీఎస్పీని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. జిల్లాకు మహిళా కలెక్టర్ ఉండి కూడా ఇంతవరకు బాధితురాలిని పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం యువతికి పోలీసు ఉద్యోగం, ఐదెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇల్లు, కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియూ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సబితారెడ్డి మాట్లాడుతూ సానియామీర్జాను పిలిచి కోటి రూపాయలు ఇచ్చిన సీఎం... దళిత బిడ్డకు అన్యాయం జరిగితే ఇవ్వలేరా అని అన్నారు. సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుం బానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.