Sangeeta Chowdhury
-
'నాతో సెల్ఫీ తీసుకోండి'
లక్నో: తనతో నిరభ్యంతరంగా సెల్ఫీ తీసుకోవచ్చని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. సమాజ్ వాదీ పార్టీ అత్యంత ఉదారవాద పార్టీ అని పేర్కొన్నారు. తనతో దిగిన ఫోటోను ఫేస్ బుక్ లో పెట్టినందుకు ఓ మహిళా నేతకు బీఎస్పీ అధినేత్రి మాయావతి టిక్కెట్ రద్దు చేసిన నేపథ్యంలో అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'మీకు తెలుసా.. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినందుకు ఓ నాయకురాలు టికెట్ కోల్పోయింది. కానీ సమాజ్ వాది పార్టీలో అలాంటివి జరగవు. నిరభ్యంతరంగా మీరు నాతో సెల్ఫీ తీసుకోవచ్చు' అని పార్టీ కార్యకర్తలతో అఖిలేశ్ అన్నారు. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో సంగీత చౌదరి అనే నాయకురాలికి 2017 ఎన్నికల కోసం ఇచ్చిన టిక్కెట్ ను మాయావతి బుధవారం రద్దు చేశారు. తన నలుగురు పిల్లలతో కలిసి మాయావతికి పాదాభివందనం చేసిన ఫొటోను సంగీత తన ఫేస్ బుక్ పేజీలో పెట్టడంతో ఆమెపై ఈ చర్య తీసుకున్నారు. అయితే మాయావతికి సంగీత క్షమాపణ చెప్పారు. ఆట్రౌలీ నియోజకవర్గం నుంచి ముందుగా సంగీత భర్త ధర్మేంద్ర చౌదరికి టిక్కెట్ ఇచ్చారు. ఆయన గతేడాది జనవరిలో హత్యకు గురవడంతో సంగీతకు టిక్కెట్ కేటాయించారు. -
ఆ ఫొటోలు ఫేస్బుక్లో పెట్టిందని..
ఉత్తరప్రదేశ్: ఫేస్బుక్ లో తనకు ఇబ్బందులు కలిగించేలా ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసిన అభ్యర్థి టికెట్‌ను బీఎస్పీ అధినేత్రి మాయావతి రద్దు చేసింది. క్రమశిక్షణ పేరిట ఆమె ఈ చర్యలను తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అట్రౌలీ నియోజకవర్గంలో సంగీతా చౌదరీ అనే మహిళకు సీటు ఇచ్చి బరిలోకి దించాలని పార్టీ వర్గాలు భావించాయి. ఎందుకంటే ఇదే స్థానం నుంచి గతంలో సంగీత భర్త ధర్మేంద్ర చౌదరీ పోటీ చేశాడు. కానీ, అతడు గత ఏడాది జనవరి నెలలో హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని ఆయన భార్య సంగీతతో భర్తీ చేయాలని మాయావతి భావించారు. ఈలోగా, తన కాళ్లను పట్టుకుంటూ సంగీత, ఆమె పిల్లలు దండం పెడుతున్న ఫొటోను ఫేస్ బుక్ లో సంగీత పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. మాయావతిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో సంగీతకు ఇక ఆ సీటు ఇవ్వకూడదని నిర్ణయించి రద్దు చేశారు. అయితే, తాను కావాలని ఆ ఫొటోను పెట్టలేదని, ఆమె తనతో ఉన్నట్లుగా కనిపిస్తే విజయం వరిస్తుందని చెప్పే ఉద్దేశంతోనే ఆ ఫొటో ఫేస్ బుక్ లో పెట్టానని సంగీత చెప్పుకొచ్చారు.