breaking news
samuel badree
-
WI vs SA: దక్షిణాఫ్రికాతో వైట్‌బాల్ సిరీస్.. క్రికెట్ వెస్టిండీస్ కీలక నిర్ణయం!
దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు క్రికెట్ వెస్టిండీస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ మాజీ లెగ్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీని వారి కొత్త అసిస్టెంట్ కోచ్‌గా క్రికెట్ వెస్టిండీస్ నియమించింది. అయితే బద్రీ కేవలం దక్షిణాఫ్రికాతో జరిగే వైట్-బాల్ సిరీస్‌లో మాత్రమే తన సేవలందిస్తాడు. ప్రోటీస్ పర్యటన అనంతరం పూర్తి స్థాయి అసిస్టెంట్ కోచ్‌ను క్రికెట్ విండీస్ నియమించనుంది. కాగా బద్రీ గతంలో వెస్టిండీస్ స్పిన్-బౌలింగ్ సలహాదారుగా కూడా పనిచేశాడు. అదే విధంగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేసిన అనుభవం కూడా బద్రీకి ఉంది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా విండీస్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల వైట్‌బాల్ సిరీస్‌లో తలపడనుంది. ఇప్పటికే ప్రోటీస్ చేతిలో తొలి టెస్టులో ఓటమి చవిచూసిన విండీస్.. ఇప్పుడు రెండో టెస్టులో తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమైంది. విండీస్-ప్రోటీస్ మధ్య రెండో టెస్టు మార్చి8 నుంచి ప్రారంభమైంది. అదే విధంగా ఈస్ట్ లండన్ వేదికగా మార్చి 16న జరగనున్న తొలి వన్డేతో విండీస్ వైట్‌బాల్ టూర్ ప్రారంభం కానుంది. మరోవైపు ఈ సిరీస్‌ల నుంచే విండీస్ వన్డే, టీ20 కెప్టెన్లుగా షాయ్ హోప్,రోవ్‌మన్ పావెల్ తమ ప్రయాణాన్ని మొదలపెట్టనున్నారు. చదవండి: IND vs AUS: భారత్‌తో నాలుగో టెస్టు.. స్టీవ్ స్మిత్ కీలక నిర్ణయం! స్టార్ ఆటగాడికి నో ఛాన్స్ -
ఐపీఎల్-10లో తొలి హ్యాట్రిక్
-
ఐపీఎల్-10లో తొలి హ్యాట్రిక్
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. రాయల్ చాలెంజర్స్ బౌలర్ శామ్యూల్స్ బద్రీ హ్యాట్రిక్ వికెట్లు సాధించి సరికొత్త రికార్డు సాధించాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో బద్రీ ఈ ఘనత నమోదు చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ రెండో బంతికి పార్థీవ్ పటేల్(3) అవుట్ చేసిన బద్రీ.. ఆ తరువాత బంతికి మెక్లీన్ గన్ ను డకౌట్ చేశాడు. ఆ మరుసటి బంతికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ గా పంపిన బద్రీ హ్యాట్రిక్ సాధించాడు. బద్రీ దెబ్బకు ముంబై ఇండియన్స్ ఏడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆర్సీబీ విసిరిన 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ ఆదిలోనే తడబడి కీలక వికెట్లను చేజార్చుకుంది. ఈ హ్యాట్రిక్ కు ముందు జాస్ బట్లర్(2) ను స్టువర్ట్ బిన్నీ అవుట్ చేశాడు.