breaking news
saluru mla
-
'నాకేదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత'
విజయనగరం : భద్రతా సిబ్బంది తగ్గింపుపై విజయనగరం జిల్లా సాలూరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పి.రాజన్నదొర ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బందిని తగ్గించటం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. గిరిజన ఎమ్మెల్యే అయినందువల్లే తనపై చిన్నచూపు చూస్తోందని రాజన్న దొర వ్యాఖ్యానించారు. జన్మభూమి కార్యక్రమంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో పాల్గొంటున్న తనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నలుగురు గన్మెన్లను నియమిస్తున్న ప్రభుత్వం తనపై మాత్రం పూర్తి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని రాజన్న దొర ఆరోపించారు. కాగా రాజన్న దొరకు ప్రభుత్వం భద్రత కుదించింది. గతంలో నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్న ఆయనకు ప్రస్తుతం ఏ ఒక్కరినీ ఇవ్వలేదు. -
వైఎస్సార్సీపీలోకి రాజన్నదొర
* ‘సమైక్యం’ కోసమే చేరుతున్నానన్న సాలూరు ఎమ్మెల్యే సాక్షి, హైదరాబాద్: విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత రాజన్నదొర ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజన్నదొరతో పాటు ఆయన అనుచరులకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ.. తెలుగుజాతి ముక్కలు కాకుండా ఉంచేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలకు అండగా ఉండాలని భావించి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజలందరూ కలసి మెలసి జీవించారని, ఆయన మరణానంతరం పాలకుల వైఖరి కారణంగా ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సమైక్యం కోసం కృషి చేస్తోందని, జగన్ కూడా జాతీయస్థాయిలో మద్దతు కూడగడుతున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో సాలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ జర్జాపు ఈశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జి, మేడిశెట్టి అప్పలనాయుడు, కె.సత్యం, సూర్యనారాయణతో పాటు ఇద్దరు మాజీ ఎంపీపీలు, 30 మంది సర్పంచ్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సుజయకృష్ణ రంగారావు, కొత్తపల్లి గీత ఉన్నారు.