breaking news
salaries Nil
-
ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ప్చ్.. జీతాలే..
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగాలు పెరుగుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా జీతాలు మాత్రం పెరగడం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మానీ వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ఇందుకు నైపుణ్యాల కొరతే ప్రధాన కారణమని తెలిపారు. అత్యధిక జనాభాను భారత్ ప్రయోజనకరమైన అంశంగా మల్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం బోధన, శిక్షణను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం వర్కర్లు–జనాభా నిష్పత్తి గత ఏడేళ్లుగా పెరుగుతోంది. అంటే జనాభా వృద్ధికి మించి ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఉద్యోగాలు పెరగడం లేదనడం తప్పు. క్యాజువల్ వర్కర్ల వాస్తవ వేతనాలూ పెరిగాయని, వారి పరిస్థితులూ మెరుగుపడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి. కానీ రెగ్యులర్ జీతాల ఉద్యోగాలే పెద్ద సమస్యగా ఉంటోంది. ఈ కేటగిరీలో ఏడేళ్లుగా ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా వాస్తవ వేతనాలు పెరగలేదు‘ అని విర్మానీ చెప్పారు. మిగతా దేశాల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తోందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఫోకస్ చేయాలి.. కేంద్ర ప్రభుత్వం దీనిపై తగు చర్యలు తీసుకుంటోందని, రాష్ట్రాలు కూడా ఈ దిశగా కసరత్తు చేయాలని చెప్పారు. ఉద్యోగాల కల్పన జిల్లా స్థాయిలో జరుగుతుంది కాబట్టి అక్కడ దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే పని చేస్తున్న వారికే కాకుండా కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారికి కూడా నైపుణ్యాలు అవసరమేనని విర్మానీ చెప్పారు. ‘ఉద్యోగం, నైపుణ్యాలనేవి ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. నైపుణ్యాలుంటే ఉద్యోగం దక్కించుకోవడం సులభమవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మనం అన్ని అంశాల్లోనూ మెరుగుపడాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి‘ అని వివరించారు. -
జీతాలకు నోచని నాణ్యతా సిబ్బంది!
రాష్ట్ర వ్యాప్తంగా 8 నెలలుగా జీతాలు నిల్ జిల్లాలో మూడు నెలలుగా పస్తులు మంత్రి, జిల్లా యంత్రాంగానికి విన్నవించినా ప్రయోజనం శూన్యం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గ్రామీణ నీటి సరఫరా విభాగంలో నీటి నాణ్యతా పరిశీలన సిబ్బంది జీతాల్లేక విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు వ్యక్తిగత బోర్ల నీటి శాంపిళ్లను పరిశీలించాల్సిన సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆందోళన చెందతున్నారు. వాటర్ ఎనలిస్ట్స్, మైక్రో బయాలజిస్ట్లు, లాబ్ అసిస్టెంట్లు, హెల్పెర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కన్సల్టెంట్లగా ప్రభుత్వం థర్డ్ పార్టీ ఔట్సోర్సింగ్ విభాగాల ద్వారా సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగిస్తోంది. వాస్తవానికి 2009 నుంచీ వీళ్లందర్నీ శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2013లో మరో క మిటీ వేసింది. అయినప్పటికీ చాలీ చాలని జీతాలతోనే తాము కుటుంబాల్ని నెట్టుకువస్తున్నా మని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. ఇదీ పరిస్థితి రాష్ర్ట వ్యాప్తంగా గ్రామీణ నీటి సరఫరా విభాగంలో మొత్తం 497 మంది సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండగా శ్రీకాకుళం జిల్లాలో 39 మంది ఉన్నారు. వీరందరికీ 8 నెలల నుంచీ జీతాల్లేవు. సిబ్బంది గగ్గోలు పెడుతుండడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయాల ద్వారా ఐదు నెలల వరకూ జీతాలు చెల్లించేసినా మూడు నెలల నుంచీ ఈ విషయమై పట్టించుకోవడం లేదు. జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యను అధికార యంత్రాంగం సహా రాజకీయ నేతలు తీసుకెళ్లనీయకుండా చేసిందన్న విమర్శలున్నాయి. అదే విషయమై హైదరాబాద్లో ఉన్న చీఫ్ ఇంజినీర్ (గతంలో ఇంజినీర్ ఇన్ చీఫ్) సహా మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 ల్యాబ్లుండగా జిల్లాలో ఎనిమిది మంచినీటి శుద్ధి నాణ్యతా ల్యాబులున్నాయి. 19 డివిజన్లలో, 73 సబ్ డివిజన్ల పరిధిలో 13 జిల్లా స్థాయి ల్యాబ్లున్నా ఇందులో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాస్తవానికి వీరి జీతాలు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే సంబంధింత జిల్లా సూపరింటెండెంట్ అధికారి ద్వారా చెల్లిస్తారు. ‘స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్’ (ఎస్ఎస్ఆర్) ద్వారా రూ.9 వేల నుంచి రూ.20 వేల (స్థాయిని బట్టి) వరకు చెల్లిస్తున్నారు. అదీ కొంతమందికి నిబంధనలకు అనుగుణంగా కూడా చెల్లించడం లేదనే ఆరోపణలున్నాయి. పెండింగ్ వేతనాలకు సంబంధించి గత ఫిబ్రవరిలో కమిటీ వేసి నెల వ్యవధిలో నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఫలితం లేకపోయిందని సిబ్బంది చెబుతున్నారు.