గర్ల్‌ఫ్రెండ్‌తో వెళితే తప్పేంటి?
కోహ్లికి సైఫ్ అలీ ఖాన్ మద్దతు
ముంబై: ‘భార్య లేదా గర్ల్‌ఫ్రెండ్ పక్కన ఉంటే సరిగా ఆడలేరు అనడం మూర్ఖత్వం. మ్యాచ్‌కు ముందు సెక్స్‌లో పాల్గొంటే మైదానంలో సరిగా ఆడలేరా? ఇది పూర్తిగా తప్పు. గర్ల్‌ఫ్రెండ్‌తో కోహ్లి ఇంగ్లండ్ వెళ్లడంలో అభ్యంతరం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అసలు ఆటగాళ్ల వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించకూడదు. సుదీర్ఘ పర్యటనలకు ‘తోడు’ లేకుండా వెళ్లాలనడం కరెక్ట్ కాదు’.... బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్య ఇది. మన దగ్గర క్రికెట్ గురించి ఓ బాలీవుడ్ నటుడు స్పందించడం సహజం. అందులో సైఫ్ అలీ ఖాన్ భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌ల గురించి మాట్లాడొచ్చు.
ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్ విజేతకు ట్రోఫీని అతని తండ్రి పటౌడీ పేరిటే ఇస్తారు. నిజానికి టెస్టు సిరీస్ చివరన జరిగే బహుమతి ప్రదానోత్సవానికి సైఫ్‌ఖాన్ వెళ్లాల్సింది. ఒకవేళ ఆఖరి టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ముగుస్తుందేమో అనే అనుమానంతో దానికి తగ్గట్లుగా సైఫ్‌ఖాన్ లండన్ వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. ‘భారత జట్టు ఇలా దారుణంగా ఓడిపోవడం గతంలో చాలాసార్లు జరిగింది. నా తండ్రి పేరిట ఇచ్చే ట్రోఫీ ప్రదానానికి వెళ్లలేకపోవడం నిరాశ కలిగించింది. అయితే ఆటలో గెలుపోటములు సహజం. భారత జట్టును ఇంత తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం లేదు’ అని సైఫ్ అన్నాడు.