ఘోర ప్రమాదం నుంచి కోలుకొని... ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ
స్కార్పెరియా ఇ శాన్ పియరో (ఇటలీ): సుమారు ఐదేళ్ల క్రితం ఫార్ములా వన్ ట్రాక్‌పై ఘోర ప్రమాదం నుంచి బయటపడిన ఫ్రెంచ్ డ్రైవర్ రొమైన్ గ్రోజన్... తిరిగి స్టీరింగ్ చేతపట్టనున్నాడు. 2020 సీజన్ బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో అతడి కారు ఘోర ప్రమాదానికి గురైంది. వాయు వేగంతో దూసుకెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో గ్రొజాన్ కారు రెండు ముక్కలవగా... పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.నమ్మశక్యంగా లేదుఅందులో చిక్కుకున్న గ్రొజాన్... కాలిన గాయాలతో బయటపడ్డాడు. చికిత్స అనంతరం కోలుకున్న అతడు ఇక అప్పటి నుంచి ఎఫ్1 రేసులకు దూరంగా ఉంటున్నాడు. కాగా... గ్రొజాన్ శుక్రవారం ఇటలీలోని ముగెల్లో సర్క్యూట్లో తన పాత జట్టు ‘హాస్’ తరఫున కొత్త కారును పరీక్షించనున్నాడు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఫొటోలు ఉన్న హెల్మెట్ అతడు ధరించనున్నాడు.‘నిజంగా నమ్మశక్యంగా లేదు. ప్రమాదం జరిగి ఐదేళ్లు అయింది. పాత మిత్రులతో కలిసి తిరిగి కారు నడపనుండటం ప్రత్యేకమైన అనుభూతి’ అని గ్రొజాన్ పేర్కొన్నాడు. ప్రమాదం అనంతరం ఫార్ములావన్‌కు దూరమైన గ్రొజాన్... అమెరికా వేదికగా జరిగే ఇండి కార్, స్పోర్ట్స్ కార్ సిరీస్‌ల్లో పాల్గొంటున్నాడు.చదవండి: దబంగ్ ఢిల్లీ ‘టాప్’ షో