breaking news
rest rooms
-
జొమాటో సూపర్ న్యూస్.. వారికి ఇక ఇబ్బందులు తప్పినట్టే!
ఉరుకులు, పరుగులు పెడుతూ విశ్రాంతి లేకుండా సేవలందిస్తున్న ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌కు జొమాటో సూపర్ న్యూస్ చెప్పింది. ఆర్డర్స్ స్వీకరించడం, డెలివరీ చేయడం.. ఇలా బిజీ షెడ్యూల్‌తో ఫుడ్ డెలివరీ ఏజెంట్స్ పనిచేస్తుంటారు. కాస్త విశ్రాంతి తీసుకుందామన్న సమయం దొరకదు. సమయం దొరికినా ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో డెలివరీ ఏజెంట్ల కోసం ‘రెస్ట్ పాయింట్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేవలం జొమాటో ఏజెంట్స్ మాత్రమే కాకుండా ఇతర సంస్థలకు చెందిన డెలివరీ ఏజెంట్లు కూడా ఈ రెస్ట్ పాయింట్లను వినియోగించుకోవచ్చని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. గురుగ్రామ్‌లో ఇప్పటికే రెండు రెస్ట్ పాయింట్లు ఏర్పాటు చేశామని, త్వరలోనే మరికొన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రెస్ట్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెస్ట్ పాయింట్స్‌లో తాగునీరు, ఫోన్ ఛార్జింగ్, హై-స్పీడ్ ఇంటర్నెట్, వాష్‌రూమ్‌లు, 24×7 హెల్ప్‌డెస్క్, ఫస్ట్ ఎయిడ్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం విధులు నిర్వర్తిస్తున్న డెలివరీ ఏజెంట్స్ సంక్షేమంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు దీపిందర్ గోయల్ తెలిపారు. ఈ రెస్ట్ పాయింట్స్ ఏర్పాటుతో ఏజెంట్లు అలసట నుంచి విముక్తి పొంది శారీరకంగా, మానసికంగా ఉపశమనం పొందుతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: Neal Mohan యూట్యూబ్ కొత్త సీఈవో: మరోసారి ఇండియన్స్ సత్తా) -
48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూమ్!
న్యూఢిల్లీ: రైలు ఎక్కేందుకు ట్రాఫిక్ కారణంగా కాస్త ముందుగా వెళ్లాలనుకునే ప్రయాణికులు అక్కడ స్టేషన్లో విశ్రాంతి రూం సరిగా ఉండక ఎక్కడ బస చేయాలో తోచక ఇబ్బంది పడే ప్రయాణికుల కోసం ముంబై రైల్వే శాఖ సరికొత్త పాడ్ రూంలను అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలా మంది హోటల్‌కి వెళ్లి రూం అద్దెకు తీసుకోవడానికి ఇష్టపడరు. అటువంటి వారి కోసం ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని మొదటి అంతస్తులో 48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూంను అందుబాటులోకి తీసుకువచ్చింది. (చదవండి: అందాల పోటీలు.. 10 మందిని వెనక్కి నెట్టి విజేతగా 86 ఏళ్ల బామ్మ) అయితే వీటిలో క్లాసిక్ పాడ్లు, ప్రైవేట్ పాడ్లు "లేడీస్-ఓన్లీ" పాడ్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పాడ్లు వంటి గదులు ఉన్నాయి. దీన్ని క్యాప్సూల్ హోటల్‌గా పిలిచే ఈ పాడ్ హోటల్లో ఒక్కో మంచంతో కూడిన చిన్న గదులు ఉంటాయి. ఈ మోడల్ జపాన్‌లో ఉద్భవించింది. ఇది కేవలం రాత్రి బస చేయడానికి లేదా చిన్న వ్యాపార పర్యటనలో అలసటతో నిద్రపోవడానికి బయట హోటల్‌కి వెళ్లడానికి విముఖత చూపే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఈ కాంపాక్ట్ వసతి పరిష్కారాన్ని అందించింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూలో "స్నీక్ పీక్" అనే పేరుతో ఈ అత్యధునిక సరికొత్త విశ్రాంతి పాడ్ రూంలకు స్వాగతం అంటూ వాటికి సంబంధించిన వీడియోను ఒకటి సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. (చదవండి: బాప్రే! ఈ పేయింటింగ్ ధర రూ. 260 కోట్లా!!) Koo App Sneak Peek! Welcome to the new-age Pod retiring rooms by @RailMinIndia at Mumbai Central. View attached media content - Ashwini Vaishnaw (@ashwinivaishnaw) 17 Nov 2021 -
రైల్వే విశ్రాంతి గదుల బుకింగ్ ఇలా...
నిత్య జీవనంలో ప్రతి ఒక్కరికీ రైల్వే ప్రయాణ అవసరం ఉంటుంది. ఒకచోటి నుంచి మరోచోటికి వెళ్లాలన్నా.. పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలు, రాజధానులకు ఎక్కడికెళ్లాలన్నా..రైళ్లను ఆశ్రయిస్తుంటారు. మారుతున్న జీవన పరిస్థితులకనుగుణంగా నేడు రైల్వే కూడా సౌకర్యాలు విస్తృతం చేసింది. సేవలు సులభతరం చేసింది. అందుకనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. టికెట్ సులభంగా బుక్ చేసుకోవాలన్నా.. స్టేషన్లో రైలు దిగిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలన్నా..డివిజన్లోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యం ఉంది. రైల్వే ప్రయాణికులకు ఈ సమాచారం. - గుంతకల్లు సాధారణంగా రిజర్వేషన్ టిక్కెట్ కొన్న (టిక్కెట్ కన్ఫార్మ్డ్) ప్రయాణికులకు మాత్రమే రైల్వే గదుల కేటాయింపు ఉంటుంది. గదులను ‘‘గిగిగి.ఐఖఇఖీఇ.ఇౖM’’ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికులు రైలు ఎక్కేస్టేషన్, రైలు దిగే స్టేషన్ల ఆధారంగా రైల్వే గదుల బుకింగ్ సదుపాయం ఉంటుంది. గదుల్లో ఏసీ, నాన్ ఏసీ, సింగిల్, డబుల్ బెడ్ రూమ్‌లు ఉంటాయి. డివిజన్లోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యం ఉంది. గుంతకల్లు రైల్వే జంక్షన్‌లోని రైల్వే గదుల ధరల వివరాలు : రైల్వే జంక్షన్లో మొత్తం 10 గదులు ఉన్నాయి. వీటిలో ఒకటి ఏసీ గది. మిగిలినవి డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్ గదులు. ఏసీ గది రోజుకు (ఉదయం 6.00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6.00 గంటల వరకు) రూ.600, డబుల్‌కాట్ బెడ్రూం రోజుకు రూ.300, సింగిల్ కాట్ బెడ్రూం రూ.100 అద్దె వసూలు చేస్తారు. – డివిజన్ పరిధిలోని తిరుపతి, రేణిగుంట జంక్షన్లో ఏసీ డీలక్స్, నాన్ ఏసీ డబుల్, సింగిల్, డార్మెంటరీ హాల్ ఉన్నాయి. ఏసీ గదికి రూ.600, డబుల్‌కాట్ బెడ్రూంకు రూ.450, సింగిల్‌కాట్ బెడ్రూం రూ.90, డార్మెంటరీ హాల్‌కు రూ.175 అద్దె వసూలు చేస్తారు. -
వ్యవసాయ మార్కెట్లు వెలవెల
సాక్షి, కొత్తగూడెం: రైతులకు అన్నిచోట్ల కష్టాలే... ఆటుపోట్లను ఎదుర్కొని పండిచిన పంటను విక్రయించే చోట కూడా రైతును సమస్యలు వెంటాడుతున్నాయి. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేని స్థితిలో జిల్లాలో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. రైతు విశ్రాంతి భవనాలు, పంట ఉత్పత్తులు పోసే ప్లాట్‌ఫాంలు శిథిలావస్థకు చేరుకున్నా...ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పట్టించుకునే దిక్కులేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్లున్నాయి. ఖమ్మం, నేలకొండపల్లి, మధిర, వైరా, ఇల్లెందు, ఏన్కూరు, కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, కల్లూరు, సత్తుపల్లి, దమ్మపేటలో ఈ మార్కెట్లున్నాయి. వివిధ కేటగిరీల్లో ఈ మార్కెట్లలో మొత్తం 130 పోస్టులకుగాను 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం, వైరా, నేలకొండపల్లి, దమ్మపేట వ్యవసాయ మార్కెట్లకు పాలక వర్గాలు ఉండగా, మిగిలిన మార్కెట్లకు లేవు. ఖమ్మం, నేలకొండపల్లి మార్కెట్లకు పూర్తి స్థాయి అధికారులుండగా మిగతా మార్కెట్లు ఇన్చార్జిల పాలనలోనే సాగుతున్నాయి. జిల్లాలో వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా ఏ మార్కెట్లోనూ పూర్తి స్థాయిలో రైతులకు కావాల్సిన సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. విశ్రాంతి భవనాలు, తాగునీటి వసతి, భోజన హోటళ్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్కెట్లకు రైతులు ప్రధానంగా పత్తి, మిర్చి, అపరాలు, మొక్కజొన్న పంట ఉత్పత్తులను అమ్మకానికి తీసుకురావాలి. కానీ కొన్ని మార్కెట్లలో వసతులు లేకపోవడంతో అసలు కొనుగోళ్లే జరపడం లేదు. రైతులు కూడా మార్కెట్‌కు వెళ్తే గిట్టుబాటు ధర అందదని, సౌకర్యాలు ఉండవన్న కారణంతో అటువైపు అడుగుపెట్టడం లేదు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు లేకపోవడంతో రైతులు మార్కెట్లలో నిలువునా మోసపోతున్నారు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలోనే వ్యవసాయ మార్కెట్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ రైతు విశ్రాంతి భవనం మరమ్మతులకు నోచుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. మంచినీటి వసతి లేక రైతులు అవస్థలు అన్నీఇన్నీ కాదు. ఉన్న ట్యాంకుకు మరమ్మతులు చేయలేదు. మార్కెట్ యార్డుల్లో ఉన్న పంపులకు ట్యాప్‌లు పనిచేయడం లేదు. మార్కెట్ నిండా చెత్తా చెదారం పేరుకుపోయింది. యార్డుల్లో ఉన్న మూత్రశాలలు కంపుకొడుతున్నాయి. మార్కెట్లో అనుకోని పరిస్థితుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మించారు. అయితే ఇక్కడ ఇంకా ఫైరింజన్‌ను ఏర్పాటు చేయలేదు. ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ఏర్పాటు చేసినప్పటికీ అధికారికంగా ప్రారంభించలేదు. దమ్మపేట మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్కెట్ పరిధిలో ములకలపల్లిలో గోదాం ఉన్నప్పటికి నిర్వహణ లేక అది నిరుపయోగంగా ఉంది. చండ్రుగొండలో గోదాం ఉన్నా అసలు విద్యుత్ సౌకర్యమే లేదు. వైరాలో మార్కెట్ యార్డును అన్ని సదుపాయాలతో నిర్మించినప్పటికీ అక్కడ ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టడం లేదు. రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు ఏడాది క్రితం రూ.13 కోట్లతో నిర్మించిన గోదాంలు నిరుపయోగంగా మారాయి. అంతేకాకుండా ఇక్కడి వేబ్రిడ్జి మూలన పడింది. పంటల ధరలు, తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన రైతు సలహా కేంద్రంలో ఒక్క రోజు కూడా అధికార్లు కనిపించిన పాపాన పోలేదు. మూత్రశాలలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. ఏన్కూరు మార్కెట్ యార్డులో కేవలం ప్లాట్‌ఫాంలు మాత్రమే నిర్మించారు. గోదాంల నిర్మాణం ఇంకా చేపట్టలేదు. రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనం లేదు. తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యం లేదు. నిర్వహణ లేక ఇక్కడ ఉన్న వేబ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. మార్కెట్లో సీసీ రోడ్లు నిర్మించకపోవడంతో మార్కెట్ అంతా గుంతలమయంగా మారింది. నేలకొండపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనం ఉన్నప్పటికీ వసతులు లేక అది నిరుపయోగంగా ఉంది. రైతులు ధాన్యం నిల్వ చేసేందుకు నిర్మించిన గోదాంలను స్టోర్‌రూం గా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో ఉన్న యంత్రాలు తుప్పుపడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మార్కెట్లో విద్యుత్ సరఫరా చేసే స్తంభాలకు తీగలు వేలాడి ప్రమాదకరంగా మారాయి. బూర్గంపాడులోని వ్యవసాయ మార్కెట్ పరిధిలో మణుగూరు, పినపాక, గుండాల అశ్వాపురం మండల కేంద్రాల్లో గోదాంలు నిర్మించారు. అయితే ఇక్కడ సరైన వసతులు లేకపోవడంతో కొనుగోళ్లు జరగడం లేదు. ఈ గోదాంలను గ్యాస్‌గోదాంలు, చౌకధరల దుకాణాల నిల్వలకు ఉపయోగిస్తున్నారు. ఇల్లెందు మార్కెట్ యార్డులో దళారులు ఇష్టారాజ్యంగా తక్కువ ధరకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఈ మార్కెట్‌కు ఎక్కువగా రావడం లేదు. ఈ విషయంలో అధికారులు స్పందించకపోవడంతో యార్డులోని గోదాంలు, ఫ్లాట్ ఫాంలు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఈ యార్డు పరిధిలో టేకులపల్లిలో గోదాం ఉన్నా అది కూడా నిరుపయోగంగా మారింది. సత్తుపల్లి మార్కెట్‌యార్డుకి ఏటా రూ. కోటికి పైగా, కల్లూరు మార్కెట్‌కు రూ. కోటిన్నరకు పైగా సెస్ రూపంలో ఆదాయం వస్తోంది. మార్కెట్‌కు తీసుకొచ్చిన పంటలకు సరైన ధర కల్పించకపోవడంతో ప్రస్తుతం ఇక్కడి రైతులు అమ్మకానికి పంటలను ఎక్కువగా తీసుకురావడం లేదు. దీంతో రైతు విశ్రాంతి భవనాలు నిరుపయోగంగా మారాయి. గతేడాది రూ. లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన ప్లాట్‌ఫాంలు పిచ్చిమొక్కలతో నిండాయి. మధిర వ్యవసాయ మార్కెట్‌యార్డులో పత్తి మార్కెటింగ్ భవనం, వేబ్రిడ్జి నిరుపయోగంగా ఉన్నాయి. అప్పుడప్పుడు మిర్చి కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ రైతులకు తాగునీటి సౌకర్యంలేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, రైతుసేవాకేంద్రం రైతులకు అందుబాటులో లేవు. కొత్తగూడెం మార్కెట్‌యార్డులో రైతులకు విశ్రాంతిగదులు లేవు.., తాగునీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. రైతులు పండించిన అపారాలు, ధాన్యం, మొక్కజొన్నల నిల్వచేసేందుకు గోదాంలు ఉన్నాయి.. కానీ వాటిలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను వ్యాపారులే నిల్వ చేసుకుంటున్నారు. భద్రాచలం మార్కెట్ యార్డులో రైతులకు తాగునీటి సౌకర్యం లేదు. అసలు ఇక్కడ విశ్రాంతి భవనమే లేదు. చర్లలో మార్కెట్ కమిటీ యార్డు దూరంగా ఉండడంతో రైతులు ఇక్కడికి ధాన్యాన్ని తీసుకురావడం లేదు. దీన్ని గిరిజన సహకార సంస్థకు అద్దెకు ఇచ్చారు. దీంతో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోళ్లే జరగడం లేదు. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.