breaking news
Regional inequality
-
ప్రాంతీయ అసమానతలకు మళ్లీ ఆజ్యం
హైదరాబాద్: 'ఏ ప్రాంతీయ వాదమైతే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందో మళ్లీ అదే ప్రాంతీయ అసమానతలకు దారితీసేలా చంద్రబాబు అభివృద్ధి నమూనా ఉంది. చంద్రబాబు రాజకీయంగా దూరదృష్టితో ఆలోచించడం లేదు. కొత్త రాష్ట్రం మళ్లీ ముక్కలు కాకూడదు' అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి చెమటలు పట్టించేది కమ్యూనిస్టులేనని ఆయన అన్నారు. తామేమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసని, వాళ్లు తమను అర్థం చేసుకుంటారన్నారు. ఆదివారం నుంచి సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభలు విజయవాడలో జరుగనున్న తరుణంలో రాఘవులు శుక్రవారం ఇక్కడి ప్రకృతి చికిత్సాలయంలో 'సాక్షి ప్రతినిధి'తో మాట్లాడారు. 1997 డిసెంబర్ నుంచి 2014 మార్చి వరకు ఉమ్మడి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా వ్యవహరించిన రాఘవులు చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. హైదరాబాద్‌ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి తెలుగుదేశం అభివృద్ధి నమూనా సామాన్యులకు ఉపయోగపడేలా లేదు. రాజధానికి భూసమీకరణే దీనికి ఉదాహరణ. వేలాది ఎకరాల భూమిని సేకరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్లను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ అధికారులు 1,015 ఎకరాలు చాలంటుంటే 30 వేల ఎకరాలు కావాలని మంత్రులంటున్నారు. ఇదంతా ఎవరికోసం? కేంద్రీకృత అభివృద్ధి వల్ల ఎంత నష్టం జరిగిందో హైదరాబాద్‌ను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాల్సింది. విజయవాడ రాజధానిలోనూ కోటి మంది జనాభా ఉండేలా నగరం ఎం దుకు? ఇంత జనాభా ఒకేచోట ఉండాలం టే బాబే చెప్పినట్టు ఒక్కొక్కరు పది మందిని కనడమో లేక పెద్దఎత్తున వలసల్ని ప్రోత్సహించడమో చేయాలి. ఎక్కడికక్కడ అభివృద్ధి చేయడానికి బదులు మళ్లీ కేంద్రీకృతం చేస్తే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. రాష్ట్రం మళ్లీ ముక్కలవకుండా చూడాలి. బాబు దూరదృష్టితో ఆలోచించట్లేదు.. చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించట్లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలు వెనుకబడిన ప్రాంతాలు. ముందు వాటిని అభివృద్ధి చేయాలి. దీనికి బదులు అభివృద్ధి అంతా విజయవాడ చుట్టే తిప్పితే మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు బయలుదేరతాయి. బాబు నమునాతో సామాజిక న్యాయం లేకుండా పోయింది. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు చెల్లాచెదురుగా ఉన్న గిరిజనుల అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదు. సికిల్ అనీమియా(సాక్షిలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ), రక్తహీనత, మలేరియా వంటి వ్యాధులు ప్రబలినా పట్టించుకోలేదు. ప్రత్యేక ప్యాకేజీకి బదులు కేంద్రం ముష్టి రూ.350 కోట్లు ఇస్తే అదేమని అడగడానికి నోరురాని చంద్రబాబు ఐదు కోట్ల మందికి ఏదో చేస్తాడని భావించలేం. బూర్జువా పార్టీలతో కలసి పోటీచేయం.. మున్ముందు బూర్జువా పార్టీలతో, అదే భావజాలమున్న ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీచేయం. వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత, కలయికకే ప్రాధాన్యం. ప్రజాసమ స్యలపై ఎవరితోనైనా కలిసి పోరాటం చేస్తాం. కమ్యూనిస్టులు కలిస్తే పెద్ద శక్తే. దానిని గౌరవిస్తాం. ముందు రాజకీయ ఏకీభావం ఉండా లి. ఐక్యమై మళ్లీ విచ్ఛిన్నం కాకూడదు కదా.. ప్రజలకు ఆ విషయం తెలుసు... ఓట్లు, సీట్లు లేని పార్టీలు నిజమైన ప్రతిపక్ష పాత్ర ఏం పోషిస్తాయంటున్నారు కొందరు. సీట్లు లేనిమాట నిజమేగానీ చంద్రబాబు ప్రభుత్వానికి చెమటలు పట్టించేది మాత్రం కమ్యూనిస్టులే.. ప్రజలకు ఆ విషయం తెలుసు. పోరాటాలపై మహాసభల్లో కార్యాచరణ చంద్రబాబు మళ్లీ విద్యుత్ చార్జీలు పెంచుతామంటున్నారు. ఇప్పటికే పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ విధించారు. రుణమాఫీ పెద్ద గోల్మాల్ అయింది. కౌల్దార్లకు, డ్వాక్రా సంఘాలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు వాటిని విస్మరించి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వీటిపై ప్రజాస్వామిక శక్తులన్నీ కలిసి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోరా టాల పై కార్యాచరణను ఈ మహాసభల్లో రూపొం దిస్తాం. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర తొలి మహాసభలు జరుగుతున్నాయి. సమర్థ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కృషి చేస్తాం. -
ప్రాంతీయ అసమానతలను పెంచి పోషిస్తారా?
రాజధాని ఎంపిక కు ప్రాంతీయ అసమానతల తొలగింపు, అభివృద్ధి వికేంద్రీకరణ గీటు రాళ్లు కావాలి. వెనుకబడిన ప్రాంతంలోనే రాజధాని ఉండాలి. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, నగరాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రాంతీయ అసమానతలు మరింత పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం చూస్తే పాలకులు రాష్ట్ర ప్రజలతో ‘మైండ్ గేమ్’ ఆడుతున్నారనిపిస్తోంది. సీఎం ఆ లోచనలు, మాటలు గుంటూరు - విజ యవాడ - తెనాలి చుట్టే పరిభ్రమిస్తుం డటం చూస్తూనే ఉన్నాం. అన్ని ముఖ్య కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు, విద్యా, వైద్య సంస్థలను విశాఖ నుండి గుం టూరు పరిధిలోనే ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి రాజధానిపై ముందే నిర్ణయం జరిగిందనే భావన బలపడుతోంది. దుర దృష్టవశాత్తూ మన మహా నగరాల అభివృద్ధి అనుభవాల గుణ పాఠాల దృష్టి నుండి, ప్రాంతీయ అసమానతల వల్ల తలెత్తుతున్న సామాజిక ఉద్రిక్తతల నేపథ్యం నుండి మన రాజధాని ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? అనే అంశం చర్చకు రావడం లేదు. ముఖ్యమంత్రి సహా చాలా మంది రాజధానిని ఒక ‘స్వప్నసీమ’గా, సింగపూర్ దిగొచ్చినట్టుగా ఉండాలని భావిస్తున్నారు. ఇది చూస్తే హైదరాబాద్‌లో ప్రభు త్వ కార్యాలయాలు, అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల కలిగిన దుష్ఫలితాలను విస్మరించారనిపిస్తుంది. ఇక అత్యం త అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలున్న ఈరోజుల్లో రాజధాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండాలనే వాదన అర్థరహితం. అమెరికా రాజధాని ‘వాషింగ్టన్ డీసీ’ ఒక మూలకు ఉంది! తెలంగాణ, కర్నాటక (బెంగళూరు), తమిళనాడు (చెన్నై) రాజధానులు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలలో రాజధాని ఏర్పా టు వల్ల మౌలిక సదుపాయాల కల్పన సులభమనే వాదన సమంజసమైనదిగా కనబడుతుంది. కానీ రాజధాని ఎంపిక కమిటీ విధివిధానాలలోని 3వ క్లాజు... విలువైన వ్యవసాయ భూములను రాజధాని నిర్మాణానికి వాడరాదని విధించిన నిబంధన అత్యంత విజ్ఞతాయుతమైనది. మన మహా నగ రాల అభివృద్ధి అంతా పంట భూములను మింగేస్తూ జరిగినదే. దీంతో రైతులు, రైతు కూలీలు, వృత్తి పనివారి జీవితాలు ధ్వంసమయ్యాయి. మహానగరాల అభివృద్ధిలోని చీకటి నీడలను విస్మరించి అన్నీ అమరి ఉన్న నగరాల్లోనే రాజధానిని నిర్మించడం విధ్వంసకర వృద్ధికి ఆహ్వానం పలకడమే. పాలకుల దృష్టిలో ఉన్నవి నీటి పారుదల గల వ్యవసాయ భూములు. ప్రభుత్వ భూములు తక్కువ. అక్కడ భూసేకరణ అత్యంత ఖర్చుతో కూడిన పనే కాదు, అనర్ధదాయకం. అటవీ భూముల్లో రాజ ధానిని నిర్మించడం మరింత ప్రమాదకరం. రాష్ట్రంలో అడ వులు అభిలషణీయ స్థాయి కంటే చాలా తక్కువగా ఉన్నా యని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అకాల ప్రకృతి వైపరీత్యాలకు ఆలవాలమైన రాష్ట్రాన్ని మరింత ప్రమాదం లోకి నెట్టే యోచన అర్ధరహితం. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి నేడు దేశవ్యాప్తంగానే అత్యంత ప్రాధాన్యం గల అంశం. కాబట్టి రాజధాని ఎంపికకు ప్రాంతీయ అసమానతల తొలగింపు, అభివృద్ధి వికేంద్రీకరణ అనేవే ప్రధానమైన గీటు రాళ్లు కావాలి. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతంలోనే రాజధాని ఉండాలి. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలూ ఏర్పాటు ఆ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడు తుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, నగరాలకే ప్రాధా న్యం ఇవ్వడం ప్రాంతీయ అసమానతలు మరింత పెరుగు తాయి. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు ప్రజల్లో అసంతృప్తి పెరగడం, పోరాటాలకు దిగడం అనివార్యం. తెలంగాణ విడిపోయిన తర్వాతనైనా సీమ అవసరాలను గుర్తించక కేంద్ర, రాష్ట్ర సంస్థలను, ఆర్టీసీ, వ్యవసాయ విద్యాలయం, రైల్వే జోన్ తదితరాలన్నిటినీ కోస్తా పట్టణాలకు కేటాయి స్తున్నారు. దీంతో సీమ వాసుల్లో మరలా మోసపోతున్నా మనే భావన ఏర్పడింది. అలాగే ఉత్తరాంధ్ర (విశాఖపట్టణం మినహా) ప్రజల్లో కూడా కొత్త రాష్ట్రం తమను విస్మరించిం దనే భావన నెలకొంది. మేం ఆంధ్రప్రదేశ్‌లో భాగమేనా? అనే ప్రశ్న సీమ (ప్రకాశం, నెల్లూరు సహా), ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉదయిస్తోంది. అధికార కేంద్రీకరణలాగే అభివృద్ధి కేంద్రీకరణ కూడా అప్రజాస్వామికం. 1937లో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల ఐక్యతకు ప్రాతిపదికగా రూపొందిన ‘శ్రీబాగ్ ఒడంబడిక’ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదిక. ఆ చారిత్రక ఒప్పందాన్ని నేడైనా అమలు చేసి కర్నూలును రాజధాని చేయడం సబబు. కాదనుకుంటే సీమలోకెల్లా వెనుకబడిన అనంతపురం లేదా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం లేదా విజయనగరాల్లో ఒక దాన్ని లేదా పల్నాడును ఎంపిక చేయాలని రాయలసీమ విద్యా వంతుల వేదిక భావిస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో ఒక చోట రాజధానిని ఏర్పరిస్తే, రెండో చోట ఏడాదికి కనీసం ఒకమారు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, మూడవ చోట హైకోర్టును నెలకొల్పడం న్యాయం. అప్పుడే అన్ని ప్రాంతాల మధ్య సమ న్యాయాన్ని పాటించినట్టవుతుంది. (వ్యాసకర్త రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్) అరుణ్