breaking news
Redwood thieves
-
నల్లమల టు జపాన్, ఉత్తర కొరియా
కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న నల్లమలలో మళ్లీ ‘ఎర్ర’ దొంగల అలజడి మొదలైంది. గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే డాన్‌గా పేరుగాంచిన చాగలమర్రి మండల టీడీపీ నేత, మాజీ ఎంపీపీ మస్తాన్‌వలి, ఓ ఫారెస్టు అధికారి సోదరుడు అనిల్‌కుమార్ ఈ నెల 15న అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో స్మగ్లింగ్ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. సాక్షి, చాగలమర్రి: ప్రపంచంలో అరుదైన ఎర్రచందనం వృక్ష సంపద రాయలసీమ జిల్లాల్లో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఎర్రచందనానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉండంతో కొన్నేళ్లుగా స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. ఎర్రచందనం వృక్షాలను అడ్డంగా నరికేస్తూ..కలపను అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు తరలించి రూ.కోట్లు గడిస్తున్నారు. రుద్రవరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని పాములేటయ్య, బోత్సనిబండ, ఊట్ల, రాచపల్లెబీటు, అహోబిలం, డి.వనిపెంట, పెద్దవంగలి, ఆవుగోరి, మోత్కమానిబావి తదితర ప్రాంతాలతో పాటు వైఎస్సార్ జిల్లాలోని కె.వనిపెంట రేంజ్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. వీటితో పాటు అరుదైన మూలికా వృక్షాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎర్రచందనం వృక్షాలను కొందరు నరికించి, దుంగలుగా మార్చి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. కొన్ని నెలల కిందట కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. కొందరు తమిళ కూలీలను గుర్తించారు. అరెస్టు చేసేందుకు వెళ్లడంతో వారు తెచ్చుకున్న సామగ్రి, ఆహార పదార్థాలు వదలి పారిపోయారు. తర్వాత టాస్క్‌ఫోర్స్ అధికారులు నల్లమలలోని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎర్రచందనం జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా స్మగ్లర్ల తీరు మాత్రం మారడం లేదు. కొన్ని రోజుల నుంచి అహోబిలం, వనిపెంట, గండ్లేరు, ఆలమూరు తదితర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో వృక్షాలను నరికేస్తున్నారు. దుంగలను భుజంపై మోసుకుంటూ తీసుకొచ్చి.. రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో దాస్తున్నారు. ఎవరూ లేని సమయంలో పచ్చిమిర్చి సంచుల్లో దాచి వాహనాల్లో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చాగలమర్రి మండలంలోని చిన్నవంగలి ప్రాంతంలో నీటి కుంటలో దాచిన దుంగలను డి.వనిపెంట సెక్షన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గత నెల 19న డి.వనిపెంట సెక్షన్ పరిధిలోని ఓజీ తండా సమీపంలో దాచి ఉంచిన రూ.లక్ష విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. నల్లమల టు జపాన్, ఉత్తర కొరియా నల్లమల అడవుల నుంచి ఎర్రచందనాన్ని వాహనాల్లో చెన్నై తీసుకెళ్లి.. అక్కడి నుంచి సముద్ర మార్గం గుండా జపాన్, ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, చైనా తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా దేశాల్లో ఎర్రచందనానికి మంచి డిమాండ్ ఉంది. రుద్రవరం రేంజ్ పరిధిలో నల్లమల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాలో డాన్‌గా పేరుగాంచిన టీడీపీ నేత మస్తాన్ వలిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఇతనిపై గతంలో అటవీ అధికారులు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. ఏళ్ల తరబడి జైళ్లలో గడిపి.. టీడీపీ నాయకుల సహకారంతో బయటకు వచ్చాడు. తర్వాత కొన్ని నెలల పాటు అక్రమ రవాణాకు దూరంగా ఉన్న అతను మళ్లీ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఈ నెల 15న తాడిపత్రి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనితో చాగలమర్రికి చెందిన ఓ ఫారెస్టు అధికారి సోదరుడు అనిల్‌కుమార్ కూడా పట్టుబడడం గమనార్హం. వీరి నుంచి పోలీసులు రూ 2.70 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు, రూ 24,500 నగదు, స్కార్పియో, వెర్నా హుందాయ్, ఐషర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 66 కేసుల నమోదు రుద్రవరం రేంజ్ పరిధిలో 2015 నుంచి 2019 వరకు ఫారెస్టు అధికారులు 66 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదు చేశారు. అలాగే 117 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులలో 215 ఎర్రచందనం దుంగలతో పాటు 45 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గస్తీ నిర్వహిస్తున్నాం డి.వనిపెంట సెక్షన్ పరిధిలోని నల్లమలలో గస్తీ ముమ్మరం చేశాం. స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను అక్రమ రవాణా కోసం ఎంచుకుంటున్నారు. గిద్దలూరు, కడప, బద్వేల్ తదితర ప్రాంతాల నుంచి స్మగ్లర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ గస్తీ ముమ్మరం చేశాం. స్మగ్లర్ల ఆట కట్టిస్తాం. – శ్రీనివాసులు, డి.వనిపెంట అటవీ సెక్షన్ అధికారి -
‘ఎర్ర’దొంగల వేటకు ప్రత్యేక దళం
ఎర్రచందనం దొంగల వేటకు తిరుపతిలో ప్రత్యేక దళాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 463 మంది సిబ్బందితో ఏర్పాటయ్యే ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్(ఆర్ఎస్ఏఎస్టీఎఫ్)కు రాయలసీమ ఐజీ నేతృత్వం వహించనున్నారు. చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నియంత్రణలోనూ.. డీజీపీ పర్యవేక్షణలోనూ ఈ దళం పనిచేయనుంది. ఈ మేరకు అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్పీ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. * తిరుపతిలో ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు * రాయలసీమ ఐజీ నేతృత్వంలో విధుల నిర్వహణ సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 4.67 లక్షల హెక్టార్లలో విస్తరించిన శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ అడవుల్లో ఎర్రచందనం వృక్షసంపద విస్తారంగా లభిస్తుంది. ఎర్రచందనం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్‌ను సొమ్ముచేసుకునేందుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు దొంగలు తెరలేపారు. రెండు దశాబ్దాలుగా అడవుల్లో ఎర్రచందనం వృక్షాలను అడ్డంగా నరికివేసి.. వేలాది టన్నుల ఎర్రచందనాన్ని విదేశాలకు దొడ్డిదారిన ఎగుమతి చేశారు. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 8,500 టన్నుల ఎర్రచందనం అమ్మకానికి ప్రభుత్వం ఇటీవల టెండర్లు నిర్వహించడానికి సిద్ధమైంది. ఇటీవల 4,500 టన్నులను అమ్మేం దుకు ఈ-టెండర్ కమ్ వేలంను నిర్వహించిన విషయం విదితమే. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు చిత్తూరు, వైఎసార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశంజిల్లాల్లో ప్రభుత్వం ఎక్కడికక్కడ టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటుచేసింది. 41 మందికిపైగా ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించా రు. కానీ.. ఎర్రచందనం అక్రమ రవాణాకు మా త్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. ఏడు నెలల పరిధిలో 585 టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లర్ల నుంచి పోలీసులు, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడమే అందుకు తార్కాణం. జిల్లాల్లో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నట్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 4.67 లక్షల హెక్టార్లలో విస్తరించిన శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ అడవుల్లో ఎర్రచందనం వృక్షసంప ద విస్తారంగా లభిస్తుంది. ఎర్రచందనం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్‌ను సొమ్ముచేసుకునేందుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు దొంగలు తెరలేపారు. రెండు దశాబ్దాలుగా అడవుల్లో ఎర్రచందనం వృక్షాలను అడ్డంగా నరికివేసి.. వేలాది టన్నుల ఎర్రచందనాన్ని విదేశాలకు దొడ్డిదారిన ఎగుమతి చేశారు. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 8,500 టన్నుల ఎర్రచందనం అమ్మకానికి ప్రభుత్వం ఇటీవల టెండర్లు నిర్వహించడానికి సిద్ధమైంది. ఇటీవల 4,500 టన్నులను అమ్మేం దుకు ఈ-టెండర్ కమ్ వేలంను నిర్వహించిన విషయం విదితమే. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు చిత్తూరు, వైఎసార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశంజిల్లాల్లో ప్రభుత్వం ఎక్కడికక్కడ టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటుచేసింది. 41 మందికిపైగా ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించా రు. కానీ.. ఎర్రచందనం అక్రమ రవాణాకు మా త్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. ఏడు నెలల పరిధిలో 585 టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లర్ల నుంచి పోలీసులు, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడమే అందుకు తార్కాణం. జిల్లాల్లో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఎర్రచందనం అ క్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నట్లు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తేనే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చునని ప్రభుత్వానికి సూచిం చాయి. నిఘా వర్గాల నివేదిక మేరకు ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ ఏర్పాటుచేయాలని డీజీపీ జేవీ రాముడు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. 463 మందితో ప్రత్యేక దళం డీజీపీ జేవీ రాముడు చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆర్ఎస్ఏఎస్టీఫ్లో ఒక నాన్ కేడర్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు(సివిల్), నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు(సివిల్), రిజర్వు ఇన్స్పెక్టర్లు ఇద్దరు, ఆరుగురు సబ్ ఇన్స్పెక్టర్లు, ఏడుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 42 మంది కానిస్టేబుళ్లు(సివిల్), 20 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు.. ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, ముగ్గురు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు, 60 మంది కానిస్టేబుళ్లతో మూడు జిల్లా స్పెషల్ పార్టీలు.. అటవీ, గనులు భూగర్భ వనరులశాఖకు చెందిన సిబ్బంది మొత్తం 463 మంది ఉద్యోగులతో ప్రత్యేక దళం ఏర్పాటుకు నవంబర్ 25న ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక దళం ప్రధాన కేంద్రాన్ని తిరుపతిలో ఏర్పాటుచేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేసే బాధ్యతను అటవీశాఖకు ప్రభుత్వం అప్పగించింది. చంద్రగిరి మండలం ఎ.రంగంపేట వద్ద ప్రత్యేక దళం ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేసే అవకాశం ఉందని సమాచా రం. ఆర్ఎస్ఏఎఫ్టీఎఫ్కు అధునాతన ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఙానాన్ని సమకూర్చే బాధ్యతను హోం శాఖకు అప్పగించారు. నిఘా నుంచి దాడుల వరకు.. రాయలసీమ ఐజీ నేతృత్వంలో పనిచేసే ఈ ప్రత్యేక దళం జిల్లాల పోలీసులతో నిమిత్తం లేకుండా శేషాచలం, లంకమల, పాలకొండ, వెలిగొండ అడవుల్లో కూంబింగ్ చేపడుతుంది. ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా వేస్తుంది. స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం వస్తే రాష్ట్రంలో ఎక్కడైనా దాడులు చేసే అధికారాన్ని ఈ టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వం కట్టబెట్టింది. డీజీపీ పర్యవేక్షణలో సీమ ఐజీ ఈ ప్రత్యేక దళాన్ని సమన్వయపరుస్తారు. స్మగ్లర్లను అరెస్టు చేయడం నుంచీ వారికి శిక్ష పడేలా చేయడం వరకూ ఈ ప్రత్యేక దళం కృషి చేస్తుంది. సమన్వయలోపం వల్ల ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోందని.. ఇప్పుడు పోలీసు, అటవీశాఖ సిబ్బందితో ప్రత్యేక దళం ఏర్పాటుచేయడం.. వాటికి చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డీజీపీలు నేతృత్వం వహించడం వల్ల ఎర్రదొంగల ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చునని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.