breaking news
ratnalakunta
-
కల్పవల్లి.. రాట్నాలమ్మ తల్లి
సిరుల తల్లిగా.. కల్పవల్లిగా.. భక్తుల కొంగుబంగారంగా.. కోర్కెలు తీర్చే అమ్మవారిగా పూజలందుకుంటున్నారు రాట్నాలమ్మవారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలో అమ్మవారు రక్షణనిచ్చే శక్తిగా ప్రసిద్ధిగాంచారు. ఐదో శతాబ్ధంలో వేంగి రాజ్యాన్ని శత్రువుల బారినుంచి అమ్మవారు కంటికి రెప్పలా కాపాడారని శాసనాలు వెల్లడిస్తున్నాయి. శనివారం నుంచి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. పెదవేగి: ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు అమ్మవారి తిరునాళ్లను వైభవంగా నిర్వహిస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. భక్తులు తమ బిడ్డలకు అమ్మవారి సన్నిధిలో అన్నప్రాసనం, అక్షరాభ్యాసాలు చేయి స్తుంటారు. పాలుపొంగలి వండి నైవేధ్యం పెట్టి మొ క్కుబడి తీర్చుకుని తలనీలాలు ఇవ్వడం ఆచారం. రైతులు తమ పొలంలో పండిన పంటను కొంత భాగం అమ్మవారికి సమర్పించిన తర్వాతే ఇంటికి తీసుకువెళ్లడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వ స్తోంది. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలకు ఆలయాన్ని సిద్ధం చేశామని దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ చళ్లగొళ్ల వెంకటేశ్వరరావు, ఈఓ కలగర శ్రీనివాస్, కమిటీ సభ్యులు తెలిపారు. మహిమాన్వితం మహిమాన్విత దివ్యక్షేత్రంగా రాట్నాలమ్మ ఆలయం విరాజిల్లుతోంది. వేంగి రాజుల కాలంలో రాజ్యాన్ని కాపాడే శక్తిగా అమ్మవారు అవతరించారు. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో అమృత కలశంతో పులి వాహనంపై వెలిశారు. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి, చదుర్భుజ దుర్గాదేవి, షడ్భుజ దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి, సప్తమాత్రుకలు, వైదేహీ సూర్య ఉషాదేవి మొదలగు పరివార దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. ఐదు రోజుల ఉత్సవాలు తొలిరోజు అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిస్తారు. వేకువజామున 4.09 గంటలకు ప్రత్యేక పూజలతో తిరునాళ్లు ప్రారంభమవుతాయి. 17న అమ్మవారు మహాలక్ష్మిదేవి అలంకరణలో దర్శనమిస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 18న అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు పుష్పయాగోత్సవం. 19న అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తారు. రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం. 20న ఫల అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. ఉదయం 10 గంటల నుంచి అన్నసమారాధన ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు దీక్షా విరమణ, అవభృదోత్సవం, కుంభాభిషేకంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. -
రాట్నాలమ్మ ఆశీస్సులతోనే..
పెదవేగి (దెందులూరు): పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మ ఆశీస్సులతోనే తాను ఈ విజయం సాధించినట్టు పీవీ సింధు చెప్పారు. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో చైనా క్రీడాకారిణిపై సింధు విజయం సాధించిన నేపథ్యంలో ఆమె తండ్రి పీవీ రమణను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఈ విజయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పీవీ సింధును అదే ఫోన్ కాల్లో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడించారు. ఈ సందర్భంగా సింధు తన విజయంపై పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెదవేగి మండలం రాట్నాలకుంట అమ్మవారి కృపతోనే తాను విజయం సాధించినట్టు చెప్పారు. సింధు భారత్కు వచ్చాక రాట్నాలకుంటకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని రమణ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 25న సింధు తన తండ్రితో కలిసి రాట్నాలమ్మను దర్శించుకున్నారు. -
ముగిసిన రాట్నాలమ్మ తిరునాళ్లు
రాట్నాలకుంట (పెదవేగి రూరల్): కన్నుల పండువగా రాట్నాలమ్మతల్లి తిరునాళ్లు శనివారంతో ముగిశాయి. తిరునాళ్ల చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సీహెచ్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఉత్సవ మూర్తికి అవబృతోత్సవం, కుంభాభిషేకం, పుష్పయాగోత్సవం విజయవాడకు చెందిన మండలి హనుమంతరావు, పద్మ దంపతులు నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు ఉదయం 9 గంటల నుంచి అన్నసమారాధన, రాత్రి 7 గంటలకు వృక్ష కల్యాణం, కూచిపూడి నృత్య ప్రదర్శన, తెప్పోత్సవం భక్తులను అలరించాయి. రాత్రి 9 గంటలకు సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు.