తెలంగాణ తొలి అడ్వకేట్ జనరల్ మన జిల్లావాసే..
హుస్నాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి అడ్వకేట్ జనరల్‌గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కొండం రామకృష్ణారెడ్డిని శనివారం ప్రభుత్వం నియమించింది. ఈయన హుస్నాబాద్ మండలం జనగామ గ్రామానికి చెందినవారు. కొండం గోవిందరెడ్డి, మణమ్మలకు నలుగురు కొడుకులు. రెండో సంతానమైన రామకృష్ణారెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం జనగామ, అంతకపేటలో సాగించారు. కరీంనగర్లో హెచ్ఎస్సీ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ, ఎంఏ పూర్తి చేసిన అనంతరం అదే వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు.
1980లో హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన రామకృష్ణారెడ్డి ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పలు కేసుల్లో వాదించి సమర్థుడనే పేరుపొందారు. ఆయన ప్రతిభను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర తొలి అడ్వకేట్ జనరల్‌గా నియమించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన ఫోన్లో మాట్లాడుతూ.. మన తెలంగాణ సర్కారులో అ డ్వకేట్ జనరల్‌గా నియమించడం తనకు చాలా ఆనందం గా ఉందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలి పారు. ఆయన నియామకంపై స్ఫూర్తి అసోసియేషన్ అ ధ్యక్షుడు పందిల్ల శంకర్, జనగామ ఎంపీటీసీ సభ్యుడు కా సర్ల ఆశోక్‌బాబు, గ్రామస్తులు అన్నబోయిన సుందరయ్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన సుదర్శన్‌రెడ్డి కూడా మన జిల్లా వాసే కావడం గమనార్హం. వరుసగా రెండుసార్లు ఈ ఉన్నత పదవి మన జిల్లాకు దక్కడం విశేషం.