breaking news
Rajiv Gandhi University of Science Education
-
ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలి
సాక్షి, బెంగళూరు: దేశంలో కరోనా మహమ్మారిని చూసిన తర్వాత గుణపాఠాలు నేర్చుకుని ప్రజా ఆరోగ్యానికి అన్ని ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఆదివారం బెంగళూరులోని నిమ్హాన్స్లో జరిగిన రాజీవ్‌గాంధీ ఆరోగ్య యూనివర్సిటీ 23వ వార్షిక స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎంబీబీఎస్, పీజీ పట్టభద్రులకు పట్టాలను, బంగారు పతకాలను అందజేసి ప్రసంగించారు. ఆరోగ్యం, విద్యా రంగాలు అత్యంత ప్రధాన రంగాలని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల విజయం .. భవిష్యత్తులో కరోనా వంటి అంటురోగాలు విస్తరించకుండా అడ్డుకట్ట వేయాలంటే ఆరోగ్య రంగం మరింత బలోపతం కావాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ యోజన ద్వారా మన శాస్త్రవేత్తలు కరోనాకు టీకాను కనిపెట్టారని, దీనివల్ల మనదేశంలో లక్షలాది మందికి వ్యాక్సిన్ అందించడం సాధ్యమైందని చెప్పారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలకు సైతం కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసిన ఘనత మనదేశానికి దక్కుతుందని చెప్పారు. ఇది మన శాస్త్రవేత్తల విజయమని కొనియాడారు. కోవిడ్ సమయంలో వైద్యులు, వైద్య విద్యార్థులు తమ జీవితాలను పణంగా పెట్టి పని చేశారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీ నిర్వహణపై సర్కార్ మల్లగుల్లాలు
స్వయం ప్రతిపత్తి కొనసాగించే అవకాశం? సాక్షి, హైదరాబాద్: బాసరలోని ట్రిపుల్ ఐటీ నిర్వహణను హైదరాబాద్ ట్రిపుల్ఐటీ తరహాలో చేపట్టే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. బాసర, నూజివీడు, ఇడుపులపాయలోని ఏపీ ట్రిపుల్ ఐటీలను నిర్వహిస్తున్న రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) విభజనపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. బాసర ట్రిపుల్ఐటీ తెలంగాణ పరిధిలోకి రాగా, ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోకి వెళ్లాయి. ప్రస్తుతానికి బాసర ట్రిపుల్ ఐటీ నిర్వహణకోసం ఆర్జీయూకేటీ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి వర్తింపచేసుకునే చర్యలపై దృష్టిపెట్టినా, ఒక్క విద్యా సంస్థ కోసం యూనివర్సిటీ, దానికో ప్రత్యేకవ్యవస్థ అవసరమా? అనే భావన ప్రభుత్వవర్గాల్లో నెలకొంది. అయితే ట్రిపుల్‌ఐటీలో ఆరేళ్ల సమీకృత బీటెక్ డిగ్రీని ఆర్జీయూకేటీ నిర్వహిస్తున్నందున, దానిని హైదరాబాద్‌లోని జేఎన్టీయూ పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం లేదు. పైగా ఇందులో ప్రవేశాల తీరు వేరు. జేఎన్టీయూలో ప్రవేశాల విధానం వేరు. గ్రామప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందించే లక్ష్యంతో, వారికే సీట్లను కేటాయించేలా ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్థలో పదోతరగతిలో మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తుండగా, జేఎన్టీయూ పరిధిలో ఎంసెట్ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో, స్వయంప్రతిపత్తితో హైదరాబాద్ ట్రిపుల్ఐటీ కొనసాగుతోంది. ఇదే తరహాలో బాసర ట్రిపుల్ ఐటీని కూడా రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ పరిధిలో స్వయంప్రతిపత్తితో కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్ ఐఐఐటీ నిర్వహణ విధానాన్ని పరిశీలించాలని భావిస్తోంది. ఒకవేళ ఆర్జీయూకేటీని యథాతథంగా కొనసాగించాల్సి వస్తే, ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్ రాజిరెడ్డిని చాన్స్‌లర్‌గా కాకుండా, రాష్ట్ర గవర్నర్‌ను చాన్స్‌లర్‌గా కొనసాగించాలనే యోచన ఉంది. ఏది చేయాలన్నా చట్టాన్ని సవరించాల్సి ఉంది.